AP Cyclone Effect : ఏపీకి డిసెంబర్ భయం.. ఎన్ని తుపాన్లు తీరం దాటుతాయో తెలుసా?-more cyclones are likely to cross the coast of andhra pradesh in december ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Cyclone Effect : ఏపీకి డిసెంబర్ భయం.. ఎన్ని తుపాన్లు తీరం దాటుతాయో తెలుసా?

AP Cyclone Effect : ఏపీకి డిసెంబర్ భయం.. ఎన్ని తుపాన్లు తీరం దాటుతాయో తెలుసా?

Basani Shiva Kumar HT Telugu
Oct 29, 2024 02:04 PM IST

AP Cyclone Effect : తుపాను.. ఈ పేరు వింటే చాలు ఏపీలోని తీర ప్రాంత ప్రజలు వణికిపోతున్నారు. ఇప్పటికే ఎన్నో తుపానులు ఏపీ ప్రజలను ఇబ్బందులకు గురిచేశాయి. అయితే.. అసలు ఈ తుపాన్లు ఎలా ఏర్పడతాయి? అవి తీరాన్ని తాకడం వల్ల కలిగే నష్టం ఏమిటనే సందేహం చాలామందిలో ఉంటుంది.

ఏపీపై తుపానుల ప్రభావం
ఏపీపై తుపానుల ప్రభావం (@APSDMA)

వాతావరణ శాస్త్రపరంగా.. డిసెంబర్ నెలలో గరిష్ట సంఖ్యలో తుపానులు (సుమారు 85%) ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి తీరాల వద్ద దాటుతాయని.. నిపుణులు అంచనా వేస్తున్నారు. డిసెంబరు నెలలో ఏర్పడే తుపాన్లు 70 శాతం తీవ్ర తుపాన్లుగా బలపడతాయని.. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ స్పష్టం చేసింది. దీంతో ఏపీకి డిసెంబర్ భయం పట్టుకుంది. ఏ తుపాను ఎప్పుడు పంజా విసురుతుందోననే ఆందోళన నెలకొంది.

CTA icon
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

అసలు తుపాన్లు ఎలా ఏర్పడతాయి..

ఎక్కడైతే ఎక్కువగా గాలులు ఉంటాయో ఆ ప్రాంతాన్ని అధిక పీడనం అంటారు. అతి తక్కువ గాలులు ఉంటే దాన్ని అల్ప పీడనం అంటారు. ఈ రెండు పీడనాలు గాలుల కదలిక వల్లే ఏర్పడతాయి. గాలులు రెండు రకాలుగా ఉంటాయి. వేడి గాలి, చల్లగాలి. వేడిగాలి తేలికగా ఉండి పైకి చేరుతుంది. చల్లగాలి నెమ్మదిగా కిందికి దిగుతుంది. భూ వాతావరణాన్ని సమీపించే కొద్ది ఈ గాలి చల్లబడుతుంది. ఆవిరి ఘనీభవించి మంచు స్పటికాలుగా ఏర్పడతాయి.

ఈ కారణంగా దట్టమైన మేఘాలు ఏర్పడతాయి. కొన్ని చోట్ల సుడులు తిరుగుతూ మరింత గాలిని గ్రహిస్తాయి. ఈ అల్పపీడనం మరింత తీవ్రమైతే వాయుగుండంగా మారుతుంది. అది మరింత బలపడితే తుపానుగా ఏర్పడుతుంది. సముద్రంలో వేడెక్కిన నీటి ఆవిరిని తుపాన్లు గ్రహిస్తాయి. సముద్రంలో ఏర్పడే సుడుల వల్ల చల్లబడి దట్టమైన మేఘాలుగా ఏర్పడి తుపాన్‌తో కలిసి ప్రయాణిస్తాయి.

సముద్రంలో సుడులు రూపంలో ఉండే తుపాను.. భూ వాతావరణంలోకి ప్రవేశించడాన్నే తీరాన్ని తాకడం అంటారు. తుపాను తీరాన్ని తాకగానే సుడులు రూపంలో ఉన్న మేఘాలు చెల్లాచెదురై భారీ వర్షాలు కురుస్తాయి. సుడులకు కారణమైన గాలులు తీరం పైకి గంటకు 61 నుంచి 250 కిలో మీటర్ల కంటే వేగంగా ప్రయాణించే అవకాశం ఉంటుంది. అందుకే తుపాన్లు తీరం దాటే సమయంలో గాలులు బీభత్సం సృష్టిస్తాయి.

చరిత్రలో ఎన్నడూ లేని విధంగా..

'ప్ర‌తి బాధితుడికీ ప‌రిహారం అందించాం. వ‌ర‌ద బాధితుల‌కు అపోహ‌లు వ‌ద్దు. అర్హులైన బాధితుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే అవ‌కాశం ఇప్ప‌టికీ ఉంది. సీఎం ఆదేశాల‌తో బాధితుల‌కు మెరుగైన సాయం అందింది. ఏ ఒక్క‌రికీ సాయం రాలేద‌నే ప్ర‌శ్నే లేకుండా ప‌రిహారం పంప‌ణీ చేశాం. చ‌రిత్ర‌లో ఎన్న‌డూ లేని విధంగా ప‌రిహారం అంద‌జేశాం. సాయం అంద‌లేని అర్హులు ఇప్ప‌టికీ ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. ప‌రిశీలించి, అర్హులైతే త‌ప్ప‌కుండా సాయం అంద‌జేస్తాం. దుష్ప్ర‌చారాలు న‌మ్మ‌కండి' అని రెవెన్యూ శాఖ ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఆర్పీ సిసోడియా విజ్ఞ‌ప్తి చేశారు.

Whats_app_banner