AP IPS Transfers: ఎన్నికల వేళ ఏపీలో భారీగా ఐపిఎస్ అధికారుల బదిలీలు-massive transfers of ips officers in ap in the wake of general elections ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Ips Transfers: ఎన్నికల వేళ ఏపీలో భారీగా ఐపిఎస్ అధికారుల బదిలీలు

AP IPS Transfers: ఎన్నికల వేళ ఏపీలో భారీగా ఐపిఎస్ అధికారుల బదిలీలు

Sarath chandra.B HT Telugu
Jan 30, 2024 06:11 AM IST

AP IPS Transfers: ఏపీలో భారీగా ఐపిఎస్‌ అధికారుల బదిలీలు జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి 30మంది ఐపిఎస్‌ అధికారుల్ని బదిలీ చేస్తూ సిఎస్ ఉత్తర్వులు జారీ చేశారు.

ఏపీలో భారీగా ఐపిఎస్ అధికారుల బదిలీలు
ఏపీలో భారీగా ఐపిఎస్ అధికారుల బదిలీలు

AP IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్‌లను బదిలీ చేశారు.ఎన్నికల నేపథ్యంలో 30 మంది ఐపీఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరు ఎస్పీ రిశాంత్‌ రెడ్డిని కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ విభాగానికి బదిలీ చేశారు. దీంతో పాటు ఎర్రచందనం స్మగ్లింగ్‌ నిరోధక విభాగం ఎస్పీగా అదనపు బాధ్యతలు అప్పగించింది.

రిషాంత్‌ రెడ్డి మీద టీడీపీ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తోంది. ఎన్నికల సమయంలో ఉమ్మడి చిత్తూరు జిల్లాపై పట్టు ఉండేలా పోస్టింగ్ ఇచ్చిందనే ఆరోపణలు ఉన్నాయి.

చిత్తూరు ఎస్పీగా ప్రస్తుతం కృష్ణా జిల్లాలో పనిచేస్తున్న పి. జాషువాను నియమించింది. కర్నూలు డీఐజీ సెంథిల్‌ కుమార్‌ను ఆక్టోపస్‌ సహా శాంతి భద్రతలకు బదిలీ చేసింది. , నెల్లూరు ఎస్పీగా ఉంటూ.. వైసీపీకి పూర్తిగా సహకరిస్తున్నారనే విమర్శలు ఎదుర్కొన్న విజయారావును కర్నూలు డీఐజీగా ప్రభుత్వం నియమించింది.

సీఎం సొంత జగన్‌ జిల్లా కడప కూడా ఇకపై విజయారావు పర్యవేక్షణలోకి రానుంది. అనంతపురం జిల్లా ఎస్పీగా ఉన్న ఫక్కీరప్పను విశాఖ నగరంలో రెండో స్థాయి ఐపీఎస్‌ అధికారిగా ప్రభుత్వం నియమించింది. ఫక్కీరప్ప.. సీఎం జగన్‌ చిన్నాన్న వివేకానందరెడ్డి దారుణ హత్య కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులపైనే కేసు నమోదు చేశారు.

విజయవాడ నుంచి ఇద్దరు దళిత ఐపీఎస్‌ అధికారుల్ని విశాఖపట్నం రేంజ్‌కు బదిలీ చేశారు. ప్రస్తుతం విజయవాడలో విధులు నిర్వహిస్తున్న విశాల్‌ గున్నీని విశాఖ డీఐజీగా బదిలీ చేశారు.

రాష్ట్రంలోని మరి కొంత మంది ఐపీఎస్‌ అధికారులను ప్రభుత్వం మంగళవారం బదిలీ చేసే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. తిరుపతి, ప్రకాశం, బాపట్ల, పల్నాడు, గుంటూరు అర్బన్‌, విజయనగరం జిల్లాల ఎస్పీలను బదిలీ చేయనున్నట్టు తెలుస్తోంది.

బదిలీ అయిన ఐపీఎస్‌లు వీరే..

రైల్వే పోలీస్‌ అదనపు డీజీగా కుమార్‌ విశ్వజిత్‌

ఏపీఎస్పీ అదనపు డీజీగా అతుల్‌ సింగ్‌

ఆక్టోపస్‌ ఐజీగా సీహెచ్‌ శ్రీకాంత్‌ (రోడ్డు సేఫ్టీ అథారిటీ ఐజీగానూ అదనపు బాధ్యతలు)

విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఐజీగా కొల్లి రఘురామిరెడ్డి (డ్రగ్స్‌ డైరెక్టర్‌ జనరల్‌గానూ అదనపు బాధ్యతలు)

రాష్ట్రస్థాయి పోలీసు నియామక బోర్డు ఛైర్మన్‌గా రాజశేఖర్‌ బాబు (ఐజీ హోంగార్డ్స్‌గానూ అదనపు బాధ్యతలు)

సీఐడీ ఐజీగా సర్వశ్రేష్ఠ త్రిపాఠి

పోలీసు సిబ్బంది వ్యవహారాల ఐజీగా హరికృష్ణ (టెక్నికల్‌ సర్వీసెస్ ఐజీగానూ అదనపు బాధ్యతలు)

ఆక్టోపస్‌ డీఐజీగా సెంథిల్‌ కుమార్‌ (శాంతిభద్రతల డీఐజీగాను అదనపు బాధ్యతలు)

పోలీసు శిక్షణ డీఐజీగా రాహుల్‌దేవ్‌ శర్మ

విశాఖ రేంజ్‌ డీఐజీగా విశాల్‌ గున్ని

కర్నూల్‌ రేంజ్‌ డీఐజీగా సీహెచ్‌ విజయరావు

విశాఖ సంయుక్త పోలీస్‌ కమిషనర్‌గా ఫకీరప్ప

కృష్ణా జిల్లా ఎస్పీగా అద్నాన్‌ నయీం ఆస్మి

ఏపీఎస్పీ ఆరో బెటాలియన్‌ కమాండెంట్‌గా అమిత్‌ బర్దార్‌

ఇంటెలిజెన్స్‌ సెక్యూరిటీ వింగ్‌ ఎస్పీగా ఆరిఫ్‌ హఫీజ్‌

ప.గో జిల్లా ఎస్పీగా హజిత్‌ వేజెండ్ల

రాజమండ్రి విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఆఫీసర్‌గా సుబ్బారెడ్డి

కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ ఎస్పీగా వై.రిశాంత్‌ రెడ్డి (ఎర్రచందనం టాస్క్‌ఫోర్స్‌ ఎస్పీగానూ అదనపు బాధ్యతలు)

చిత్తూరు ఎస్పీగా జోషువా

ఏసీబీ ఎస్పీగా రవిప్రకాశ్‌

విశాఖ శాంతిభద్రతల డీసీపీగా సీహెచ్‌ మణికంఠ

ఏపీఎస్పీ ఐదో బెటాలియన్‌ కమాండెంట్‌గా అధిరాజ్‌ సింగ్‌ రాణా

కాకినాడ మూడో బెటాలియన్‌ కమాండెంట్‌గా కృష్ణకాంత్‌ పటేల్‌

గుంటూరు ఎస్పీగా తుషార్‌

జగ్గయ్యపేట డీసీపీగా కె.శ్రీనివాసరావు

రంపచోడవరం ఏఎస్పీగా కె.ధీరజ్‌

పాడేరు ఏఎస్పీగా ఎ.జగదీశ్‌

విజయవాడ డీసీపీగా ఆనంద్‌ రెడ్డి

విశాఖ డీసీపీగా సత్యనారాయణ

Whats_app_banner