Vangaveeti Radha Marriage: విజయవాడలో ఘనంగా వంగవీటి రాధా వివాహం-vangaveeti radha married grandly in vijayawada ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Vangaveeti Radha Marriage: విజయవాడలో ఘనంగా వంగవీటి రాధా వివాహం

Vangaveeti Radha Marriage: విజయవాడలో ఘనంగా వంగవీటి రాధా వివాహం

Sarath chandra.B HT Telugu
Oct 23, 2023 08:03 AM IST

Vangaveeti Radha Marriage: వంగవీటి రంగా తనయుడు వంగవీటి రాధా వివాహం విజయవాడలో ఘనంగా జరిగింది. గత నెలలో పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన యువతితో రాధా నిశ్చితార్థం జరగ్గా ఆదివారం రాత్రి వివాహం జరిగింది.

ఘనంగా వంగవీటి రాధా వివాహం
ఘనంగా వంగవీటి రాధా వివాహం

Vangaveeti Radha Marriage: వంగవీటి మోహనరంగా తనయుడు, మాజీ ఎమ్మెల్యే రాధా, పుష్పవల్లిల వివాహం ఆదివారం రాత్రి విజయవాడ పోరంకిలోని ఎం రిసార్ట్స్‌లో జరిగింది. ఈ వివాహానికి జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌, నాదెండ్ల మనోహర్‌, బిఆర్‌ఎస్‌ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్‌, ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యేలు కొడాలి నాని, కొలుసు పార్థసారథి, వల్లభనేని వంశీ, గద్దె రామ్మోహన్‌ తదితరులు హాజరయ్యారు.

వంగవీటి రంగా తనయుడు వంగవీటి రాధాకృలష్ణ వివాహం ఘనంగా జరిగింది. నరసాపురానికి చెందిన జక్కం బాబ్జి, అమ్మాణిల కుమార్తె పుష్పవల్లితో రాధా వివాహం విజయవాడ పోరంకిలోని మురళీ రిసార్ట్స్ వైభవంగా జరిగింది. వివాహానికి పెద్ద ఎత్తున అభిమానులు తరలి వచ్చారు

పార్టీలకు అతీతంగా పలువురు ప్రముఖులు విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించారు. రాధా వివాహానికి పవన్ కళ్యాణ్‌ హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించిన పవన్ కొద్దిసేపు రాధాతో ముచ్చటించి వెళ్లిపోయారు. రాధా పెళ్లి ఫోటోలను జనసేన అధికారిక అకౌంట్ లో పోస్ట్ చేసి.. రాధాకు శుభాకాంక్షలు తెలిపింది.

వంగవీటి రంగా తనయుడిగా కోస్తా జిల్లాల్లో రాధాకు మంచి గుర్తింపు ఉంది. 2004లో 25ఏళ్ల వయసులోనే ఎమ్మెల్యేగా గెలిచిన రాధా ఆ తర్వాత రాజకీయంగా చేసిన పొరపాట్లతో ఎదురు దెబ్బలు తిన్నారు. వంగవీటి రాధా కృష్ణ విజయవాడ తూర్పు నియోజక వర్గం నుంచి కాంగ్రెస్‌ పార్టీ తరపున తొలిసారి 2004లో గెలిచారు. 2009లో పిఆర్పీలోకి వెళ్లారు. 2014నాటికి వైసీపీలో ఉన్నారు. 2019 ఎన్నికలకు ముందు టీడీపీలో చేరారు. రాజకీయాల్లో చురుగ్గా కొనసాగుతున్నా ఎన్నికల్లో మాత్రం గెలవలేదు. రానున్న ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్ నియోజక వర్గం నుంచి రాధా పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది.

Whats_app_banner