AP IPS Transfers : ఏపీలో ఐపీఎస్ అధికారుల బదిలీ - ఉత్తర్వులు జారీ
IPS Transfers in AP : ఏపీలో పలువురు ఐపీఎస్ లు బదిలీ అయ్యారు. ఈ మేరకు సర్కార్ ఉత్తర్వులను జారీ చేసింది.
ఏపీలో ఐపీఎస్ అధికారుల బదిలీ
IPS Transfers in Andhrapradesh : ఏపీలో కొత్తగా వచ్చిన ప్రభుత్వం… శాఖల వారీగా ప్రక్షాళన షురూ చేసింది. ఇప్పటికే పలు శాఖల్లో బదిలీలు చేపట్టగా… తాజాగా మరికొందరు పలువురు ఐపీఎస్ లను బదిలీ చేసింది. విజయవాడ సీపీగా రాజశేఖరబాబు నియమితులయ్యారు. లా అండ్ అర్డర్ ఐజీగా శ్రీకాంత్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఫైర్ సర్వీసెస్ డీజీగా పైదిరెడ్డి ప్రతాప్ ని నియమించారు. మరికొందరు అధికారులను డీజీపీ ఆఫీసులో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది.
- అంజనా సిన్హా - స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, డైరెక్టర్ జనరల్ గా నియామకం.
- మదిరెడ్డి ప్రతాప్ - ఏపీ విపత్తుల నిర్వహణ, ఫైర్ సర్వీసెస్, డైరెక్టర్ జనరల్.
- సీహెచ్ శ్రీకాంత్ - ఐజీ, అ అండ్ అర్డర్
- ఎస్వీ రాజశేఖర బాబు -విజయవాడ సీపీ
- గోపినాథ్ జెట్టి - డిప్యూటీ ఇన్ స్పెక్టర్ జనరల్, విశాఖపట్నం రేంజ్.
- ప్రవీణ్ - కర్నూల్ రేంజ్ డీఐజీగా నియామకం.
- విజయా రావు - డీజీపీ ఆఫీస్ లో రిపోర్ట్ చేయాలని ఆదేశం.
- విశాల్ గున్నీ - డీజీపీ ఆఫీస్ లో రిపోర్ట్ చేయాలని ఆదేశం.
ఐఏఎస్ అధికారుల బదిలీలు…
ఏపీలో గురువారం ఐఏఎస్ అధికారుల బదిలీ అయ్యారు. మొత్తం 19 మంది ఐఏఎస్ లను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులను జారీ చేశారు. సీసీఎల్ఏ చీఫ్ కమిషనర్ గా జయలక్ష్మి నియమితులయ్యారు.రవాణాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా కాంతీలాల్ ను నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.
- అటవీశాఖ స్పెషల్ సీఎస్‌గా అనంతరాము నియామకం.
- రవాణాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా కాంతీలాల్.
- సీసీఎల్ఏ చీఫ్ కమిషనర్ గా జయలక్ష్మి నియామకం.
- ల్యాండ్స్ అండ్ రిజిస్ట్రేషన్‌శాఖ సీఎస్‌గా రామ్ ప్రకాష్ సిసోడియా.
- పెట్టుబడులు మౌలిక వసతులు కార్యదర్శిగా సురేష్ కుమార్
- ఏపీ పరిశ్రమలు శాఖ డైరెక్టర్‌గా సి. శ్రీధర్
- ఏపీ ఆర్థిక శాఖ అదనపు కార్యదర్శిగా జే నివాస్
- పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌గా వి.విజయరామరాజు నియామకం.
- క్రీడలు యువజన సర్వీసుల శాఖ కార్యదర్శిగా వివేక్ యాదవ్ నియామకం.
- మహిళా స్త్రీ శిశు సంక్షేమ శాఖ కార్యదర్శిగా ఏ సూర్యకుమారి
- సమాచారశాఖ డైరెక్టర్‌గా హిమాన్షు శుక్లా
- ఐటీ శాఖ కార్యదర్శిగా శౌరబ్ గౌర్‌కి అదనపు బాధ్యతలు
- పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ కార్యదర్శిగా ఎన్.యువరాజ్
- మైనారిటీ వెల్ఫేర్ కార్యదర్శిగా హర్షవర్థన్
- సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శిగా కన్నబాబు బదిలీ
- గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శిగా కన్నబాబుకి అదనపు బాధ్యతలు.
- వ్యవసాయ శాఖ డైరెక్టర్‌గా ఢిల్లీ రావు నియామకం.