Ontimitta Kalyanam: పున్నమి వెన్నెల్లో కన్నుల పండుగలా ఒంటిమిట్ట సీతారాముల కళ్యాణోత్సవం..-sitarams wedding in ottimitta under the full moon ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ontimitta Kalyanam: పున్నమి వెన్నెల్లో కన్నుల పండుగలా ఒంటిమిట్ట సీతారాముల కళ్యాణోత్సవం..

Ontimitta Kalyanam: పున్నమి వెన్నెల్లో కన్నుల పండుగలా ఒంటిమిట్ట సీతారాముల కళ్యాణోత్సవం..

Sarath chandra.B HT Telugu
Apr 23, 2024 09:01 AM IST

Ontimitta Kalyanam: ఒంటి మిట్టలో సీతారాముల కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగింది. టీటీడీ తరపున ఒంటిమిట్ట రాములోరికి ఈవో ధర్మారెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు.

ఒంటిమిట్టలో అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణోత్సవం
ఒంటిమిట్టలో అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణోత్సవం

Ontimitta Kalyanam: ఒంటిమిట్టలో సీతారాముల  Seetharama కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. శ్రీ సీతారాముల‌ క‌ల్యాణాన్ని తిలకించేందుకు భక్తలు వేల సంఖ్యలో హాజరయ్యారు. స్వామి వారి కళ్యాణోత్సవాలకు kalyanam హాజరైన వారికి TTD టీటీడీ తరపున తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదాలు, ముత్యంతో కూడిన త‌లంబ్రాల పంపిణీ పంపిణీ చేశారు.

yearly horoscope entry point

వైఎస్ఆర్ జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరాముడి Kodandarama బ్రహ్మోత్సవాల సందర్భంగా సోమవారం రాత్రి శ్రీ సీతారాముల కల్యాణం అంగరంగ వైభవంగా జ‌రిగింది. వేలాదిగా హాజరైన భక్తులు స్వామివారి క‌ల్యాణోత్స‌వాన్ని తన్మయత్వంతో తిల‌కించారు.

టీటీడీ ఆధ్వర్యంలో ఏప్రిల్ 17నుంచి Ontimitta ఒంటిమిట్ట సీతారాముల కళ్యాణోత్సవాలు జరుగుతున్నాయి. సోబమవారం రాత్రి పున్నమి వెన్నెలలో జరిగిన కళ్యాణోత్సవాన్ని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. మంగళవారం రథోత్సవం, 26న పుష్ప యాగంతో ఒంటి మిట్ట కళ్యాణోత్సవాలు ముగుస్తాయి.

ఒంటిమిట్ట రాములవారి కల్యాణానికి సంబంధించి సీతమ్మవారి కోరికను శాస్త్రరీత్యా తెలిపే కాంత కోరిక కార్యక్రమాన్ని 5.30 గంటలకు వేదిక మీద అర్చకులు నిర్వహించారు. రాత్రి 6 గంటలకు ఎదుర్కోలు ఉత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు స్వామి వారి తరపున కొందరు, అమ్మవారి తరపున కొందరు వారి గుణగణాలను వివరించారు.

సాయంత్రం 6.30 గంటలకు కంకణబట్టర్‌ రాజేష్ కుమార్ ఆధ్వర్యంలో సీతారాముల కల్యాణం ప్రారంభమైంది. ముందుగా భగవత్‌ విజ్ఞాపనం, సభ అనుజ్ఞ, లోకకల్యాణం కోసం సంకల్పం చేయించారు. కల్యాణంలోని పదార్థాలన్నీ భగవంతుని మయం చేసేందుకు పుణ్యాహవచనం నిర్వహించారు.

ఆ తరువాత రక్షాబంధనం, యజ్ఞోపవీతధారణ, వరప్రేశనం(కన్యావరణం), మధుపర్కార్చనం చేశారు. మహాసంకల్పం అనంతరం కన్యాదానం చేసి సీతారామచంద్రుల ప్రవరలను చదివారు. రాములవారి వంశస్వరూపాన్ని స్తుతించారు.

అగ్నిప్రతిష్టాపన తరువాత సీతా రాముల తల మీద జీలకర్ర, బెల్లం ఉంచి శాస్త్రోకంగా కల్యాణ వేడుక నిర్వహించారు. తరువాత మంగళాష్టకం, చూర్ణిక పఠించి, మాంగళ్యసూత్ర పూజ, మంగళసూత్రధారణ, అక్షతారోపణం చేప‌ట్టారు. స్వామి నివేదన, వేదస్వస్తి, మహదాశీర్వచనంతో కల్యాణఘట్టం పూర్త‌యింది.

కళ్యాణోత్సవం ముందు ఎదురుకోల ఉత్సవాన్ని నిర్వహించారు. సీతారాముల గుణగణాలను ఇరువైపుల అర్చకులు వివరిస్తుంటే భక్తులు తన్మయత్వంతో అలకించారు. స్వామివారి కల్యాణోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం సాయంత్రం శ్రీ సీతారాముల ఉత్సవమూర్తుల శోభాయాత్ర ఆలయం నుండి కల్యాణవేదిక వరకు వైభవంగా జరిగింది. మంగళవాయిద్యాలు, భజనలు, కోలాటాల నడుమ శోభాయాత్ర వేడుకగా సాగింది. శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్‌లో శ్రీ సీతారాముల కల్యాణాన్ని ప్రత్యక్ష ప్రసారం చేశారు. భ‌క్తులంద‌రికి తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం, ముత్యంతో కూడిన త‌లంబ్రాల పంపిణీ చేశారు.

కల్యాణవేదిక ప్రాంగణంలో ఏర్పాటు చేసిన గ్యాలరీల్లో కూర్చుని శ్రీ సీతారాముల క‌ల్యాణాన్ని తిలకించేందుకు విచ్చేసిన భ‌క్తులంద‌రికి శ్రీ‌వారి సేవ‌కులు తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం, ముత్యంతో కూడిన త‌లంబ్రాల‌ను పంపిణీ చేశారు.

అన్నప్రసాదాలు పంపిణీ

శ్రీ సీతారాముల కళ్యాణం అనంతరం వేలాది మంది భక్తుల కోసం వేదికకు ఇరువైపులా ఏర్పాటుచేసిన 150 కౌంటర్లలో సెక్టార్ అధికారుల పర్యవేక్షణలో శ్రీవారి సేవకులు పులిహోర, చక్కెర పొంగలి అందించారు.

ఒంటిమిట్ట సీతారాముల కళ్యాణోత్సవాలను టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశారు.

Whats_app_banner

సంబంధిత కథనం