Vijayawada SPA Jobs : విజయవాడ ఎస్పీఏలో అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
Vijayawada SPA Jobs : విజయవాడలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్‌లో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది.
Vijayawada SPA Jobs : విజయవాడలోని జాతీయ సాంకేతిక విద్యా సంస్థ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్‌లో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది. అందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
పోస్టులు ఎన్ని ?
మొత్తం పోస్టులు నాలుగు ఉన్నాయి. అందులో మూడు ప్రొఫెసర్, ఒకటి అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు ఉన్నాయి. ఈ నాలుగు పోస్టులు కూడా ప్లానింగ్ విభాగంలో ఒకటి, ఆర్కిటెక్చర్ విభాగంలో మూడు పోస్టులు భర్తీ చేస్తారు. ప్లానింగ్ విభాగంలో ఉన్న ఒక్క పోస్టూ ప్రొఫెసర్ పోస్టే. అయితే ఆర్కిటెక్చర్ విభాగంలో ఉన్న మూడు పోస్టులలో రెండు ప్రొఫెసర్, ఒకటి అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు ఉన్నాయి.
రిజర్వేషన్ కేటగిరీల వారీగా పోస్టులు
భర్తీ చేసే నాలుగు పోస్టులూ రిజర్వేషన్ కేటగిరీకి చెందినవే. జనరల్ కేటగిరీలో ఒక్క పోస్టు కూడా లేదు. ప్లానింగ్ విభాగంలో ఉన్న ఒకేఒక్క ప్రొఫెసర్ పోస్టు ఓబీసీ కేటగిరీకి చెందినది. అలాగే ఆర్కిటెక్చర్ విభాగంలో ఉన్న రెండు ప్రొఫెసర్ పోస్టులలో ఒకటి ఎస్సీ, ఒకటి ఓబీసీ కేటగిరీకి చెందినవి. అయితే ఆర్కిటెక్చర్ విభాగంలో ఉన్న అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టు మాత్రం ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి చెందినది.
జీతం ఎంతో తెలుసా?
ప్రొఫెసర్ పోస్టులు, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులకు జీతం ఎంతో తెలుసా? ఏకంగా లక్షల్లోనే జీతాలు ఉన్నాయి. ప్రొఫెసర్ పోస్టుకు నెలకు రూ.1,44,200 కాగా, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుకు నెలకు రూ.1,31,400 జీతం ఉంటుంది. ప్లానింగ్ విభాగంలో ప్రొఫెసర్ పోస్టుకు అప్లై చేయడానికి కనీస అర్హతలు కనీసం పదేళ్లు టీచింగ్, రీసెర్చ్ అనుభవం ఉండాలి. లేదా కనీసం ఐదేళ్ల పాటు అసోసియేట్ ప్రొఫెసర్‌గా అనుభవం ఉండాలి. అలాగే ఆర్కిటెక్చర్, ప్లానింగ్, ఇంజినీరింగ్, టెక్నాలజీల్లో బ్యాచిలర్ డిగ్రీ, ప్లానింగ్‌లో ఫస్ట్ క్లాస్ (కనీసం 60 శాతం)తో మాస్టర్ డిగ్రీ, పీహెచ్‌డీ, లేదా ఎకనామిక్స్, సోషియాలజీ, జాగ్రఫీల్లో మాస్టర్ డిగ్రీ, ఆయా సబ్జిట్లలో పీహెచ్‌డీ పూర్తి చేసి ఉండాలి. పీహెచ్‌డీ పూర్తి అయినవారు ఐదు అంతర్జాతీయ జర్నల్స్‌లో పేపర్స్ పబ్లిష్ అయి ఉండాలి.
