ఎందరో మహనీయులు పుట్టిన గడ్డ కృష్ణా జిల్లా. యుగపురుషుడు ఎన్టీఆర్ తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన నియోజకవర్గం గుడివాడ. అలాంటి చోట తులసి వనంలో గంజాయి మొక్కలా ఈ ఎమ్మెల్యే తయారయ్యాడని కొడాలి నానిని ఉద్దేశించి టీడీపీ అధినేత చంద్రబాబు విరుచుకుపడ్డారు. త్వరలోనే ఆ మొక్కను పెకిలించేద్దామన్నారు. బూతులు మాట్లాడడం గొప్పతనమా అని ప్రశ్నించారు. రాజకీయ భిక్ష పెట్టిన వారినే తిడితే చరిత్రహీనులు అవుతారన్నారు. నియోజకవర్గంలో సరైన రోడ్డు వేయలేని ఈ ఎమ్మెల్యే కేసినో తెచ్చాడని ఎద్దేవా చేశారు.