AP Assembly Sessions: ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. 3 రాజధానుల బిల్లు ఉంటుందా..?-monsoon session of ap legislature from sep 15 house to discuss 3 capitals ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Assembly Sessions: ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. 3 రాజధానుల బిల్లు ఉంటుందా..?

AP Assembly Sessions: ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. 3 రాజధానుల బిల్లు ఉంటుందా..?

HT Telugu Desk HT Telugu
Sep 14, 2022 12:13 PM IST

AP Assembly Sessions: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 15వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 9 గంటలకు శాసనసభ, 10 గంటలకు శాసనమండలి సమావేశాలు ప్రారంభమవుతాయని గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ తాజాగా నోటిఫికేషన్‌ విడుదల చేశారు.

ఏపీ అసెంబ్లీ సమావేశాలు 2022,
ఏపీ అసెంబ్లీ సమావేశాలు 2022, (apassembly.in)

Andhrapradesh Assembly Sessions 2022: గురువారం నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, మండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు గవర్నర్ నోటిఫికేషన్ ఇచ్చారు. అయితే ఈ సమావేశాల వేళ మూడు రాజధానుల అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఈసారి కీలక చర్చ జరిగే అవకాశం ఉందన్న వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. అసలు ఏపీ అసెంబ్లీలో అసెంబ్లీలో ఏం జరగబోతుందన్న ఆసక్తి నెలకొంది.

గురువారం నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, మండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు గవర్నర్ నోటిఫికేషన్ ఇచ్చారు. అయితే ఈ సమావేశాల వేళ మూడు రాజధానుల అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఈసారి కీలక చర్చ జరిగే అవకాశం ఉందన్న వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. అసలు ఏపీ అసెంబ్లీలో అసెంబ్లీలో ఏం జరగబోతుందన్న ఆసక్తి నెలకొంది.

5 రోజుల పాటు సమావేశాలు..!

సమావేశాలు ఎన్ని రోజుల అనేదానిపై బీఏసీ సమావేశంలో నిర్ణయించనున్నారు. అయితే అధికారిక వర్గాల సమాచారం మేరకు ఐదు రోజుల పాటు సభ నడిచే అవకాశం ఉంది. అయితే ఈ సమావేశాల్లో మూడు రాజధానుల అంశం ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉందన్న లీక్ లు బయటికి వస్తున్నాయి. అయితే బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.

అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం అమరావతి రాజధానిని పక్కనబెడుతూ... మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తీసుకువచ్చింది. విశాఖలో కార్యనిర్వహక, అమరావతిలో శాసనసభ, కర్నూలును న్యాయరాజధానిగా ప్రకటించిన సంగతి తెలిసిందే. AP Decentralisation and Inclusive Development of All Regions Bill, 2020 ను కూడా తీసుకువచ్చింది. అయితే అమరావతి రైతులు దీన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో కేసులు దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు... ప్రభుత్వ నిర్ణయాన్ని తోసిపుచ్చింది. ఈ క్రమంలో వెనక్కి తగ్గిన సర్కార్... మూడు రాజధానుల బిల్లును వెనక్కి తీసుకుంది.

ఈ సందర్భంగా అసెంబ్లీలో మాట్లాడిన సీఎం జగన్... మూడు రాజధానులను ఎలాగైనా ఏర్పాటు చేసి తీరుతామని స్పష్టం చేశారు. మరోసారి బలమైన బిల్లుతో సభ ముందుకు వస్తామని చెప్పుకొచ్చారు. అయితే ముఖ్యమంత్రి జగన్ వ్యాఖ్యల దృష్ట్యా... తాజాగా జరిగబోయే అసెంబ్లీ సమావేశాల్లోనే అలాంటి ప్రయత్నం ఏమైనా జరుగుతుందా అనే చర్చ జరుగుతోంది. దీనికితోడు ఏపీ పరిశ్రమల మంత్రి అమర్ నాథ్ కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. వచ్చే ఎన్నికల లోపే మూడు రాజధానులను ఏర్పాటు చేసి తీరుతామని చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో అందరిచూపు ఏపీ అసెంబ్లీ సమావేశాలపై పడింది.

మూడు రాజధానుల ఏర్పాటు అవశ్యకతపై చర్చ జరగాల్సి ఉందన్నారు వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి. పీటీఐతో మాట్లాడిన ఆయన.. ఈ సమావేశాల్లో చర్చ జరిగే అవకాశం ఉందని.. వీటితో పాటు హౌసింగ్, ఇరిగేషన్, కొత్త జిల్లాలకు సంబంధించి మరో 20 అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉందని వెల్లడించారు.

చంద్రబాబు వస్తారా..?

ఇక టీడీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు హాజరుపై కూడా ఆసక్తి నెలకొంది. గత అసెంబ్లీ సమావేశాల సందర్భంగా నెలకొన్న పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రి అయ్యే వరకు సభకు రానంటూ చంద్రబాబు సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలో ఆయనకు సభ వస్తారా..? లేరా అనే దానిపై కూడా చర్చ జరుగుతోంది. మొత్తంగా గురువారం నుంచి ప్రారంభం కాబోయే ఏపీ అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్ గా సాగే అవకాశం కనిపిస్తోంది. ప్రతిపక్ష టీడీపీ, అధికార వైసీపీ ఎమ్మెల్యేల మధ్య డైలాగ్ వార్ నడవటం ఖాయంగానే కనిపిస్తోంది.

IPL_Entry_Point