YV Subbareddy: బాబుకు మతి భ్రమించింది, రుజువు చేయకపోతే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్న వైవీ సుబ్బారెడ్డి-mp subbareddy said action will be taken as per law if the cm does not take oath on the allegations of ghee adulteration ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Yv Subbareddy: బాబుకు మతి భ్రమించింది, రుజువు చేయకపోతే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్న వైవీ సుబ్బారెడ్డి

YV Subbareddy: బాబుకు మతి భ్రమించింది, రుజువు చేయకపోతే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్న వైవీ సుబ్బారెడ్డి

Bolleddu Sarath Chandra HT Telugu
Sep 19, 2024 02:31 PM IST

YV Subbareddy: జంతువుల కొవ్వు వినియోగం ఆరోపణలపై వైసీపీ న్యాయపోరాటానికి సిద్ధమైంది. వైసీపీ అధికారంలో ఉండగా టీటీడీ లడ్డూ ప్రసాదాల తయారీలో జంతువుల కొవ్వును వినియోగించారనే ఆరోపణలపై ప్రమాణం చేసి సాక్ష్యాలతో నిరూపించాలని వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి డిమాండ్ చేశారు.

వైవీ సుబ్బారెడ్డి
వైవీ సుబ్బారెడ్డి

YV Subbareddy: తిరుమల లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు వాడకం ఆరోపణలపై శ్రీవారి సాక్షిగా చంద్రబాబు ప్రమాణం చేయాలని లేదా భక్తుల మనోభావాలు దెబ్బతీసినందుకు చట్టపరంగా, న్యాయపరంగా చర్యలు తీసుకుంటాంమని హెచ్చరించారు.

చంద్రబాబు 100రోజుల పాలనలో చెప్పిన హామీలు అమలు చేయలేదని, వివిధ హామీలు ఇచ్చి వాటిని అమలు చేయలేదు. ఎన్నికల్లో దుష్ప్రచారం చేసినట్టు, ఇప్పుడు కూడా ఘోరంగా దుష్ప్రచారం చేస్తున్నారు.ప్రపంచ వ్యాప్తంగా ఉండే హిందువుల మనోభావాలను దెబ్బతీశారు. చూసిన వెంటనే ప్రమాణం చేద్దామని రాత్రే చెప్పానని, ఐదేళ్లుగా తాము ఎలాంటి నాణ్యతా ప్రమాణాలు పాటించామో వైవీ సుబ్బారెడ్డి వివరించారు.

2014-19 వరకు ఉన్న వ్యవస్థలో ఆవు నెయ్యి సేకరణలో ఎలాంటి విధానం ఉందో, దానినే తాము కొనసాగించామన్నారు. తమ ప్రభుత్వం రాకముందు ఈవో ఉన్న అధికారినే తాము ఏడాదిన్నర పాటు కొనసాగించామన్నారు. స్వామి వారికి సమర్పించే నైవేధ్యాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపించారని, నిత్యం నైవేధ్యాలకు 60కేజీల నెయ్యిని కేవలం స్వామి వారి నైవేద్యాలకు వినియోగిస్తారని, గత మూడేళ్లుగా స్వామి వారికి సమర్పించే నెయ్యి, బియ్యం, ఇతర రకాల దినుసుల్నిమార్కెట్‌ నుంచి కొంటేఅవన్నీ పురుగు మందులతో పండిస్తారని భావించి, ఆర్గానిక్ పంటల్ని వినియోగించే, దేశీయ నెయ్యిని మాత్రమే నైవేధ్యాలకు వినియోగిస్తున్నట్టు చెప్పారు.

స్వామి వారి నైవేధ్యాల కోసం రాజస్తాన్ ఫతేపూర్‌లో ఉన్న గోశాల నుంచి నిత్యం 60కేజీల నెయ్యిని దాతల ద్వారా కొనుగోలు చేస్తున్నట్టు చెప్పారు. రోజుకు లక్ష రుపాయల విలువైన నెయ్యిని దాతలు కొనుగోలు చేసి ఇస్తున్నారని చెప్పారు. మూడున్నరేళ్లలో దాదాపు 10కోట్లను నెయ్యి కొనుగోలుకు సమకూర్చారని చెప్పారు. రాజస్తాన్, గుజరాత్ నుంచి ఆవులను తీసుకు వచ్చి స్థానికంగా గోశాలను నిర్మించినట్టు సుబ్బారెడ్డి చెప్పారు. గోశాల నిర్మాణం పూర్తై ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉందని చెప్పారు. 2014-19 మధ్య ఇలాంటి ప్రయత్నం చేయలేదన్నారు.

లడ్డూ ప్రసాదం తయారీలో వాడే నెయ్యి విషయంలో ప్రమాణాలు పాటించామని, చంద్రబాబు ప్రజల్ని నమ్మించేందుకు ఘోరమైన అబద్దాలు చెబుతున్నారని, దీనిని రుజువు చేయకపోతే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని, దీనిపై సుప్రీం కోర్టులో డిఫమేషన్ కేసు వేస్తామని ప్రకటించారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో మెరుగైన విధానాలు అమలు చేశామని, ఘోరమైన ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.

విజిలెన్స్‌ నివేదికలంటూ వచ్చిన ఆరోపణలపై కూడా న్యాయపోరాటం చేస్తామని సుబ్బారెడ్డి చెప్పారు. చంద్రబాబుకు మతిభ్రమించి మాట్లాడుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు నిందలు వేసి తమను తుడుచుకోమంటున్నారని, ఆ‍యన ఏ విచారణైనా వేసుకోవచ్చని, చంద్రబాబుకు ఛాలెంజ్ చేస్తున్నామన్నారు. తిరుమల దేవస్థానంవ విషయంలో రాజకీయంగా వ్యాఖ్యలు సరికాదన్నారు.

ఢిల్లీలో కూడా కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉందని ఏ విచారణైనా చేసుకోవచ్చన్నారు. భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారన్నారు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో పెన్షన్లు తప్ప మరే హామీని అమలు చేయలేకపోయారని వైఫల్యాలను డైవర్ట్ చేయడానికి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని సుబ్బారెడ్డి మండిపడ్డారు.