ఆర్కిటెక్చర్ విభాగంలో ప్రొఫెసర్ పోస్టుకు అప్లై చేయడానికి కనీస అర్హతలు ఇలా ఉన్నాయి. కనీసం పదేళ్లు టీచింగ్, రీసెర్చ్ అనుభవం ఉండాలి. లేదా కనీసం ఐదేళ్ల పాటు అసోసియేట్ ప్రొఫెసర్‌గా అనుభవం ఉండాలి. ఆర్కిటెక్చర్‌లో బ్యాచిలర్, మాస్టర్స్ డిగ్రీ ఫస్ట్ క్లాస్ (కనీసం 60 శాతం)తో పూర్త చేసి ఉండాలి. అలాగే పీహెచ్‌డీ పూర్తి చేయాలి. పీహెచ్‌డీ పూర్తి అయినవారు ఐదు అంతర్జాతీయ జర్నల్స్‌లో పేపర్స్ పబ్లిష్ అయి ఉండాలి.
ఆర్కిటెక్చర్ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుకు అప్లై చేయడానికి కనీస అర్హతలు ఇలా ఉన్నాయి. కనీసం ఐదేళ్లు టీచింగ్, రీసెర్చ్ అనుభవం ఉండాలి. లేదా అసోసియేట్ ప్రొఫెసర్ స్థాయికి సమానంగా ఉండే హోదాలో కనీసం ఎనిమిదేళ్ల అనుభవం ఉండాలి. అయితే పీహెచ్‌డీ లేని లెక్చరర్స్ అనుమతి లేదు. ఆర్కిటెక్చర్‌లో బ్యాచిలర్, మాస్టర్స్ డిగ్రీ ఫస్ట్ క్లాస్ (కనీసం 60 శాతం)తో పూర్తి చేసి ఉండాలి. అలాగే పీహెచ్‌డీ పూర్తి చేయాలి. పీహెచ్‌డీ పూర్తి అయినవారు ఐదు అంతర్జాతీయ జర్నల్స్‌లో పేపర్స్ పబ్లిష్ అయి ఉండాలి.
దరఖాస్తు ఎలా చేయాలి?
దరఖాస్తును ఆఫ్‌లైన్‌లోనే దాఖలు చేయాలి. స్కూల్ ఆఫ్ ప్లానిగ్ అండ్ ఆర్కిటెక్చర్ విజయవాడ (ఎస్‌పీఏవీ) అధికారి వెబ్‌సైట్‌లో దరఖాస్తు అందుబాటులో ఉంది. దాన్ని డౌన్‌లోడ్ చేసుకున్న తరువాత, దరఖాస్తును పూర్తి చేసి పోస్టు చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ డౌన్‌లోడ్‌కు అధికారిక వెబ్‌సైట్ డైరెక్ట్ లింక్ https://www.spav.ac.in/2024/recruit/Faculty%20recruitment%20-%20Application%20form%202023.pdf. దీనిపై క్లిక్ చేస్తే అప్లికేషన్‌ను డైరెక్ట్‌గా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
అప్లికేషన్ ఫీజు
అప్లికేషన్ ఫీజు రూ.1,000. అయితే ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగు, మహిళ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు. అప్లికేషన్ ఫీజు ఎస్‌బీఐలోనే ఆన్‌లైన్‌లో చెల్లించాలి. ఒకవేళ ఆన్‌లైన్‌లో చెల్లించలేని అభ్యర్థులు డీడీ తీయాల్సి ఉంటుంది. “School of Planning and Architecture,Vijayawada” పేరు మీద డీడీ తీయాలి.
అప్లికేషన్ పంపాల్సిన చిరునామా
అప్లికేషన్ పంపాల్సిన చిరునామా “The Director, School of Planning and Architecture, Vijayawada, 4/4, ITI Road, Vijayawada-520008, Andhra Pradesh. అప్లికేషన్‌తో పాటు ఇతర సర్టిఫికేట్లను కూడా జత చేయాల్సి ఉంటుంది. ఇతర వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ను https://www.spav.ac.in/ సంప్రదించాలి.
జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు
సంబంధిత కథనం