TTD NEWS| శ్రీవారి స్నపనం కోసం జపాన్ ఆపిల్స్ - మస్కట్ గ్రేప్స్ - కొరియన్ పియర్స్-japan apples korean pears and muscut grapes for tirumala srivari brahmothsavalu ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ttd News| శ్రీవారి స్నపనం కోసం జపాన్ ఆపిల్స్ - మస్కట్ గ్రేప్స్ - కొరియన్ పియర్స్

TTD NEWS| శ్రీవారి స్నపనం కోసం జపాన్ ఆపిల్స్ - మస్కట్ గ్రేప్స్ - కొరియన్ పియర్స్

HT Telugu Desk HT Telugu
Sep 28, 2022 08:52 PM IST

Srivari brahmothsavalu: శ్రీవారి స్నపనం కోసం ప్రత్యేకంగా జపాన్ యాపిల్స్ ను, మస్కట్ గ్రేప్స్ ను, కొరియన్ పియర్స్ ను తెప్పించారు. అలాగే, ప్రత్యేక అలంకరణకు ఒక టన్ను కట్ ఫ్లవర్స్ మరియు పండ్లు తీసుకువచ్చారు.

<p>విశేషాలంకరణలో స్వామి, అమ్మవార్లు</p>
విశేషాలంకరణలో స్వామి, అమ్మవార్లు

Srivari brahmothsavalu: దేశీయ తృణధాన్యాలు, పండ్లు, పూలు, సుగంధ ద్రవ్యాలు శ్రీవారి కైంకర్యంలో ఏ విధంగా తరిస్తున్నాయో, ఈ ఏడాది బ్రహ్మోత్సవాలలో జపాన్ నుండి యాపిల్స్, మస్కట్ నుండి ద్రాక్ష, కొరియా నుండి పియర్స్, థాయిలాండ్ నుండి మామిడి మరియు అమెరికా నుండి చెర్రీస్ కూడా స్వామివారి సేవలో తరించాయి.

Srivari brahmothsavalu: ప్రపంచం నలు మూలల నుంచి..

ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు శ్రీవారిపై ఉన్న భక్తితో వేలాది కిలోమీటర్ల లోని తమ స్వస్థలాల నుండి ఈ పండ్లు, పుష్పాలను స్వామివారికి సమర్పించారు. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన బుధవారం మధ్యాహ్నం రంగనాయకుల మండపంలో స్నపన తిరుమంజనం జరిగింది. శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీ మలయప్ప స్వామి ఉత్సవమూర్తులను ప్రత్యేక వేదికపై వేంచేపు చేసి సుగంధ ద్రవ్యాలతో స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని టీటీడీ గార్డెన్ విభాగం ప్రత్యేక అలంకరణలు చేసింది. ఒక్క టన్ను సంప్రదాయ పుష్పాలు, కట్ ఫ్లవర్స్, పండ్లు, లతలతో వేదికను శోభాయమానంగా అలంకరించడమే కాకుండా శ్రీ మలయప్ప స్వామివారికి రూపొందించిన పూలమాలలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

Srivari brahmothsavalu: రాగుల మాల

మొట్టమొదటిసారిగా, ఫింగర్ మిల్లెట్ (రాగులతో) చేసిన మాల, పచ్చని పవిత్రాలు మరియు పగడపు మాలలతో పాటు స్నపన తిరుమంజనంలో ఏలకులు, వట్టి వేరు, ద్రాక్ష, తులసి దండలు కూడా స్వామి అమ్మవార్లకు అలంకరించారు. గార్డెన్ డిప్యూటీ డైరెక్టర్ శ్రీ శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఈ ఏడాది థాయ్‌లాండ్‌కు చెందిన లిచిస్‌, ఆస్ట్రేలియన్‌ పింక్‌, బ్లాక్‌ గ్రేప్స్‌, వివిధ దేశాలకు చెందిన పండ్లను స్వామి అమ్మవార్లకు నైవేద్యంగా సమర్పించినట్లు తెలిపారు. నాలుగు రోజుల పాటు చెన్నైకి చెందిన నైపుణ్యం గల పుష్ప కళాకారులు ప్రత్యేక అలంకరణలు చేశారు.

Srivari brahmothsavalu: రంగనాయకుల మండపంలో..

ఆలయంలోని రంగనాయకుల మండపంలో మధ్యాహ్నం ఒంటి గంట నుండి మూడు గంటల వరకు వేద మంత్రోచ్ఛారణల మధ్య జరిగిన ఈ పవిత్రోత్సవంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి, తిరుమల శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి, టీటీడీ ఈవో ఎవి ధర్మారెడ్డి, ఆలయ డిప్యూటీ ఈవో రమేష్ బాబు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Whats_app_banner