AP MLC Elections 2024 : తూర్పు గోదావరి- పశ్చిమ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ ఎలక్షన్.. ముఖ్య తేదీలు, వివరాలు ఇవే-mlc elections for east godavari and west godavari districts to be held on december 5th ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Mlc Elections 2024 : తూర్పు గోదావరి- పశ్చిమ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ ఎలక్షన్.. ముఖ్య తేదీలు, వివరాలు ఇవే

AP MLC Elections 2024 : తూర్పు గోదావరి- పశ్చిమ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ ఎలక్షన్.. ముఖ్య తేదీలు, వివరాలు ఇవే

AP MLC Elections 2024 : తూర్పుగోదావరి- పశ్చిమ గోదావరి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఉపఎన్నిక షెడ్యూల్ విడుదలైంది. ఈ ఎన్నికకు సంబంధించిన పోలీంగ్ డిసెంబర్ 5వ తేదీన జరగనుంది. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అక్టోబర్ 1 నుంచి ఈనెల 6 వరకు పట్టభద్రుల ఓటర్ల నమోదుకు దరఖాస్తులు స్వీకరించారు.

ఎమ్మెల్సీ ఎలక్షన్

తూర్పు గోదావరి- పశ్చిమ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది. డిసెంబర్‌ 12లోగా ఎన్నిక నిర్వహణ పూర్తి చేయాలని ఈసీ నిర్ణయించింది. ఈ నెల 18 వరకు నామినేషన్‌కు గడువు ఇచ్చారు. 19న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. డిసెంబర్ 5న ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని ఈసీ స్పష్టం చేసింది.

షెడ్యూల్ ఇలా..

1.నోటిఫికేషన్ జారీ - నవంబర్ 11, 2024

2.నామినేషన్లు వేయడానికి చివరి తేదీ - నవంబర్ 18, 2024

3.నామినేషన్ల పరిశీలన- నవంబర్ 19, 2024

4. నామినేషన్ ఉపసంహరణకు చివరి తేదీ- నవంబర్ 21 , 2024

5. పోలింగ్ తేదీ- డిసెంబర్ 05, 2024

6. పోలింగ్ సమయం - ఉదయం 8 గంటల నుంచి సాయంత్ర 4 గంటల వరకు

7.ఓట్ల లెక్కింపు - డిసెంబర్ 09, 2024

8. ఎన్నికలు ముగించాల్సిన తేదీ-12 డిసెంబర్, 2024

2025 మార్చి 29తో ఉమ్మడి కృష్ణా- గుంటూరు. తూర్పు- పశ్చిమగోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గాలు, ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీల పదవీకాలం ముగుస్తుంది. ఎమ్మెల్సీలు కేఎస్ లక్ష్మణ రావు, పాకలపాటి రఘువర్మ, ఇళ్ల వెంకటేశ్వరరావు పదవీకాలం 2025 మార్చి 29తో పూర్తి అవుతుంది.

ఉమ్మడి పశ్చిమ, తూర్పుగోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గాల్లో ఓటర్ల నమోదుకు ఈసీ నోటిఫికేషన్‌ జారీ చేసిన విషయం తెలిసిందే. అక్టోబర్ 1 నుంచి నవంబర్ 6 వరకు ఈ జిల్లాల పరిధిలో పట్టభద్రుల ఓటర్ల నమోదుకు దరఖాస్తులు స్వీకరించారు. ఫారం-18 ద్వారా ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. నవంబర్‌ 23న ఓటర్ల జాబితా డ్రాఫ్ట్‌ను విడుదల చేయనున్నారు.

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల పట్ల వైసీపీ అనూహ్య నిర్ణయం తీసుకుంది. కృష్ణ, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్టు వైసీపి ప్రకటించింది.