Social Media Trolls: న్యాయమూర్తులను దూషించిన వ్యవహారంలో 27మందికి నోటీసులు-notices to 27 people who insulted judges on chandrababus arrest ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Social Media Trolls: న్యాయమూర్తులను దూషించిన వ్యవహారంలో 27మందికి నోటీసులు

Social Media Trolls: న్యాయమూర్తులను దూషించిన వ్యవహారంలో 27మందికి నోటీసులు

HT Telugu Desk HT Telugu
Sep 27, 2023 12:19 PM IST

Social Media Trolls: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అరెస్ట్ వ్యవహారంలో న్యాయమూర్తుల్ని కించపరిచేలా సోషల్ మీడియాలో కామెంట్లు చేయడంపై రాష్ట్ర ప్రభుత్వం నమోదు చేసిన క్రిమినల్ కంటెప్ట్‌ ప్రొసిడింగ్స్‌పై విచారణ జరిగింది. అనుచిత వ్యాఖ్యలు చేసిన 27మందికి నోటీసులు జారీ చేశారు.

సోషల్‌ మీడియాలో ట్రోలింగ్‌పై హైకోర్టు నోటీసులు
సోషల్‌ మీడియాలో ట్రోలింగ్‌పై హైకోర్టు నోటీసులు

Social Media Trolls: న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యలపై నమోదైన క్రిమినల్ కంటెంప్ట్ పిటిషన్‍పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ వ్యవహారంలో ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపించారు. చంద్రబాబు అరెస్ట్ తర్వాత హైకోర్టు, దిగువ కోర్టు జడ్జిలపై దూషణల వ్యవహారంలో క్రిమినల్ కంటెంప్ట్ పిటిషన్ నమోదైంది. న్యాయమూర్తులపై సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కు పాల్పడటంపై రాష్ట్రపతికి అడ్వకేట్లు ఫిర్యాదు చేశారు. రాష్ట్రపతి కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాలతో క్రిమినల్ కంటెంప్ట్‌ పిటిషన్ నమోదు చేశారు.

yearly horoscope entry point

సెప్టెంబర్ 9వ తేదీన చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేసి, ఏసీబీ ప్రత్యేక కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత సోషల్ మీడియాలో న్యాయమూర్తులను కించపరిచేలా కొందరు అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారంలో 26మంది సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కు పాల్పడ్డారని ఏజీ కోర్టు దృష్టికి తీసుకు వచ్చారు. ది.

చంద్రబాబు అరెస్ట్‌ జరిగినప్పటి నుంచి ఏపీ హైకోర్టులో ఇద్దరు న్యాయమూర్తులతో పాటు ఏసీబీ హైకోర్టుపై ట్రోలింగ్ చేశారని ఏజీ వివరించారు.ఈ కేసులో అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపించారు. ట్విట్టర్, ఫేస్‌బుక్‌, యూట్యూబ్ వంటి మాధ్యమాల్లో అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారని, వారి కుటుంబ సభ్యుల్ని ట్రోలింగ్ చేస్తూ కాంపెయిన్ నడపారని న్యాయమూర్తి దృష్టికి తీసుకువెళ్లారు.

పిటిషన్‌లో పేర్కొన్న 27మందికి నోటీసులు జారీ చేయాలని, సోషల్ మీడియా అకౌంట్లను పరిశీలించి నోటీసులు ఇవ్వాలని డీజీపీని హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. చంద్రబాబు అరెస్ట్‌ తర్వాత అన్ని ట్రోలింగ్‌లకు సంబంధించిన వ్యవహారాలపై బుద్దా వెంకన్న, గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఖాతాలను ఏజీ న్యాయమూర్తికి అందించారు. గూగుల్‌, ట్విట్టర్‌, ఫేస్‌ బుక్‌ సంస్థలకు చెందిన భారత ప్రతినిధులకు నోటీసులు జారీ చేయాలని రిజిస్ట్రీని ఆదేశించారు.

రిమాండ్‌ విధించిన ఏసీబీ కోర్టు న్యాయమూర్తి, క్వాష్‌ పిటిషన్ డిస్మిస్ చేస్తూ న్యాయమూర్తులు ఆదేశాలు ఇవ్వడంతో సోషల్ మీడియాలో వారికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టడం, వారి కుటుంబ సభ్యుల్ని కించపరచడంపై ఆధారాలు సేకరించారు. ఈ వ్యవహారంలో రాష్ట్రపతి భవన్‌ నుంచిఏపీ సిఎస్‌ జవహర్‌ రెడ్డికి ఆదేశాలు రావడంతో ఏజీ క్రిమినల్ కంటెంప్ట్‌‌కు ఉపక్రమించారు. పిటిషన్‌ విచారణ నాలుగు వారాల పాటు వాయిదా పడింది.

Whats_app_banner