Ys Jagan tweet: ఏపీలో భయానక వాతావరణం.. వైసీపీ శ్రేణులకు రక్షణ లేదని, దాడులు చేస్తున్నారని జగన్ ఆందోళన-jagan is worried about ycp cadre not safe and tdp attacks are being carried out ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ys Jagan Tweet: ఏపీలో భయానక వాతావరణం.. వైసీపీ శ్రేణులకు రక్షణ లేదని, దాడులు చేస్తున్నారని జగన్ ఆందోళన

Ys Jagan tweet: ఏపీలో భయానక వాతావరణం.. వైసీపీ శ్రేణులకు రక్షణ లేదని, దాడులు చేస్తున్నారని జగన్ ఆందోళన

Sarath chandra.B HT Telugu

Ys Jagan tweet: ఏపీలో ఎన్నికల ఫలితాల తర్వాత జరుగుతున్న పరిణామాలపై వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులు నిస్తేజంగా మారారని, వైసీపీ శ్రేణులకు రక్షణ లేకుండా పోయిందని ఆరోపించారు.

వైసీపీ శ్రేణులపై దాడులపై జగన్ ఆందోళన

Ys Jagan tweet: ఏపీలో ఎన్నికల ఫలితాల తర్వాత వైసీపీ శ్రేణులపై జరుగుతున్న దాడులపై వైసీపీ అధ్యక్షుడు జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. "రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ దాడులతో అత్యంత భయానక వాతావరణం నెలకొంది. ప్రభుత్వం ఏర్పాటుకాకముందే టీడీపీ ముఠాలు స్వైరవిహారం చేస్తున్నాయని ఎక్కడికక్కడ గ్రామ సచివాలయాలు, ఆర్బీకేల్లాంటి ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేస్తున్నారని జగన్ ఆరోపించారు.

వైయస్సార్‌సీపీకి చెందిన నాయకులు, కార్యకర్తలకు రక్షణ లేకుండా పోయిందని అధికార పార్టీ ఒత్తిళ్లతో పోలీసు వ్యవస్థ నిస్తేజంగా మారిపోయిందని, వెరసి ఐదేళ్లుగా పటిష్టంగా ఉన్న శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు.

గౌరవ గవర్నర్‌ @governorap వెంటనే జోక్యం చేసుకుని పచ్చ మూకల అరాచకాలను అడ్డుకోవాలని, ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు, ప్రభుత్వ ఆస్తులకు రక్షణగా నిలవాలని విజ్ఞప్తిచేస్తున్నాం. టీడీపీ దాడుల కారణంగా నష్టపోయిన ప్రతి కార్యకర్తకూ, సోషల్‌ మీడియా సైనికులకు తోడుగా ఉంటామని ట్వీట్ చేశారు.

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఘోర పరాజయం పాలైంది. 2019లో 151 సీట్లతో అధికారంలోకి వచ్చిన వైసీపీ 2024 ఎన్నికల్లో 11 సీట్లకు పరిమితం అయ్యింది. ఐదేళ్లుగా వైసీపీ తమను రాజకీయంగా వేధించిందనే ఆరోపణలతో పలు ప్రాంతాల్లో ఘర్షణలు జరుగుతున్నాయి. ఎన్నికల ఫలితాల తర్వాత అల్లర్లను అదుపు చేయడానికి రాష్ట్రంలో కేంద్ర బలగాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే వైసీపీ అధ్యక్షుడు ట్వీట్ చేశారు.