Fire Accident : రేణిగుంటలో అగ్నిప్రమాదానికి డాక్టర్ కుటుంబం బలి-three killed in fire accident at tirupati district renigunta clinic including doctor ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Fire Accident : రేణిగుంటలో అగ్నిప్రమాదానికి డాక్టర్ కుటుంబం బలి

Fire Accident : రేణిగుంటలో అగ్నిప్రమాదానికి డాక్టర్ కుటుంబం బలి

B.S.Chandra HT Telugu
Sep 25, 2022 08:37 AM IST

Fire Accident తిరుపతి సమీపంలోని రేణిగుంటలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో డాక్టర్‌ కుటుంబం బలైపోయింది. తెల్లవారుజామున ఇటీవల నిర్మించిన కార్తీక ఆస్పత్రిలో మంటలు చెలరేగినట్లు ఫైర్ సిబ్బందికి సమాచారం అందింది. రెండంతస్తుల భవనంలో డాక్టర్‌ రవి శంకర్ రెడ్డి టుంబం నివసిస్తోంది. కింది ఫ్లోర్‌లో క్లినిక్‌ నిర్వహిస్తున్నారు. తెల్లవారుజామున మంటలు చెలరేగడంతో డాక్టర్‌ రవిశంకర్‌తో పాటు ఆయన ఇద్దరు పిల్లలు చనిపోయారు అగ్నిమాపక సిబ్బంది మరో ఇద్దరిని కాపాడారు.

<p>తిరుపతి రేణిగుంట అగ్నిప్రమాదంలో వైద్యుడితో పాటు ఇద్దరు చిన్నారులు మృతి</p>
తిరుపతి రేణిగుంట అగ్నిప్రమాదంలో వైద్యుడితో పాటు ఇద్దరు చిన్నారులు మృతి

Fire Accident తిరుపతి రేణిగుంటలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. రాజరాజేశ్వరి నగర్‌లో కొత్తగా నిర్మించిన కార్తీక ఆస్పత్రిలో రవిశంకర్‌ రెడ్డి కుటుంబం నివసిస్తోంది. డాక్టర్‌ రవిశంకర్‌ రెడ్డితో పాటు ఆయన భార్య అనంతలక్ష్మీ వైద్యులుగా పనిచేస్తున్నారు. దాదాపు పదేళ్లుగా భగత్‌ సింగ్ నగర్ ప్రాంతంలో క్లినిక్‌ నిర్వహిస్తున్న డాక్టర్ దంపతులు ఇటీవల కొత్త క్లినిక్ భవనాన్ని నిర్మించారు. అందులోనే నివసిస్తున్నారు. భవనం కింది అంతస్తులో క్లినిక్‌ కోసం ఏర్పాట్లు చేశారు. తెల్లవారు జామున మూడున్నర గంటల సమయంలో భవనంలో మంటలు వ్యాపించినట్లు వాచ్‌మాన్‌ గుర్తించాడు. డాక్టర్‌ అనంత లక్ష్మీ కూడా ఫైర్‌ స్టేషన్‌కు కాల్ చేసినట్లు చెబుతున్నారు.

Fire Accident జరిగిన వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలు అదుపు చేసే ప్రయత్నం చేశారు. భవనం లోపల డాక్టర్‌ రవిశంకర్‌ రెడ్డి కుటుంబం మొత్తం చిక్కుకుపోవడంతో వారిని కాపాడేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా ప్రయత్నించారు. డాక్టర్ అనంతలక్ష్మీతో పాటు, రవిశంకర్‌ రెడ్డి తల్లిని సురక్షితంగా కాపాడారు. అగ్నిప్రమాదంలో చిక్కుకుపోయిన డాక్టర్ దంపతులు పిల్లలు భరత్ రెడ్డి, కార్తీకలను తీవ్రంగా శ్రమించి బయటకు తీసుకువచ్చారు. అప్పటికే అపస్మారక స్థితిలో ఉన్న వారిని పట్టణంలోని ఇతర ఆస్పత్రులకు తరలించారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ చిన్నారులిద్దరూ చనిపోయారు.

మరోవైపు మంటల్లో చిక్కుకున్న రవిశంకర్‌ రెడ్డిని కాపాడేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా ప్రయత్నించారు. దాదాపు మూడు గంటల తర్వాత కానీ గ్నిమాపక సిబ్బంది తీవ్రంగా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. భవనం రెండో అంతస్తులో పూర్తిగా కాలిపోయిన డాక్టర్ రవిశంకర్‌ రెడ్డి మృతదేహాన్ని గుర్తించారు. డాక్టర్‌ రవిశంకర్‌తో పాటు చిన్నారులిద్దరు చనిపోవడంతో భార్య షాక్‌కు గురయ్యారు.

రెండంతస్తుల్లో ఉన్న భవనం మొదట ఫస్ట్‌ ఫ్లోర్‌లో మొదలైన మంటలు భవనం మొత్తానికి వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది ప్రమాదం జరిగిన వెంటనే మంటల్లో చిక్కుకుపోయిన రవిశంకర్‌ రెడ్డి భార్య, తల్లిని కాపాడారు. ప్రమాదం జరిగిన తర్వాత లోపలకు వెళ్ళేందుకు వీలు లేకుండా నిర్మాణం ఉండటంతో గోడలు పగుల గొట్టాల్సి వచ్చింది. భవనం లోపలి భాగాలకు వేగంగా మంటలు వ్యాపించడం, లోపలకు పొగ వ్యాపించడంతో నిద్రలో ఉన్న వారు బయట పడేందుకు వీల్లేకపోయి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.

దాదాపు పదేళ్లుగా రాజరాజేశ్వరి నగర్‌ ప్రాంతంలో సేవలు అందిస్తున్న వైద్యుడు Fire Accident ప్రమాదంలో చనిపోవడంతో స్థానికులు విషాదానికి గురయ్యారు. ఘటనలో వైద్యుడితో పాటు ఆయన ఇద్దరు పిల్లలు చనిపోవడం అందరిని కంట తడి పెట్టించింది.

Whats_app_banner