Vijayawada CP: సిఎంను రాయితోనే కొట్టారు… రాయిని దేనితో విసిరారో మాత్రం ఇంకా తెలీదన్న విజయవాడ సీపీ కాంతిరాణా-vijayawada cp kanti rana clarified that there was a stone attack on chief minister jagan ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Vijayawada Cp: సిఎంను రాయితోనే కొట్టారు… రాయిని దేనితో విసిరారో మాత్రం ఇంకా తెలీదన్న విజయవాడ సీపీ కాంతిరాణా

Vijayawada CP: సిఎంను రాయితోనే కొట్టారు… రాయిని దేనితో విసిరారో మాత్రం ఇంకా తెలీదన్న విజయవాడ సీపీ కాంతిరాణా

Sarath chandra.B HT Telugu
Apr 15, 2024 07:01 PM IST

Vijayawada CP: ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డిపై రాయితో దాడి జరిగిందని, అందుబాటులో ఉన్న సీసీ టీవీ ఫుటేజీల ఆధారంగా రాయితోనే దాడి చేసినట్టు భావిస్తున్నట్లు చెప్పారు.

సిఎం జగన‌‌పై దాడి వ్యవహారంలో ఈసీకి వివరణ ఇస్తున్న  పోలీస్ అధికారులు
సిఎం జగన‌‌పై దాడి వ్యవహారంలో ఈసీకి వివరణ ఇస్తున్న పోలీస్ అధికారులు

Vijayawada CP: ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డిపై Ys Jagan రాయితోనే దాడి Attack చేశారని విజయవాడ సీపీ కాంతిరాణా CP Kanthi Rana నిర్ధారించారు. అందుబాటులో ఉన్న సీసీటీవీ  ఫుటేజీలను విశ్లేషించిన తర్వాత నిర్ధారణకు వచ్చినట్టు చెప్పారు. దాడి చేసిందెవరో ఇంకా గుర్తించలేదని సీపీ స్పష్టం చేశారు. తమ వద్ద ఉన్న ఆధారాలతో నిందితుడిని గుర్తించెందుకు ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు.

శనివారం రాత్రి 8.04 గంటలకు సిఎం జగన్‌పై దాడి జరిగిందని సీపీ చెప్పారు. 24 సీసీ ఫుటేజీలను పరిశీలించిన తర్వాత రాయితో దాడి చేసినట్టు నిర్ధరాణకు వచ్చినట్టు చెప్పారు. ముఖ్యమంత్రికి తగిలిన తర్వాత అదే రాయి పక్కన ఉన్న వెల్లంపల్లికి తగిలిందని వివరించారు. ఈ కేసు దర్యాప్తు కోసం 8 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్టు చెప్పారు.

ఎన్టీఆర్ జిల్లాలో సిఎం బస్సు యాత్ర 22కిలోమీటర్ల మేర బస్సుయాత్ర కొనసాగిందని, మొత్తం 1480 మంది పోలీసు సిబ్బంది విధులు నిర్వహించారని చెప్పారు. బస్సు యాత్ర వెంబడి మొత్తం 40 రోప్ పార్టీలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ట్రాఫిక్, ఏపీఎస్పీ టీమ్స్, డాగ్ స్క్వాడ్స్, యాక్సిస్ కంట్రోల్ సిబ్బంది కూడా పనిచేశారన్నారు.

బస్సు యాత్రకు అడ్డంకులు ఉన్న చోట వీలైనన్ని చోట్ల కరెంట్ నిలిపివేస్తారని వివరణ ఇచ్చారు. సెక్యూరిటీ, సేఫ్టీ కోసం రూఫ్ టాప్ వీఐపీ ప్రోగ్రామ్ ఉన్నచోట కరెంట్ సరఫరా నిలిపివేస్తారని, బస్సుయాత్ర డాబా కొట్లు దాటి వివేకానంద స్కూల్ వద్దకు వచ్చేసరికి ఒక వ్యక్తి బలంగా రాయి విసిరాడని సీపీ చెప్పారు.

