CM Jagan : బాల్య వివాహాలు నిరోధించడంలో ప్రభుత్వ పథకాలు కీలకం- సీఎం జగన్
CM Jagan : బాల్య వివాహాల నిరోధించటానికి కల్యాణమస్తు, షాదీతోఫా, అమ్మ ఒడి, విద్యాదీవెన, వసతి దీవెనలు కీలక పాత్ర పోషిస్తాయని సీఎం జగన్ తెలిపారు. ఈ పథకాలు పొందాలంటే వధూవరులు తప్పనిసరిగా టెన్త్ చదవాలన్న నిబంధన అమలుచేస్తున్నామన్నారు.
CM Jagan : వైయస్సార్ సంపూర్ణ పోషణ, వైయస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్ కింద ఇచ్చే టేక్ హోం రేషన్ సరుకులన్నీ అత్యంత నాణ్యంగా ఉండాలని సీఎం జగన్ అధికారులు ఆదేశించారు. మహిళా, శిశు సంక్షేమ శాఖపై సీఎం జగన్ సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో సీఎం జగన్ మాట్లాడుతూ... వైయస్సార్ సంపూర్ణ పోషణ, వైయస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్ కింద ఇచ్చే సరుకుల పంపిణీపై ఎస్‌ఓపీ పాటించాలని అధికారులను ఆదేశించింది. క్వాలిటీ సర్టిఫికేషన్ తప్పనిసరిగా ఉండాలన్నారు. పంపిణీలో ఎలాంటి లోపాలు లేకుండా చూడాలన్నారు. సీఎం జగన్ ఆదేశాలతో గ్రామాల్లో ఆరోగ్యం, పారిశుద్ధ్యం, పౌష్టికాహార రోజుగా నెలలో రెండుసార్లు పాటించేలా చర్యలు తీసుకున్నామని అధికారులు వివరించారు. ప్రతి నెల మొదటి, మూడో శుక్రవారాల్లో ఈ కార్యక్రమాలు జరగాలని సీఎం జగన్ ఆదేశించారు. ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమంతో అనుసంధానం చేయాలన్నారు.
పీపీ-1,2 స్థాయిలోనే ఇంగ్లిష్ పై అవగాహన
పిల్లల ఎదుగుదల, టీకాలు, పౌష్టికాహారం, మంచి ఆరోగ్యపు అలవాట్లపై ఈ కార్యక్రమం ద్వారా పర్యవేక్షణ చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. ఫ్యామిలీ డాక్టర్‌తో పాటు అంగన్‌వాడీల సూపర్‌వైజర్ కూడా ఉండి ఈ కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలన్నారు. సీఎం ఆదేశాలతో పిల్లల ఎదుగలను పర్యవేక్షించేందుకు స్టాడీ మీటర్, ఇన్‌ఫాంటో మీటర్, సాల్టర్ స్కేల్, బరువును తూచే యంత్రాలన్నింటినీ కూడా త్వరలోనే ఏర్పాటు చేస్తున్నామని అధికారులు తెలిపారు. పీపీ-1, పీపీ-2 తరగతుల విద్యార్థులకు ఇచ్చే పాఠ్యప్రణాళికపైనా కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఇంగ్లిషు భాషపై పిల్లలకు ఈ దశలోనే అవగాహన కల్పించాలన్నారు. పదాలు పలకడం, ఫొనిటెక్స్ అంశాలపై శ్రద్ధపెట్టాలని అధికారులకు సీఎం జగన్ సూచించారు.
వధూవరులు టెన్త్ చదవాలన్న నిబంధన
అంగన్వాడీ కేంద్రాల్లో 3-6 ఏళ్ల వయసున్న చిన్నారులకు 19 వస్తువులతో కిట్లు అందిస్తున్నామని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఈనెలాఖరు కల్లా ఈ పంపిణీ పూర్తవుతుందన్నారు. అగన్‌వాడీ సెంటర్లలో నాడు-నేడు పనులపైనా సీఎం సమీక్షించారు. సచివాలయాల్లోని సిబ్బంది ప్రతి అంగన్‌వాడీ సెంటర్‌ను పరిశీలించి ఎక్కడెక్కడ మరమ్మతులు చేయాలన్న దానిపై పూర్తిగా వివరాలు అందించాలన్నారు. తరగతి గదులు, టాయిలెట్లు, రక్షిత తాగునీరు, ఫర్నిచర్ కనీస సదుపాయాలతో అంగన్‌వాడీలను అభివృద్ధి చేయాలన్నారు. ఆగస్టు 15 నాటికి ఈ పనులు ప్రారంభం కావాలన్నారు. బాల్య వివాహాల నిరోధించటానికి కల్యాణమస్తు, షాదీతోఫా, అమ్మ ఒడి, విద్యాదీవెన, వసతి దీవెనలు కీలక పాత్ర పోషిస్తాయని సీఎం జగన్ అన్నారు. ఈ పథకాలు పొందాలంటే వధూవరులు తప్పనిసరిగా టెన్త్ చదవాలన్న నిబంధన కూడా పెట్టామని సీఎం జగన్ వెల్లడించారు. కల్యాణమస్తు, షాదీ తోఫా, అమ్మ ఒడి, విద్యాదీవెన, వసతి దీవెన కార్యక్రమాలు, విద్యారంగంలో, బాల్య వివాహాలను అడ్డుకట్టవేడయంలో కీలకమన్నారు. మండలానికి ఒక జూనియర్ కళాశాల అమ్మాయిల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నామని అధికారులు వెల్లడించారు.