SCR Special Trains : రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. సికింద్రాబాద్ నుంచి ప్రత్యేక రైళ్లు, పూర్తి వివరాలు ఇవే
SCR Special Trains : రైల్వే ప్రయాణికులకు సౌత్ సెంట్రల్ రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. ఛత్, కార్తీక ఏకాదశి పండగలకు ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకుకొచ్చింది. సికింద్రాబాద్- విల్లుపురం మధ్య ఈ రైళ్లు రాకపోకలు సాగించనున్నాయి. ఈ సర్వీసులను ఉపయోగించుకోవాలని అధికారులు సూచించారు.
పండగ రద్దీని తగ్గించేందుకు దక్షిణ మధ్య రైల్వే స్పెషల్ ట్రైన్స్‌ను నడుపుతోంది. ఈ ప్రత్యేక రైళ్లు సికింద్రాబాద్- విల్లుపురం మధ్య సేవలు అందిచనున్నాయి. రైల్వే ప్రయాణికులు ఈ సర్వీసులను ఉపయోగించుకోవాలని అధికారులు సూచించారు. ప్రత్యేక రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.
1. విల్లుపురం-సికింద్రాబాద్ స్పెషల్ (07602) రైలు నవంబర్ 8, 15 తేదీల్లో రాకపోకలు సాగించనుంది. ఈ రైలు విల్లుపురంలో శుక్రవారం సాయంత్రం 4.05 గంటలకు బయలుదేరి మరుసటి రోజు శనివారం ఉదయం 9.40 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.
2. సికింద్రాబాద్-విల్లుపురం స్పెషల్ (07601) రైలు నవంబర్ 14 తేదీన రాకపోకలు సాగిస్తుంది. ఈ రైలు సికింద్రాబాద్‌లో గురువారం (14వ తేదీ) రాత్రి 7.40 గంటలకు బయలుదరేరి, మరుసటి రోజు శుక్రవారం మధ్యాహ్నం 1.05 గంటలకు విల్లుపురం చేరుకుంటుంది.
ఈ రెండు రైళ్లు మౌలాలి, చర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడురు, రేణిగుంట, కట్‌పాడి, తిరువన్నమలై స్టేషన్లలో ఆగుతాయి. ఈ రైళ్లలో ఫస్ట్ ఏసీ, సెకెండ్ ఏసీ, థర్డ్ ఏసీ, స్లీపర్ క్లాస్, జనరల్ సెకెండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయి.
దారి మళ్లింపు..
దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్‌లోని నూజివీడు-వట్లూరు సెక్షన్‌లో జరుగుతున్న ట్రాక్ నిర్వహణ పనుల కారణంగా ఆ మార్గంలో నడిచే పలు రైళ్లను దారి మళ్లించినట్లు విజయవాడ డివిజన్ రైల్వే పీఆర్‌వో నుస్రత్ మండ్రుప్కర్ తెలిపారు.
1. ధన్‌బాద్- అలప్పుజ ఎక్స్‌ప్రెస్ (13351) రైలు నవంబర్ 8, 11, 12వ తేదీల్లో నిడదవోలు, భీమవరం టౌన్, గుడివాడ, విజయవాడ మీదుగా దారి మళ్లించారు.
2. విశాఖపట్నం- విజయవాడ జనసదరన్ స్పెషల్ (08567) రైలు నవంబర్ 8, 13వ తేదీల్లో నిడదవోలు, భీమవరం టౌన్, గుడివాడ, విజయవాడ మీదుగా దారి మళ్లించారు.
3. టాటానగర్- ఎస్ఎంవీటీ బెంగళూరు సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (12889) రైలు నవంబర్ 8వ తేదీన నిడదవోలు, భీమవరం టౌన్, గుడివాడ, విజయవాడ మీదుగా దారి మళ్లించారు.
4. హతియా-ఎర్నాకులం ధరి ఆబా ఏసీ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (22837) రైలు నవంబర్ 11వ తేదీన నిడదవోలు, భీమవరం టౌన్, గుడివాడ, విజయవాడ మీదుగా దారి మళ్లించారు.
5. హతియా- ఎస్ఎంవీటీ బెంగళూరు సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (12835) రైలు నవంబర్ 12వ తేదీన నిడదవోలు, భీమవరం టౌన్, గుడివాడ, విజయవాడ మీదుగా దారి మళ్లించారు.
రైలు రద్దు..
అగర్తల- సికింద్రాబాద్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ (07029) రైలు రద్దు చేస్తున్నట్లు వాల్తేర్ డివిజన్ తెలిపింది. అగర్తలాలో బయలుదేరాల్సిన రైలు నవంబర్ 8న రద్దు చేశారు.
(రిపోర్టింగ్- జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)