AP Summer Holidays: ఆంధ్రప్రదేశ్‌లో పాఠశాలలకు ఏప్రిల్ 24వ తేదీ నుంచి వేసవి సెలవులు Summer Holidays మొదలు కానున్నాయి. ఏప్రిల్ 23వ తేదీతో last working day విద్యా సంవత్సరం ముగియనుంది. ఏప్రిల్ 24 నుంచి పాఠశాలలకు సెలవులు ప్రకటిస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
2024 జూన్ 12న June 12 స్కూళ్లు పున:ప్రారంభం అవుతాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో మార్చి 18 నుంచి ఒంటి బడులు half day schools ప్రారంభం అయ్యాయి. ఉదయం 7.45 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు ఒంటిపూట ఒడులు నిర్వహిస్తున్నారు. గత ఏడాది తరహాలోనే ఈసారి వేసవి ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయనే హెచ్చరికల నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ ముందే ఒంటిపూట బడులు ప్రారంభించారు.
వేసవి ఉష్ణోగ్రతల నేపథ్యంలో విద్యాశాఖ school Education అధికారులు పాఠశాలల్ని ముందుగానే సెలవులు ఇస్తారని ప్రచారం జరిగినా షెడ్యూల్ ప్రకారమే సెలవుల్ని ప్రకటించారు. ఏటా విద్యా సంవత్సరం క్యాలెండర్ ఏప్రిల్ 23వ తేదీతో ముగుస్తుంది.
ఏప్రిల్ 24 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్, అన్ ఎయిడెడ్ పాఠశాలలకు వేసవి సెలవులు(AP Summer Holidays) వర్తించనున్నాయి. జూన్ 13వ తేదీ వరకు 50 రోజులు పాటు స్కూళ్లకు వేసవి సెలవులుగా ప్రకటించారు. మార్చి 18 నుంచి మార్చి 30వ తేదీ వరకు ఏపీలో పదో తరగతి పరీక్షలు జరిగాయి. ప్రస్తుతం స్పాట్ వాల్యూయేషన్ జరుగుతోంది.
2024- 25 విద్యా సంవత్సరానికి ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్ధులకు అందించే పాఠ్యపుస్తకాల ముద్రణ ప్రారంభమైంది. బడులు తెరిచిన రోజే (జూన్ 12వ తేదీన) ఉచితంగా 4.42 కోట్ల పాఠ్య పుస్తకాలు పంపిణీ చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు.
1-10వ తరగతి వరకు గణితం, సామాజిక, భౌతిక, జీవ శాస్త్రం వంటి సబ్జెక్ట్ లకు బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ సిద్ధం చేస్తున్నారు. 2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించిన 1-10వ తరగతి వరకు అన్ని పాఠ్యపుస్తకాలు పీడీఎఫ్ రూపంలో CSE.AP.GOV.IN వెబ్ సైట్ ద్వారా ఉచితంగా డౌన్ లోడ్ చేసుకునే సదుపాయం కల్పించినట్టు విద్యాశాఖ కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ తెలిపారు. జూన్ 12వ తేదీ నాటికి విద్యార్థినీ విద్యార్థులకు అందించేందుకు ఉచితంగా పాఠ్య పుస్తకాలు పంపిణీకి సిద్ధంగా ఉంచుతామన్నారు.
1 నుండి 10వ తరగతి వరకు గణితం, సామాజిక, భౌతిక, జీవ శాస్త్రం వంటి సబ్జెక్ట్ లకు సంబంధించి బైలింగువల్ (ఒకవైపు తెలుగు, మరోవైపు ఆంగ్లంలో) పాఠ్యపుస్తకాలు ముద్రిస్తున్నామన్నారు. ప్రపంచంలోనే ద్విభాషా పాఠ్యపుస్తకాలు కలిగిన ఏకైక బోర్డుగా ఆంధ్రప్రదేశ్ బోర్డు నిలిచిందని ప్రవీణ్ ప్రకాష్ ఆనందం వ్యక్తం చేశారు. పదవ తరగతి ఉత్తీర్ణులైన తర్వాత కూడా సైన్స్ పాఠ్యపుస్తకాన్ని ఎక్కువకాలం రిఫరెన్స్ పుస్తకంగా వినియోగించుకునేందుకు వీలుగా సంబంధిత పాఠ్యపుస్తకం కోసం ఉపయోగించిన కాగితం మిగతా వాటి కంటే భిన్నంగా ఉంటుందని చెప్పారు.
2024-2025 విద్యా సంవత్సరానికి గానూ తొలిసారిగా ఫ్యూచర్ స్కిల్స్ ను ఒక సబ్జెక్ట్ గా ప్రవేశపెట్టి 8వ తరగతి విద్యార్థులకు సంబంధిత పుస్తకాలను అందజేస్తామన్నారు. 3 నుండి 9వ తరగతి విద్యార్థులు టోఫెల్ పరీక్షలకు మరింత మెరుగ్గా సంసిద్ధమయ్యేందుకు వీలుగా వారికి టోఫెల్ వర్క్ బుక్ లు అందిస్తామన్నారు.
2023-2024 విద్యా సంవత్సరం చివరి రోజున అంటే ఏప్రిల్ 23న 2024-2025 విద్యాసంవత్సరానికి సంబంధించిన 1 నుండి 10వ తరగతి వరకు అన్ని పాఠ్యపుస్తకాలు పీడీఎఫ్ రూపంలో CSE.AP.GOV.IN వెబ్ సైట్ లో ఉచితంగా డౌన్ లోడ్ చేసుకునేందుకు అందుబాటులో ఉంటుందన్నారు. పిడిఎఫ్ పుస్తకాలను వాణిజ్య ప్రయోజనాల కోసం వినియోగిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
సంబంధిత కథనం