Tirumala : జనవరి 2024లో శ్రీవారి దర్శనం టికెట్లు.. షెడ్యూల్‌ విడుదల, ఇవిగో తేదీలు-tirumala srivari arjitha seva tickets for january 2024 check details inside artilce ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Tirumala : జనవరి 2024లో శ్రీవారి దర్శనం టికెట్లు.. షెడ్యూల్‌ విడుదల, ఇవిగో తేదీలు

Tirumala : జనవరి 2024లో శ్రీవారి దర్శనం టికెట్లు.. షెడ్యూల్‌ విడుదల, ఇవిగో తేదీలు

Maheshwaram Mahendra Chary HT Telugu
Oct 12, 2023 02:22 PM IST

Tirumala Darshan Tickets: శ్రీవారి భక్తులకు అలర్ట్ ఇచ్చింది తిరుమల తిరుపతి దేవస్థానం. 2024 జనవరి నెల‌ శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటాను విడుదల చేసింది. రూ.300 ప్రత్యేక దర్శనం టికెట్లతోపాటు ఎర్న్‌డ్‌ సర్వీస్‌, వర్చువల్‌ సేవ, అంగప్రదక్షిణ టికెట్ల షెడ్యూల్‌ను కూడా ప్రకటించింది టీటీడీ.

తిరుమల తిరుపతి దర్శన టికెట్లు
తిరుమల తిరుపతి దర్శన టికెట్లు (TTD)

Tirumala Tirupati Devasthanams News: కొత్త సంవత్సరం జనవరిలో తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని అనుకుంటున్నారా..? అయితే దర్శన టికెట్లకు సంబంధించి షెడ్యూల్ ను విడుదల చేసింది టీటీడీ. ఈ మేరకు వివరాలను పేర్కొంది. టీటీడీ షెడ్యూల్ ప్రకారం… 2024 జనవరి నెల‌ తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్ల కోటాను విడుదల చేస్తోంది. ఇందులో భాగంగా జనవరి నెలకు సంబంధించిన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళపాదపద్మారాధన ఆర్జిత సేవల ఆన్ లైన్ లక్కీడిప్ కోసం అక్టోబర్ 18వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు నమోదు చేసుకోవచ్చని తెలిపింది.

yearly horoscope entry point

లక్కీడిప్‌లో టికెట్లు పొందిన భక్తులు అక్టోబర్ 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలోపు రుసుము చెల్లించి వాటిని ఖరారు చేసుకోవాల్సి ఉంటుందని టీటీడీ స్పష్టం చేసింది. ఇక్కడ మరిన్ని వివరాలు చూడండి…

  • కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్రదీపాలంకార సేవాటికెట్లను అక్టోబర్ 21వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు.
  • వ‌ర్చువ‌ల్ సేవా టికెట్లను అక్టోబర్ 21వ తేదీ మ‌ధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తారు.
  • ఆంగప్రదక్షిణం టోకెన్ల కోటాను అక్టోబర్ 23వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు.
  • శ్రీ‌వాణి ట్ర‌స్టు బ్రేక్ ద‌ర్శ‌నం, గ‌దుల కోటాను అక్టోబర్ 23వ తేదీ ఉదయం 11 గంటలకు విడుదల చేస్తారు.
  • వృద్ధులు, దివ్యాంగులకు ద‌ర్శ‌న టోకెన్ల కోటాను అక్టోబర్ 23వ తేదీ మ‌ధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తారు.
  • ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌నం రూ.300 టికెట్ల కోటాను అక్టోబర్ 24వ తేదీ ఉద‌యం 10 గంటలకు విడుదల చేస్తారు.
  • తిరుమ‌ల‌, తిరుప‌తిలో వ‌స‌తి గ‌దుల బుకింగ్‌ అక్టోబర్ 25వ తేదీ ఉద‌యం 10 గంటలకు విడుదల చేస్తారు.
  • డిసెంబరు నెలకు సంబంధించి అక్టోబరు 27న ఉదయం 10 గంటలకు తిరుమల, తిరుపతికి చెందిన శ్రీవారి సేవ కోటాను, ఉదయం 12 గంటలకు నవనీత సేవ కోటాను, మధ్యాహ్నం 3 గంటలకు పరకామణి సేవ కోటాను విడుదల చేస్తారు.

భక్తులు పైవిషయాలను గమనించి https://tirupatibalaji.ap.gov.in వెబ్ సైట్ లో సేవా టికెట్లను బుక్ చేసుకోవాలని తిరుమల తిరుపతి దేవస్థానం కోరింది.

Whats_app_banner

సంబంధిత కథనం