pawan kalyan selfie: కుమార్తెతో సెల్ఫీ తీసుకున్న పవన్.. మురిసిపోతున్న అభిమానులు-pawan kalyan took a selfie with his daughter adya during the independence day celebrations ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Pawan Kalyan Selfie: కుమార్తెతో సెల్ఫీ తీసుకున్న పవన్.. మురిసిపోతున్న అభిమానులు

pawan kalyan selfie: కుమార్తెతో సెల్ఫీ తీసుకున్న పవన్.. మురిసిపోతున్న అభిమానులు

pawan kalyan selfie: పవన్ కళ్యాణ్.. ఈ పేరు వింటేనే ఆయన అభిమానులకు పూనకాలు వస్తుంటాయి. ఇక పవన్ పర్సనల్ గురించి ఫ్యాన్స్‌కు ఉండే ఆసక్తి అంతా ఇంతా కాదు. తాజాగా పీకే ఫ్యాన్స్ పండగ చేసుకునే ఫొటో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది.

కూతురు ఆద్యతో పవన్ సెల్ఫీ

కాకినాడ పోలీసు పరేడ్‌ గ్రౌండ్‌లో నిర్వహించిన 78వ స్వాతంత్య్ర దినోత్సవం వేడుకల్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం తమ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి వివరించారు. అయితే.. ఈ వేడుకలకు పవన్‌తో పాటు ఓ స్పెషల్ గెస్ట్ కూడా హాజరయ్యారు.

మెగా ఫ్యాన్స్ సంబరం..

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు పవన్ కళ్యాణ్ తన కూతురు ఆద్యను కూడా తీసుకొచ్చారు. కార్యక్రమం జరుగుతున్న సమయంలో పవన్ కళ్యాణ్.. స్టేజ్ పైన తన కూతురుతో సెల్ఫీ తీసుకున్నారు. ప్రస్తుతం ఈ ఫొటో వైరల్‌గా అవుతోంది. ఈ ఫొటోను చూసిన మెగా ఫ్యాన్స్ సంబరపడుతున్నారు. సోషల్ మీడియాలోని తమతమ అకౌంట్లలో పోస్ట్ చేస్తున్నారు. పవన్, ఆద్య సెల్ఫీ తీసుకున్న ఫొటోను జనసేన పార్టీ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది.