(1 / 8)
ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ఏప్రిల్ 17 నుంచి 25వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ మేరకు టీటీడీ ఏర్పాట్లు సిద్ధం చేస్తోంది.
(Photo From https://news.tirumala.org/ )(2 / 8)
వొంటిమిట్టలోని శ్రీ సీతా రాముల కల్యాణ మహోత్సవాలు శనివారంనాడు ”హరిధ్రా ఘటనం”తో అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది తొలిసారిగా టీటీడీ ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది.
(Photo From https://news.tirumala.org/ )(3 / 8)
ఈ సందర్భంగా మహిళా భక్తులు సుమారు మూడు కిలోల పసుపును పోసి జై శ్రీరామ్ నినాదాలు చేస్తూ సాంప్రదాయబద్దంగా రోలులో దంచారు.
(Photo From https://news.tirumala.org/ )(4 / 8)
అంతకుముందు గర్భాలయం లోపల పసుపు కొమ్ములకు, రోకళ్లకు స్వామి పాదాల చెంత ప్రత్యేక పూజలను అర్చక స్వాములు సశాస్త్రీయంగా చేశారు.
(Photo From https://news.tirumala.org/ )(5 / 8)
అర్చకులు శ్రీ శ్రవణ స్వామి మాట్లాడుతూ భగవత్ విజ్ఞాపనతో హరిధ్రా ఘటనం కార్యక్రమం ప్రారంభం అయిందని తెలిపారు. తద్వారా శ్రీ సీతా రామ కల్యాణ మహోత్సవ ఏర్పాట్లకు నాంది పలికినట్లు అయిందన్నారు
(Photo From https://news.tirumala.org/ )(6 / 8)
అనంతరం ఈ కార్యక్రమం యొక్క ప్రాధాన్యతను భక్తులకు తెలియజేశారు. “ఇవాళ పసుపు దంచే కార్యక్రమంలో వచ్చిన పసుపును ఉత్సవరులకు కళ్యాణం నాడు నిర్వహించే స్నపనం మరియు తలంబ్రాలు తయారీకి ఉపయోగిస్తారన్నారు.
(Photo From https://news.tirumala.org/ )(7 / 8)
“జై శ్రీ రామ్… జై శ్రీ రామ్ అంటూ నినదిస్తూ ఈ సాంప్రదాయ పసుపు దంచే కార్యక్రమంలో మహిళా భక్తులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. అన్నమాచార్య కళాకారుల బృందం సందర్భానుసారంగా రామ భజనలను కీర్తించారు.
(Photo From https://news.tirumala.org/ )(8 / 8)
ఏప్రిల్ 22వ తేదీ సాయంత్రం 6.30 నుంచి 8.30 గంటల వరకు సీతారాముల కల్యాణం అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు.
(Photo From https://news.tirumala.org/ )ఇతర గ్యాలరీలు