Kadapa Accident : కడపలో విషాదం, విద్యుత్ వైర్ తగిలి విద్యార్థి మృతి-సీసీకెమెరాలో రికార్డు-kadapa two student cycle riding electrocution one died cctv footage ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Kadapa Accident : కడపలో విషాదం, విద్యుత్ వైర్ తగిలి విద్యార్థి మృతి-సీసీకెమెరాలో రికార్డు

Kadapa Accident : కడపలో విషాదం, విద్యుత్ వైర్ తగిలి విద్యార్థి మృతి-సీసీకెమెరాలో రికార్డు

Bandaru Satyaprasad HT Telugu
Aug 21, 2024 06:19 PM IST

Kadapa Accident : కడపలో ఘోర ప్రమాదం జరిగింది. సైకిల్ పై ఇంటికి వెళ్తున్న ఇద్దరు విద్యార్థులకు కరెంట్ వైర్లు తగిలి విద్యుదాఘాతానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో ఒక చిన్నారి మృతి చెందగా, మరొకరి పరిస్థితి విషయంగా ఉంది. ఈ ఘటనపై మంత్రి నారా లోకేశ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

కడపలో విషాదం, విద్యుత్ వైర్ తగిలి విద్యార్థి మృతి-సీసీకెమెరాలో రికార్డు
కడపలో విషాదం, విద్యుత్ వైర్ తగిలి విద్యార్థి మృతి-సీసీకెమెరాలో రికార్డు

Kadapa Accident : కడపలో ఘోర ప్రమాదం జరిగింది. నగర పరిధిలోని అగాడి వీధిలో విద్యుత్ వైర్లు తగిలి ఇద్దరు బాలురు విద్యుదాఘాతానికి గురయ్యారు. ఈ ప్రమాదాన్ని గమనించిన స్థానికులు విద్యార్థులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ దుర్ఘటనలో ఒక విద్యార్థి మృతి చెందగా, మరొకరి పరిస్థితి విషయంగా ఉందని వైద్యులు తెలిపారు. స్కూల్ నుంచి సైకిల్ పై మధ్యాహ్నం ఇంటికి వస్తుండగా.. ఈ ఘటన చోటుచేసుకుంది. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణమని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ప్రమాదం దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.

విద్యార్థి మృతిపై మంత్రి లోకేశ్ దిగ్భ్రాంతి

కడప అగాడి వీధిలో వేలాడుతున్న విద్యుత్ తీగలు తగిలి తన్వీర్(11) అనే చిన్నారి మృతి చెందిన ఘటన తనను తీవ్ర ఆవేదనకు గురిచేసిందని మంత్రి నారా లోకేశ్ అన్నారు. విద్యుదాఘాతంతో గాయపడిన మరో విద్యార్థికి మెరుగైన వైద్యం అందించాల్సిందిగా అధికారులను ఆదేశించాను. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా విద్యుత్ శాఖ అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. మృతి చెందిన చిన్నారి కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని ట్వీట్ చేశారు.

విద్యుత్ ప్రమాదాలపై మంత్రి ఏమన్నారంటే?

విద్యుత్ ప్రమాదాలపై ఇటీవల మంత్రి గొట్టపాటి రవికుమార్ స్పందించారు. వర్షాకాలంలో విద్యుత్ షాక్ సమస్య పెరిగిపోతుందని, ఈదురుగాలులకు విద్యుత్ తీగలు తెగిపడి, తడిసిన స్తంభాలు, గోడల వల్ల కరెంట్ షాక్ ఘటనలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వర్షాకాలంలో విద్యుత్ షాక్ ల ఘటనలు తగ్గించేందుకు చర్యలు చేపట్టాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్ విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు విద్యుత్ షాక్ తో మృతి చెందిన వారి వివరాలను అడిగి తెలుసుకున్నారు. విద్యుత్ షాక్ ప్రాణనష్టాన్ని తగ్గించేలా అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. విద్యుత్ షాక్ మరణాలపై నివేదిక అందించాలన్నారు. ప్రాణ నష్టానికి కారణాలు అంచనా వేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.

పంట పొలాలు, విధుల్లో కరెంట్ వైర్లు వేలాడటం ఎక్కువ మంది ప్రజలతో పాటు విద్యుత్ సిబ్బంది షాక్ కు గురైన ఘటనలు తన దృష్టికి వచ్చాయని మంత్రి తెలిపారు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా వేలాడుతున్న విద్యుత్ వైర్లపై శ్రద్ధ వహించాలని, ప్రజలు ఇబ్బంది పడుతున్న సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి, తగిన చర్యలు తీసుకోవాలని మంత్రి రవికుమార్ ఆదేశించారు. విద్యుత్ లైన్ల మరమ్మతులను త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తే తక్షణనే సమస్యను పరిష్కారించాలని ఆదేశించారు. అలా కాకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవన్నారు. కరెంట్ షాక్ తో మరణించిన వారికి పరిహారం ఇచ్చి చేతులు దులుపుకోవడం ప్రభుత్వ విధానం కాదని, ప్రమాదాలు జరగకుండా నివారించడమే తమ పని అన్నారు. నష్టపోయిన ప్రతీ కుటుంబానికి న్యాయం చేస్తామన్నారు.

Whats_app_banner

సంబంధిత కథనం