విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డ స్కూల్ వ్యాన్ డ్రైవర్.. పట్టుకుని చితకబాదిన గ్రామస్తులు-school van driver accused of raping student ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డ స్కూల్ వ్యాన్ డ్రైవర్.. పట్టుకుని చితకబాదిన గ్రామస్తులు

విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డ స్కూల్ వ్యాన్ డ్రైవర్.. పట్టుకుని చితకబాదిన గ్రామస్తులు

HT Telugu Desk HT Telugu
Sep 02, 2024 10:08 AM IST

ప్రయివేటు స్కూల్ వ్యాన్ డ్రైవర్ తాను పాఠశాలకు తీసుకెళ్లే బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇంట్లో ఎవరూ లేరని తెలుసుకుని పక్కా ప్రణాళికతో బాలికను చెరబట్టాడు.

విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డ స్కూల్ వ్యాన్ డ్రైవర్
విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డ స్కూల్ వ్యాన్ డ్రైవర్

నంద్యాల జిల్లాలో ఘోరం చోటు చేసుకుంది. ఎనిమిదో త‌ర‌గ‌తి చ‌దువుతున్న విద్యార్థినిపై అదే స్కూల్ వ్యాన్ డ్రైవ‌ర్ అత్యాచారానికి ఒడిగట్టాడు. ఇంట్లో ఎవ‌రూ లేని స‌మ‌యం తెలుసుకున్న ఆ ప్ర‌బుద్ధుడు తాగ‌డానికి మంచినీళ్లు అడిగి, అదే అదునుగా బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ కామాంధుడిని ప‌ట్టుకొని గ్రామ‌స్తులు దేహ‌శుద్ధి చేశారు. అనంత‌రం పోలీసుల‌కు అప్ప‌గించారు.

ఈ ఘోర ఘ‌ట‌న నంద్యాల జిల్లా అవుకు మండ‌లంలోని ఒక గ్రామంలో ఆదివారం జ‌రిగింది. బాలిక కోవెల‌కుంట్ల ప‌ట్ట‌ణంలోని ఒక ప్రైవేట్ స్కూల్‌లో ఎనిమిదో త‌ర‌గ‌తి చ‌దువుతోంది. అదే గ్రామానికి చెందిన ప్ర‌భుదాసు అనే వ్య‌క్తి ఆ ప్రైవేట్ పాఠ‌శాల వ్యాన్ డ్రైవ‌ర్‌గా ప‌ని చేస్తున్నాడు. రోజూ బాలిక ఆ వ్యాన్‌లోనే స్కూల్‌కి వెళ్లి ఇంటికి వచ్చేది.

అయితే ఆదివారం స్కూల్ సెల‌వు కావ‌డంతో ఆ బాలిక ఇంట్లోనే ఉంది. బాలిక తల్లిదండ్రులు పొలం ప‌నులకు వెళ్లారు. ఇంట్లో బాలిక‌ ఒక్క‌తే ఉందని, ఇంట్లో ఎవ్వ‌రూ లేరనే విషయం తెలుసుకున్నాడు. ఎవ‌రూ రాని స‌మ‌యంలో ఇంటి వ‌ద్ద‌కు నిందితుడు వెళ్లాడు. త‌లుపు కొడితే బాలిక త‌లుపు తీసింది. మీ నాన్న ఇంట్లో లేడా అని అడిగి, తాగ‌డానికి మంచినీళ్లు ఇవ్వమని అడిగాడు. 

ఆ బాలిక ఇంట్లోకి వెళ్ల‌గానే నిందితుడు త‌లుపులు వేసి బాలిక నోరు మూసి అత్యాచారానికి పాల్ప‌డ్డాడు. ఆ చిన్నారి వ‌ద్ద‌ని ఎంత వారించినా ఆ ప్ర‌బుద్ధుడు వ‌ద‌ల‌లేదు. ఆమె కేక‌లు వేయ‌డానికి గొంతు నొక్కేశాడు. ఇంత‌లో బాలిక త‌ల్లి ప‌నులు ముగించుకుని ఇంటికి వ‌చ్చింది. ఆమె గేటు తీస్తున్న‌ప్ప‌డే ఇంట్లో ఉన్న నిందితుడికి గేటు శ‌బ్ధం విన‌బ‌డింది. దీంతో నిందితుడు బాలిక‌ను ఎవ‌రికైనా చెబితే చంపేస్తాన‌ని బెదిరించి మంచం కింద దాక్కున్నాడు.

అప్ప‌టికే తీవ్ర భ‌యాందోళ‌న‌కు గురైన బాలిక త‌లుపులు తీసింది. వెంట‌నే ఆ చిన్నారి చెంప‌పై కాట్లు ఉండ‌టాన్ని త‌ల్లి గ‌మ‌నించింది. దీంతో ఆ చిన్నారిని చెంప‌పై గాట్లు గురించి ప్ర‌శ్నిస్తూ ఇంట్లో మంచం కింద నిందితుడు ఉండ‌డాన్ని చూసింది. వెంట‌నే త‌ల్లి కేక‌లు వేయ‌గా, చుట్టుప‌క్క‌ల వారు, బంధువులు బాలిక ఇంటికి చేరుకున్నారు. నిందితుడిని ప‌ట్టుకొని స్థంభానికి క‌ట్టేసి దేహ‌శుద్ధి చేశారు. అభం శుభం తెలియని చిన్నారిపై అత్యాచారం చేస్తావా అంటూ కొట్టారు.

అనంత‌రం పోలీసుల‌కు బాలిక కుటుంబ స‌భ్యులు స‌మాచారం అందించారు. దీంతో అవుకు మండ‌ల కేంద్రం నుంచి పోలీసులు హుటాహుటినా ఆ గ్రామానికి చేరుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. బాలిక త‌ల్లి ఫిర్యాదు మేర‌కు పోక్సో కేసు న‌మోదు చేసిన‌ట్లు పోలీసులు తెలిపారు. ఆ నిందితుడిని పోలీస్ స్టేష‌న్‌కు త‌ర‌లించారు. అక్క‌డ నిందితుడిని విచారిస్తున్నారు.

- జ‌గ‌దీశ్వ‌ర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు

టాపిక్