IRCTC Coonoor Tour: కట్టిపడేసే 'కూనూర్' అందాలు.. తిరుపతి నుంచి ప్యాకేజీ ఇదే-irctc tourism announced coonoor tour from tirupati city
Telugu News  /  Andhra Pradesh  /  Irctc Tourism Announced Coonoor Tour From Tirupati City
తిరుపతి - కున్నూర్ టూర్
తిరుపతి - కున్నూర్ టూర్ (twitter)

IRCTC Coonoor Tour: కట్టిపడేసే 'కూనూర్' అందాలు.. తిరుపతి నుంచి ప్యాకేజీ ఇదే

25 December 2022, 13:04 ISTMahendra Maheshwaram
25 December 2022, 13:04 IST

IRCTC Coonoor Tour Package : మీకు కూనూర్ వెళ్లాలని ఉందా..? అయితే ఐఆర్‌సీటీసీ గుడ్ న్యూస్ చెప్పింది. తిరుపతి నుంచి కూనూర్ కి సూపర్ ప్యాకేజీ అందిస్తోంది. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

IRCTC Tourism Tirupati Coonoor Package: వేర్వురు ప్రదేశాలను దర్శించుకునేందుకు కొత్త కొత్త ప్యాకేజీలను ప్రకటిస్తోంది ఐఆర్‌సీటీసీ టూరిజం. తాజాగా తిరుపతి నుంచి తమిళనాడులోని పలు ప్రాంతాలను చూసేందుకు టూర్ ప్యాకేజీని ప్రకటించింది. 'ULTIMATE OOTY EX TIRUPATI ' పేరుతో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. ఈ టూర్ లో కూనూర్, ఊటీతో పాటు పర్యాటక ప్రాంతాలు కవర్ అవుతాయి.

Tirupati Coonoor Tour Schedule: 5 రాత్రులు, 6 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. ప్రస్తుతం ఈ టూర్ ప్యాకేజీ జనవరి 17వ తేదీన అందుబాటులో ఉంది. ప్రతి మంగళవారం తేదీల్లో ఈ టూర్ ను ఆపరేట్ చేసున్నారు. ఆరు రోజుల ప్లాన్ ఎలా ఉంటుందో చూస్తే....

Day - 01 Tuesday: తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి రాత్రి 11.55 గంటలకు ట్రైన్ బయల్దేరుతుంది. రాత్రి అంత జర్నీ ఉంటుంది.

Day - 02 Wednesday: ఉదయం 08.02 గంటలకు కోయంబత్తూరు రైల్వే స్టేషన్ కు చేరుకుంటారు. అక్కడ్నుంచి ఊటీకి వెళ్తారు. హోటల్ కి చెకిన్ అయిన తర్వాత... మధ్యాహ్నం బోటానికల్ గార్డెన్ ను సందర్శిస్తారు. ఊటీ లేక్ చూస్తారు. రాత్రి ఊటీలోనే బస చేస్తారు.

Day - 03 Thursday: బ్రేక్ ఫాస్ట్ అయిన తర్వాత దొడబెట్ట, టీ మ్యూజియం, పైకార ఫాల్స్ కు వెళ్తారు. రాత్రి కూడా ఊటీలోనే బస చేస్తారు.

Day - 04 Friday: బ్రేక్ ఫాస్ట్ తర్వాత కూనూర్ వెళ్తారు. అక్కడ పలు ప్రాంతాలను చూస్తారు. మధ్యాహ్నం తిరిగి ఊటీకి చేరుకుంటారు. రాత్రి ఊటీలోనే ఉంటారు.

Day - 05 Saturday: హోటల్ నుంచి కోయంబత్తూరు వెళ్తారు. సాయంత్రం 04.35 నిమిషాలకు రైలు ప్రయాణం మొదలవుతుంది.

Day - 06 Sunday: రాత్రి 12.05 నిమిషాలకు తిరుపతి రైల్వే స్టేషన్ చేరుకోవటంతో టూర్ ముగుస్తుంది.

ధర ఎంతంటే..?

Tirupati CoonoorTour Cost: కంఫర్డ్ క్లాస్ లో సింగిల్ షేరింగ్ కు రూ. 25,420 ధర ఉండగా.. డబుల్ షేరింగ్ కు రూ. 13,780 ధరగా ప్రకటించారు. ట్రిపుల్ షేరింగ్ కు రూ.10,870గా ఉంది. 5 నుంచి 11 ఏళ్ల చిన్నారుకు కూడా టికెట్ ధరలు నిర్ణయించారు. పూర్తి వివరాలను కింద ఇచ్చిన జాబితాలో చూసుకోవచ్చు. ఇక టూర్ ప్యాకేజీలో టికెట్లు, హోటల్‌లో వసతి, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ కవర్ అవుతాయి.

ధరల వివరాలు
ధరల వివరాలు (www.irctctourism.com)

NOTE:

లింక్ పై క్లిక్ చేసి ప్యాకేజీ పూర్తి వివరాలు తెలుసుకోవటంతో పాటు బుకింగ్ చేసుకోవచ్చు.