Train Timings : దక్షిణ మధ్య రైల్వే అప్‌డేట్, మూడు ఎక్స్‌ప్రెస్ రైళ్ల సమయాల్లో మార్పులు
Train Timings : దక్షిణ మధ్య రైల్వే మూడు రైళ్ల సమయాల్లో మార్పు చేసింది. లింగంపల్లి-తిరుపతి నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్-తిరుపతి పద్మావతి ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్-గూడురు సింహాపురి ఎక్స్‌ప్రెస్ రైళ్ల సమయ వేళలను మార్పు చేసినట్లు తెలిపింది.
దక్షిణ మధ్య రైల్వే మూడు రైళ్ల ప్రయాణ సమయవేళలను మార్చింది. లింగంపల్లి-తిరుపతి నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్-తిరుపతి పద్మావతి ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్-గూడురు సింహాపురి ఎక్స్‌ప్రెస్ రైళ్ల సమయ వేళలను మార్చినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ మార్పును గమనించాలని ప్రయాణికులను కోరింది.
1. లింగంపల్లి-తిరుపతి నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్ (12734) రైలు ప్రయాణించే వేళల్లో మార్పులు చేశారు. లింగంపల్లిలో సాయంత్రం 5.30 గంటలకు బయలుదేరుతుంది. అది సికింద్రాబాద్ కు సాయంత్రం 6.05 గంటలకు చేరుకుంటుంది. నడికుడి రాత్రి 8.34 గంటలకు, పిడుగురాళ్ల రాత్రి 8.54 గంటలకు, సత్తెనపల్లి రాత్రి 9.22 గంటలకు, గుంటూరు రాత్రి 10.55 గంటలకు చేరుకుంటుంది. తెనాలి రాత్రి 11.38 గంటలకు, బాపట్ల అర్ధరాత్రి 12.14 గంటలకు చేరుకుంటుంది.
చీరాల అర్ధరాత్రి 12.29 గంటలకు, ఒంగోలు అర్ధరాత్రి 1.13 గంటలకు, సింగరాయకొండ అర్ధరాత్రి 1.34 గంటలకు, కావలి అర్ధరాత్రి 2.04 గంటలకు, నెల్లూరు అర్ధరాత్రి 2.28 గంటలకు చేరుకుంటుంది. గూడురు తెల్లవారుజామున 3.34 గంటలకు, వెంకటగిరి తెల్లవారుజామున 4.18 గంటలకు, శ్రీకాళహస్తి తెల్లవారుజామున 4.38 గంటలకు, రేణిగుంట తెల్లవారుజామున 5.08 గంటలకు, తిరుపతి ఉదయం 5.55 గంటలకు చేరుకుంటుంది.
2. సికింద్రాబాద్-తిరుపతి పద్మావతి ఎక్స్‌ప్రెస్ (12764) రైలు ప్రయాణించే వేళల్లో మార్పులు చేశారు. ఈ రైలు గూడురు తెల్లవారుజామున 4.19 గంటలకు, వెంకటగిరి ఉదయం 5.09 గంటలకు, శ్రీకాళహస్తి ఉదయం న 5.29 గంటలకు, రేణిగుంట ఉదయం 5.58 గంటలకు, తిరుపతి ఉదయం 6.55 గంటలకు చేరుకుంటుంది. ఆ రకంగా సమయవేళల్లో మార్పులు తీసుకొచ్చారు. సికింద్రాబాద్-గూడురు మధ్య ఎటువంటి మార్పు లేదని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.
3. సికింద్రాబాద్-గూడురు సింహాపురి ఎక్స్‌ప్రెస్ (12710) రైలు ప్రయాణించే వేళల్లో మార్పులు చేశారు. ఈ రైలు సికింద్రాబాద్‌లో రాత్రి 10.05 గంటలకు బయలుదేరుతుంది. విజయవాడ తెల్లవారుజామున 3.35 గంటలకు, తెనాలి తెల్లవారుజామున 4.19 గంటలకు, బాపట్ల తెల్లవారుజామున 4.59 గంటలకు, చీరాల ఉదయం 5.19 గంటలకు, ఒంగోలు ఉదయం 5.58 గంటలకు, సింగరాయకొండ ఉదయం 6.19 గంటలకు, కావలి ఉదయం 6.59 గంటలకు, బిట్రగుంట ఉదయం 7.19 గంటలకు, నెల్లూరు ఉదయం 7.58 గంటలకు, వేదయపాలెం ఉదయం 8.05 గంటలకు, గూడురు ఉదయం 8.55 గంటలకు చేరుకుంటుంది. ప్రజలు, ప్రయాణికులు ఈ సమయ వేళల మార్పులను గమనించి ప్రయాణాలు చేసుకోవాలని దక్షిణ మధ్య రైల్వే సూచించింది.
జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు
సంబంధిత కథనం