MLC Kavitha On CBN Arrest : చంద్రబాబు అరెస్టుపై నెటిజన్ ప్రశ్న... ఎమ్మెల్సీ కవిత ఏమన్నారంటే?-mlc kavitha reaction on chandrababu arrest ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Mlc Kavitha On Cbn Arrest : చంద్రబాబు అరెస్టుపై నెటిజన్ ప్రశ్న... ఎమ్మెల్సీ కవిత ఏమన్నారంటే?

MLC Kavitha On CBN Arrest : చంద్రబాబు అరెస్టుపై నెటిజన్ ప్రశ్న... ఎమ్మెల్సీ కవిత ఏమన్నారంటే?

Maheshwaram Mahendra Chary HT Telugu
Oct 28, 2023 07:36 PM IST

MLC Kavitha On CBN Arrest : టీడీపీ అధినేత అరెస్టుపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. X (ట్విట్టర్ )లో ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు.

ఎమ్మెల్సీ కవిత
ఎమ్మెల్సీ కవిత

MLC Kavitha On CBN Arrest : టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ వ్యవహరంపై తెలంగాణ రాజకీయాల్లో చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కేటీఆర్, హరీశ్ తో పాటు పలువురు మంత్రులు స్పందించగా… తాజాగా ఎమ్మెల్సీ కవిత స్పందించారు.

సోషల్ మీడియా(X -ట్విట్టర్ )) వేదికగా #AskKavitha అంటూ నిర్వహించిన క్వశ్చన్ పోల్ లో ఓ నెటిజన్ చంద్రబాబు అరెస్ట్ అంశాన్ని ప్రస్తావించారు. ఈ ప్రశ్నకు కవిత స్పందిస్తూ… ఈ వయసులో ఇలా జరగటం దురదృష్టకరం. వారి కుటుంబం యొక్క బాధను నేను అర్థం చేసుకున్నాను. ఆ కుటుంబ సభ్యులకు నా సానుభూతి" అంటూ సమాధానం ఇచ్చారు.

కొద్దిరోజుల కిందట చంద్రబాబు అరెస్ట్ అంశంపై కేటీఆర్ స్పందించిన తీరు తీవ్రస్థాయిలో చర్చకు దారి తీసింది. కేటీఆర్ స్పందించిన తీరుపై టీడీపీ శ్రేణులతో పాటు చంద్రబాబు అభిమానాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత ఖమ్మంలో మాట్లాడిన కేటీఆర్… సీనియర్ ఎన్టీఆర్ ను తెగ పొగిడేశారు. మరోవైపు మంత్రి హరీశ్ రావు… చంద్రబాబు అరెస్ట్ బాధాకరమని అన్నారు. వీరు ఇలా ఉంటే… పార్టీలో చాలా మంది ఎమ్మెల్యేలు… చంద్రబాబు అరెస్ట్ ను తీవ్రంగా ఖండించారు. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కూడా…. కక్షపూరిత చర్యలు సరికావని వ్యాఖ్యానించారు. ఇక తలసాని స్పందిస్తూ…. చంద్రబాబును అరెస్టును ఖండిస్తున్నట్లు చెప్పారు.

అయితే తెలంగాణ నేతల రియాక్షన్లపై వైసీపీ నేతలు ఘాటుగా స్పందించారు. చంద్రబాబుపై ప్రేమతో తెలంగాణ ఖండించటం లేదని... కేవలం ఓట్ల కోసమే తమాషాలు చేస్తున్నారంటూ స్టేట్ మెంట్లు ఇచ్చారు.