Wife Attacked On Husband : నందిగామలో దారుణం, ఇన్ స్టా రీల్స్ చూస్తున్నాడని భర్త మర్మాంగం కోసేసిన భార్య-nandigama wife attacked on husband watching first wife instagram reels ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Wife Attacked On Husband : నందిగామలో దారుణం, ఇన్ స్టా రీల్స్ చూస్తున్నాడని భర్త మర్మాంగం కోసేసిన భార్య

Wife Attacked On Husband : నందిగామలో దారుణం, ఇన్ స్టా రీల్స్ చూస్తున్నాడని భర్త మర్మాంగం కోసేసిన భార్య

Bandaru Satyaprasad HT Telugu
Jul 22, 2023 02:03 PM IST

Wife Attacked On Husband : ఎన్టీఆర్ జిల్లా నందిగామలో దారుణమైన ఘటన జరిగింది. మొదటి భార్య ఇన్ స్టా రీల్స్ చూస్తున్నాడని భర్త మర్మాంగాన్ని కోసేసింది రెండో భార్య.

భర్తపై భార్య బ్లేడుతో దాడి
భర్తపై భార్య బ్లేడుతో దాడి

Wife Attacked On Husband : ఏపీలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. రీల్స్ చూస్తున్నాడని భర్త మర్మాంగం కోసేసింది భార్య. ఎన్టీఆర్ జిల్లా నందిగామలోని అయ్యప్ప నగర్ లో ఈ ఘటన కలకలం రేపుతోంది. మొదటి భార్య ఇన్ స్టాగ్రామ్ రీల్స్ చూస్తు్న్న భర్తపై దాడి చేసింది రెండో భార్య. అతడి మర్మాంగాన్ని కోసేసింది. ముప్పాళ్ల గ్రామానికి చెందిన కోట ఆనంద్ బాబు ముందు ఓ మహిళతో పెళ్లి అయింది. అయితే వీరిద్దరి మధ్య కలహాలు రావడంతో విడిపోయారు. అయితే ఆనంద్ బాబు ఐదేళ్ల క్రితం మరో మహిళ వరమ్మను వివాహం చేసుకున్నారు. శుక్రవారం రాత్రి ఆనంద్ బాబు, ఇన్ స్టాగ్రామ్ లో తన మొదటి భార్య రీల్స్ , వీడియోలు చూస్తుండగా వరమ్మ గొడవపడింది. తనను పెళ్లి చేసుకుని మొదటి భార్య వీడియోలు ఎందుకు చూస్తున్నావని ఆనంద్ బాబుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో ఇరువురి మధ్య మాటామాట పెరిగింది. ఒకరిపై ఒకరు పరస్పరం దాడి చేసుకున్నారు. కోపంతో భర్త ఆనంద్ బాబుపై వరమ్మ బ్లేడ్‌తో దాడి చేసి మర్మాంగాలను వరమ్మ కోసేసింది. ఆనంద్ బాబుకు తీవ్ర రక్తస్రావం కావడంతో అతడిని నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. అతడిని మెరుగైన వైద్యం కోసం విజయవాడకు తీసుకెళ్లారు.

ఇష్టంలేకుండా ముద్దు-భర్త నాలుక కొరికిన భార్య

కర్నూలులో మరో విచిత్రమైన ఘటన వెలుగుచూసింది. ఇష్టం లేకుండా ముద్దు పెట్టాలని ప్రయత్నించిన భర్త నాలుకను కొరికి, గాయపరచింది భార్య. ప్రస్తుతం భర్త ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. వీరిద్దరికీ 2015లో వివాహమైంది. ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. చాలా ఏళ్లుగా ఎలాంటి విబేధాలు లేకుండా బాగానే ఉన్నారు. అయితే గత రెండేళ్లుగా వీరి మధ్య గొడవలు మొదలయ్యాయి. తరుచూ ఒకరిపై ఒకరు వాదనలు చేసుకుంటున్నారు. అయితే భార్యకు ఇష్టం లేకుండా ముద్దుపెట్టేందుకు ప్రయత్నించాడు భర్త. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన భార్య... అతని నాలుకను కోరికేసింది. ప్రస్తుతం అతడిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడు చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన కర్నూలు జిల్లాలో వెలుగు చూసింది.

తరచూ గొడవలు

గుంటూరు జిల్లాకు చెందిన తారాచంద్ నాయక్, కర్నూలు జిల్లా తుగ్గలి మండలానికి చెందిన పుష్పవతిని 2015లో ప్రేమ వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత వారికి ఇద్దరు పిల్లల సంతానం కలిగింది. అంతా సజావుగానే సాగుతూ ఉందన్న క్రమంలో రెండేళ్ల నుంచి వారి మధ్య ఘర్షణలు పెరిగాయి. తరుచూ ఒకరిపై ఒకరు వాదనలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం ఉదయం కూడా వారిద్దరూ గొడవపడ్డారు. ఆ తర్వాత భార్యను ముద్దుపెట్టుకునేందుకు ప్రయత్నించాడు తారాచంద్ నాయక్. ఇష్టం లేకుండా బలవంతంగా ముద్దు పెట్టుకోవడంతో పుష్పవతి.. అతడి నాలుకను బలంగా కొరికింది. దీంతో తారాచంద్ నాయక్‌ నాలుక పైభాగంలో తీవ్ర గాయమైంది. చికిత్స కోసం తారాచంద్ నాయక్ ను గుత్తి హాస్పిటల్‌కు తరలించారు. అతడిని పరీక్షించిన వైద్యులు తారాచంద్‌కు మెరుగైన చికిత్స అందించడానికి అనంతపురం హాస్పిటల్‌కు సిఫార్సు చేశారు.

Whats_app_banner