Kodaikanal Ooty Tour Package : ఊటీ, కొడైకెనాల్ కొండల్లో విహారం-బెంగళూరు నుంచి 6 రోజుల ట్రిప్
Kodaikanal Ooty Tour Package : కొడైకెనాల్, ఊటీ, కూనూర్ హిల్ స్టేషన్లలో ఆహ్లాదంగా గడిపేందుకు బెంగళూరు నుంచి 6 రోజుల టూర్ ప్యాకేజీని తమిళనాడు టూరిజం అందిస్తుంది. టూర్ ప్యాకేజీ వివరాలు ఇలా ఉన్నాయి.
Kodaikanal Ooty Tour Package : ఫ్యామిలీ లేదా స్నేహితులతో అలా హిల్ స్టేషన్లలో ప్రశాంతంగా గడపాలని భావిస్తున్నారా? అయితే తమిళనాడు టూరిజం బెంగళూరు నుంచి 6 రోజుల టూర్ ప్యాకేజీ అందిస్తుంది. ఈ టూర్ ప్యాకేజీలో బెంగళూరు - మైసూర్ - ఊటీ - కూనూర్- కొడైకెనాల్ కవర్ చేస్తారు.
డే 01 : బెంగళూరు - మైసూర్
మొదటి రోజు ఉదయం పర్యాటకులు బెంగుళూరు విమానాశ్రయానికి చేరుకోగానే గెస్ట్ రిలేషన్ ఎగ్జిక్యూటివ్ రిసీవ్ చేసుకుని, మైసూర్ కు తీసుకెళ్తారు. రోడ్డు మార్గంలో ఉండే ఈ ప్రయాణంలో.. కర్ణాటకలో గార్డెన్ సిటీగా పిలవబడే మైసూర్ పచ్చని చెట్లతో నిండి ఉండే ప్రాంతాలు చూడవచ్చు. మైసూర్ కు చేరుకుని హోటల్ లో చెక్ ఇన్ చేసి, విశ్రాంతి తీసుకుంటారు. తర్వాత కింగ్ వుడెయార్ ప్రసిద్ధ మైసూర్ ప్యాలెస్‌ని సందర్శి్స్తారు, ఆపై కొండపై ఉన్న చాముండి ఆలయాన్ని సందర్శిస్తారు. తరువాత సాయంత్రం కావేరి నది ఒడ్డున ఉన్న రాయల్ ఆర్చిడ్ బృందావన్ గార్డెన్‌ను సందర్శిస్తారు. ప్రసిద్ధ కృష్ణరాజసాగర్ ఆనకట్ట చూస్తారు. రాత్రికి మైసూర్‌లోనే బస చేస్తారు.
డే 02 : మైసూర్ - ఊటీ
నీలగిరిలోని మరొక ఆసక్తికరమైన గమ్యస్థానమైన కూనూర్‌కి ఉదయం బ్రేక్‌ఫాస్ట్ తర్వాత డ్రైవ్‌ను ప్రారంభిస్తారు. ఈ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో తేయాకు పండిస్తారు. కూనూర్ లో ప్రసిద్ధ సిమ్స్ పార్క్ ను సందర్శిస్తారు. తరువాత లాంబ్స్ రాక్, డాల్ఫిన్ హౌస్ వంటి ఇతర సందర్శనా స్థలాలను చూడవచ్చు. తరువాత హై ఫీల్డ్ ఫ్యాక్టరీని సందర్శించి- టీ చరిత్ర, దాని సాగు, ప్రాసెసింగ్ మొదలైన వాటి గురించి తెలుసుకోవచ్చు. సాయంత్రం కూనూర్ నుంచి ఊటీకి టాయ్ ట్రైన్ రైడ్ మొదలుపెడతారు.
డే 03 : ఊటీ - కూనూర్
ఉదయం అల్పాహారం తర్వాత ప్రభుత్వ బొటానికల్ గార్డెన్‌ని సందర్శించవచ్చు. ఈ ఉద్యానవనం ఎంతో ప్రకృతిరమణీయంగా ఉంటుంది. అనేక వృక్ష జాతులను ఇక్కడ చూడవచ్చు. తర్వాత ఊటీలోని ఎత్తైన వ్యూ పాయింట్‌లో ఒకటైన దొడ్డబెట్ట వ్యూ పాయింట్‌ను సందర్శించవచ్చు. అక్కడ నుంచి మీరు నీలగిరి పర్వతాల అందాలను వీక్షిస్తారు. తర్వాత ఊటీ సరస్సుకి డ్రైవ్ చేస్తారు. షాపింగ్ కోసం మిగిలిన రోజు వెచ్చించవచ్చు. ఊటీలో ఇంట్లో తయారుచేసిన చాక్లెట్లు, కాల్చిన రస్క్‌లకు ప్రసిద్ధి. రాత్రికి ఊటీలో బస చేస్తారు.
డే 04 : ఊటీ - కొడైకెనాల్
బ్రేక్‌ఫాస్ట్ తర్వాత కొడైకెనాల్ కు డ్రైవ్ ప్రారంభిస్తారు. కొండల మధ్య ప్రయాణం మీకు అద్భుత అనుభూతిని అందిస్తుంది. కొడైకెనాల్ చేరుకున్న తర్వాత హోటల్ లో చెక్ ఇన్ చేసి విశ్రాంతి తీసుకుంటారు.
డే 05 : కొడైకెనాల్
కొడైకెనాల్ లో ఉదయం అల్పాహారం తర్వాత కోడై కొండను అన్వేషించడానికి బయలుదేరతారు. కోకర్స్ నడక, పైన్ ఫారెస్ట్, గుణ గుహలు, సాయంత్రం కోడై సరస్సు వద్ద బోట్ రైడ్ ఆస్వాదించవచ్చు. మిగిలిన రోజంతా స్థానిక ప్రాంతాల్లో పర్యటించవచ్చు. కొడైకెనాల్‌లో రాత్రిపూట బస చేస్తారు.
డే 06 : కొడైకెనాల్ - కోయంబత్తూర్
బ్రేక్ ఫాస్ట్ తర్వాత కోయంబత్తూర్‌కు బయలుదేరతారు. మధురమైన జ్ఞాపకాలు మూటగట్టుకుని మీ టూర్ ముగిస్తారు. కోయంబత్తూర్ ఎయిర్ పోర్టులో మిమల్ని డ్రాప్ చేస్తారు.
కొడైకెనాల్-ఊటీ టూర్ ప్యాకేజీ బుకింగ్, పూర్తి వివరాలకు ఈ కింది లింక్ పై క్లిక్ చేయండి.
సంబంధిత కథనం