MBBS Merit List: ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ MBBS, BDS ఫైనల్‌ మెరిట్‌ లిస్ట్‌ విడుదల-ntr health university mbbs bds final merit list released ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Mbbs Merit List: ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ Mbbs, Bds ఫైనల్‌ మెరిట్‌ లిస్ట్‌ విడుదల

MBBS Merit List: ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ MBBS, BDS ఫైనల్‌ మెరిట్‌ లిస్ట్‌ విడుదల

Bolleddu Sarath Chandra HT Telugu
Sep 12, 2024 06:54 AM IST

MBBS Merit List: ఏపీలో ఎంబిబిఎస్‌, బిడిఎస్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం విద్యార్థులు ఎదురు చూస్తున్న మెరిట్‌ లిస్ట్‌ను ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ విడుదల చేసింది. 2024-25 విద్యా సంవత్సరంలో ఏపీలోని ఏయూ, ఎస్వీ యూనివర్శిటీల పరిధిలో ప్రభుత్వ ,ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో మెరిట్ లిస్ట్‌ ఖరారు చేశారు.

<p>విజయవాడలోని ఎన్టీఆర్‌ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్</p>
<p>విజయవాడలోని ఎన్టీఆర్‌ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్</p>

MBBS Merit List: ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్శిటీ ఎంబిబిఎస్‌, బిడిఎస్‌ కోర్సుల్లో ప్రవేశాలకు ఫైనల్ మెరిట్ లిస్ట‌‌ విడుదల చేసింది. 2024-25 విద్యా సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఎంబిబిఎస్‌ కోర్సుల్లో కన్వీనర్‌ కోటా కింద ప్రవేశాలకు దరఖాస్తు చేసుకున్న వారిలో మెరిట్ లిస్ట్‌ను బుధవారం విడుదల చేసింది.

ఆంధ్రప్రదేశ్‌లో వైద్య విద్యలో ప్రవేశాలు కోరుతున్న విద్యార్థుల్లో నీట్ ర్యాంకుల ఆధారంగా 2024-25 విద్యా సంవత్సరానికి మెరిట్‌ లిస్ట్‌ను ఎన్టీఆర్ హెల్త్‌ యూనివర్శిటీ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని ఆంధ్రాయూనివర్శిటీ రీజియన్, ఎస్వీ యూనివర్శిటీల పరిధిలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్‌ కన్వీనర్ కోటా సీట్లను నీట్ ర్యాంకుల ఆధారంగా ఖరారు చేశారు. ఆలిండియా కోటా మినహాయించగా మిగిలిన సీట్లలో కన్వీనర్‌ కోటా మెరిట్ జాబితాను బుధవారం ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం విడుదల చేసింది.

ఏపీలో మెడికల్ ప్రవేశాల కోసం నీట్ ర్యాంకుల ఆధారంగా దరఖాస్తు చేసుకున్న వారిలో 13,489మందికి మెరిట్ ఆర్డర్ విడుదల చేశారు. పూర్తి వివరాలను ర్యాంకుల జాబితాను హెల్త్ యూనివర్శిటీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.

నీట్‌లో 254వ ర్యాంకు సాధించిన ఎన్వీ యూనివర్శిటీకి చెందిన సిరిగిరి మోక్షశ్రీకి మెరిట్‌ లిస్ట్‌లో తొలి ర్యాంకు లభించింది. ఆ తర్వాత స్థానంలో ఎస్వీ యూనివర్శిటీకి చెందిన నీట్304 ర్యాంకర్‌ రాచపల్లె భవిత ఉన్నారు. మూడో స్థానంలో నీట్‌లో 551వ ర్యాంకు సాధించిన నియాతి జైన్ ఉన్నారు. తొలి పది స్థానాల్లో ఐదుగురు బాలికలు, ఐదుగురు బాలలు ఉన్నారు. వీరిలో ఎస్వీ వర్శిటీ పరిధిలో ముగ్గురు, ఏయూ పరిధిలో ఏడుగురు ఉన్నారు.

ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్శిటీ ప్రకటించిన నీట్ ఎంబిబిఎస్‌, బిడిఎస్‌ మెరిట్ జాబితాను ఈ లింకు ద్వారా చూడవచ్చు…https://drntr.uhsap.in/index/notification/Admission/2024-25/MBBS/MBBS%20&%20BDS%20CQ%202024-25%20-%20Provisional%20Final%20Merit%20List%20of%20applied%20candidates.pdf

ఎండీఎస్‌ స్ట్రే కౌన్సిలింగ్...

ఆంధ్రప్రదేశ్‌లో దంత వైద్య విద్యలో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు స్ట్రే కౌన్సిలింగ్‌ను ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ ప్రకటించింది. ఇప్పటికే మొదటి విడత కౌన్సిలింగ్, రెండో విడత కౌన్సిలింగ్ పూర్తైంది. రాష్ట్రంలో మిగిలిపోయిన ఎండీఎస్‌ కన్వీనర్ కోటా, మేనేజ్‌మెంట్ కోటా సీట్లను హెల్త్ యూనివర్శిటీ స్ట్రే కౌన్సిలింగ్ నిర్వహించనుంది.

బుధవారం నుంచి సెప్టెంబర్ 12వ తేదీ వరకు అభ్యర్థులు ఆన్‌లైన్‌లో వెబ్‌ ఆప్షన్లను నమోదు చేసుకోవచ్చు. ఎండీఎస్‌లో రాష్ట్ర వ్యాప్తంగా కన్వీనర్‌ కోటాలో 31సీట్లు మిగిలిపోయాయని, మేనేజ్‌మెంట్‌ కోటాలో 62 సీట్లు అందుబాటులో ఉన్నాయని పేర్కొంది. మేనేజ్‌మెంట్ కోటా సీట్లను చివరగా నిర్వహిస్తున్న కౌన్సిలింగ్‌లో భర్తీ చేసేందుకు అనుమతించారు. ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో మేనేజ్‌‌మెంట్‌ కోటాలో 62సీట్లు అందుబాటులో ఉన్నాయి.