Mega DSC Schedule: జూలై 1న మెగా డిఎస్సీ 2024 షెడ్యూల్‌.. మరో విడత టెట్ నిర్వహణకు క్యాబినెట్ అమోదం-mega dsc 2024 schedule on july 1 cabinet approves another round of tet ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Mega Dsc Schedule: జూలై 1న మెగా డిఎస్సీ 2024 షెడ్యూల్‌.. మరో విడత టెట్ నిర్వహణకు క్యాబినెట్ అమోదం

Mega DSC Schedule: జూలై 1న మెగా డిఎస్సీ 2024 షెడ్యూల్‌.. మరో విడత టెట్ నిర్వహణకు క్యాబినెట్ అమోదం

Sarath chandra.B HT Telugu
Jun 25, 2024 10:43 AM IST

Mega DSC Schedule: ఏపీలో మెగా డిఎస్సీ నోటిఫికేషన్ జూలైలో విడుదల కానుంది. 16వేల డీఎస్సీ పోస్టులను ఈ ఏడాది డిసెంబర్ కల్లా రిక్రూట్ చేయాలని ప్రభుత్వం డెడ్ లైన్ పెట్టుకుంది.

జూలై 1న ఏపీ మెగా డిఎస్సీ 2024 షెడ్యూల్  విడుదల
జూలై 1న ఏపీ మెగా డిఎస్సీ 2024 షెడ్యూల్ విడుదల

Mega DSC Schedule: ఏపీలో మెగా డిఎస్సీతో పాటు మరో సారి టెట్‌ నోటిఫికేషన్ విడుదల కానుంది. మెగా డిఎస్సీకి క్యాబినెట్ అమోద ముద్ర వేసిన నేపథ్యంలో మరోసారి టెట్‌ పరీక్షను కూడా నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంలో 16,347 పోస్టుల భర్తీకి ఏపీ క్యాబినెట్ అమోద ముద్ర వేసింది.

yearly horoscope entry point

ఏపీ మెగా డిఎస్సీ నోటిఫికేషన్‌ జూలై1న విడుదల కానుంది. 16347 పోస్టులతో డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఎన్నికలకు ముందు 6,100 పోస్టులతో డిఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేశారు. తాజాగా పోస్టుల్ని సవరించి మెగా డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఇందుకు సంబంధించిన జీవో రెండు మూడు రోజుల్లో విడుదల కానుంది. నేడు టెట్‌ ఫలితాలను విడుదల చేయనున్నారు. మెగా డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల కానుండటంతో మరోసారి టెట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేయాలని భావిస్తున్నారు. ఇటీవల డిఇడి, బీఈడీ కోర్సులు పూర్తి చేసిన వారికి వీలుగా మరోసారి టెట్‌ నిర్వహించనున్నారు. ఈ మేరకు టెట్‌ నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని విద్యాశాఖ మంత్రి లోకేష్ అధికారులను ఆదేశించారు.

డిఎస్సీని వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు కసరత్తు చేయాలని లోకేష్ అధికారులకు సూచించారు. టెట్‌తో కలిపి డిఎస్సీ నిర్వహణకు క్యాబినెట్ అమోదం తెలిపింది.

మెగా డిఎస్సీలో రెండు విభాగాల్లో ఉపాధ్యాయ పోస్టుల్ని భర్తీ చేస్తారు. జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపల్, గిరిజన సంక్షేమ పాఠశాలల్లో 14,066 పోస్టులు భర్తీ చేస్తారు. మొత్తం పోస్టుల్లో స్కూల్ అసిస్టెంట్‌ తెలుగు 655, హిందీ 536, ఇంగ్లీష్ 1086, లెక్కలు 726, ఫిజిక్స్ 706, బయాలజీ 957, సోషల్ 138 పోస్టులు ఉన్నాయి. వ్యాయామ ఉపాధ్యాయులు 1691, ఎస్జీటీ 6341 పోస్టుల్ని భర్తీ చేస్తారు. ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్, మోడల్ స్కూల్స్, బీసీ గురుకుల పాఠశాలలు, జువైనల్ స్కూల్స్‌లో 2281 పోస్టులు ఉన్నాయి. జోన్ల వారీగా వీటిని భర్తీ చేస్తారు. రాష్ట్ర స్థాయిలో 266 పోస్టులు, జోన్ 1లో 405, జోన్‌ 2లో 355, జోన్‌ 3లో 573, జోన్‌ 4లో 682 పోస్టులను భర్తీ చేస్తారు.

మెగా డీఎస్సీ 2024 - పోస్టులు ఎన్నంటే…

ఏపీలో తాజాగా వచ్చే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 16,347 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో సెకండరీ గ్రేడ్‌ టీచర్లు (ఎస్జీటీ) 6,371,స్కూల్‌ అసిస్టెంట్లు (ఎస్‌ఏ)- 7,725, ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్స్‌ (టీజీటీలు)-1,781, పోస్టు గ్రాడ్యుయేట్‌ టీచర్స్‌ (పీజీటీలు)-286, ప్రిన్సిపాళ్లు 52, వ్యాయామ ఉపాధ్యాయులు (పీఈటీలు)-132 ఉద్యోగాలు ఉన్నాయి.

వైసీపీ ప్రభుత్వం ఎన్నికలకు ముందు 6,100 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే.ఈ పోస్టుల్లో 2,280 సెకండరీ గ్రేడ్‌ టీచర్లు (ఎస్‌జీటీ), 2,299 స్కూల్‌ అసిస్టెంట్లు (ఎస్‌ఏ), 1,264 ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్లు (టీజీటీ), 215 పోస్టు గ్రాడ్యుయేట్‌ టీచర్లు (పీజీటీ), 42 ప్రిన్సిపాల్‌ పోస్టులు ఉన్నాయి.

ఈ నోటిఫికేషన్ కు సంబంధించి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కూడా పూర్తి అయింది. డీఎస్సీతో పాటే టెట్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. టెట్ ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. ఎన్నికల కోడ్ ఎఫెక్ట్ తో డీఎస్సీ పరీక్షలు మాత్రం వాయిదా పడుతూ వచ్చాయి. ఇంతలోనే రాష్ట్రంలో ప్రభుత్వం మారటంతో…. సీన్ మారిపోయింది. కొత్త ప్రభుత్వం మెగా డీఎస్సీ విడుదలకు శ్రీకారం చుట్టింది.

ప్రక్రియ పూర్తికి డెడ్ లైన్….

విద్యాశాఖ కొత్తగా ఈ పోస్టుల భర్తీకి జూలై 1న నోటిఫికేషన్ ఇవ్వనుంది. గత డీఎస్సీ ప్రకటనను అనుసరించి దరఖాస్తు చేసుకున్నవారు మళ్లీ దరఖాస్తు చేయక్కర్లేదు. కొత్తగా ఏ జిల్లాలకైనా అదనంగా దరఖాస్తు చేసుకోవాలనుకుంటే ఛాన్స్ ఇవ్వనున్నారు. ఈ ఏడాది డిసెంబరు 31 నాటికి పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తి చేసేందుకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. మొత్తం ప్రక్రియను 6 నెలల్లోపే పూర్తి చేయనున్నారు.

Whats_app_banner