రాయి సీఎం కంటిపై తగిలిన తర్వాత వెల్లంపల్లి కంటికి తగిలిందని, కేసు దర్యాప్తు కోసం గతంలో పనిచేసిన అధికారులతో కలిపి టీమ్స్ ఏర్పాటు చేశామన్నారు. ఆ సమయంలో అక్కడ ఎవరెవరు ఉన్నారో సెల్ ఫోన్స్ డేటా పరిశీలించామని చెప్పారు. 50మందికి పైగా అనుమానితులను విచారించామని, అతి తొందర్లోనే కచ్చితంగా నిందితుడిని పట్టుకుంటామని చెప్పారు.

రాయి విసిరింది ఎవరో తెలుసుకోడానికి ప్రయత్నిస్తున్నట్టు సీపీ కాంతిరాణా చెప్పారు. ఈ కేసులో బలమైన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని చెప్పారు. అతి త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామన్నారు. విజయవాడలో 22కి.మీల పొడవున సిఎం రోడ్‌ షో జరిగిందని భద్రత కోసం 1400మంది సిబ్బందిని వినియోగించినట్టు చెప్పారు. ర్యాలీ సింగనగర్‌లోకి ప్రవేశించిన తర్వాత డాబా కొట్ల సెంటర్‌లోకే వెళ్లే సమయంలో దాదాపు 4-5వేల మంది ప్రజలు ఉన్నారని, ఘటనా స్థలంలో ఐదారు వేలమంది గుమిగూడి ఉన్నారని చెప్పారు.

వివేకానంద స్కూల్‌, గంగానమ్మ గుడి మధ్యలో ఉన్న ఖాళీ స్థలం నుంచి లేదా,స్కూల్ భవనం నుంచి దాడి చేసి ఉండొచ్చని చెప్పారు. రూఫ్ టాప్‌ బస్సులో ప్రయాణిస్తున్నందునే ఆ ప్రాంతంలో విద్యుత్ సరఫరా నిలిపి వేసినట్టు చెప్పారు. కేసు దర్యాప్తు కోసం 8 ప్రత్యేక బృందాలతో కేసు దర్యాప్తు చేపట్టినట్టు చెప్పారు. సీసీ టీవీ ఫుటేజీ, సెల్ ఫోన్ కాల్ డేటా డంప్‌లను పరివీలిస్తున్నామని చెప్పారు. దాడి చేసిన రాయిని ఇంకా గుర్తించలేదని, ఘటన జరిగిన వెంటనే సంఘటనా స్థలాన్ని పరిశీలించామని చెప్పారు.

ముఖ్యమంత్రి జగన్‌ మీద రాయితోనే దాడి జరిగిందని, ఎయిర్ గన్‌‌తో చేసిన దాడి కాకపోవచ్చన్నారు. రాయిని దేనితో విసిరారనే దానిపై స్పష్టత రావాల్సి ఉందన్నారు. ప్రస్తుతం తమ వద్ద 2మెగా పిక్సెల్ ఎవిడెన్స్‌ మాత్రమే ప్రస్తుతం అందుబాటులో ఉందని చెప్పారు. కేసును త్వరలోనే చేధిస్తామన్నారు.

విజయవాడ సీపీని దర్యాప్తు నుంచి తప్పించాలన్న టీడీపీ….

ముఖ్యమంత్రి జగన్‌పై దాడి వ్యవహారంలో దర్యాప్తు నుంచి విజయవాడ సీపీని తప్పించాలని టీడీపీ నేతలు గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. దాడి తర్వాత సెక్యూరిటీ సిబ్బంది కిందకు ఒంగితే, సిఎం మాత్రం నిలబడి ఉన్నారని, ఇదంతా పద్ధతి ప్రకారం జరిగిందన్నారు. కోడికత్తి కేసు తరహాలో ఈ కేసులో మరో అమాయకుడిని బలి చేస్తారన్నారు. జగన్‌పై దాడి వ్యవహారంలో సిబిఐ విచారణ జరపాలని వర్ల రామయ్య డిమాండ్ చేశారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం