IRCTC Sapta Jyotirlinga Yatra : విజయవాడ నుంచి 7 జ్యోతిర్లింగ క్షేత్రాల దర్శన యాత్ర, ఐఆర్సీటీసీ టూర్ ప్యాకేజీ వివరాలివే
IRCTC Sapta Jyotirlinga Yatra : దేశంలోని 7 ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రాల దర్శనానికి ఐఆర్సీటీ టూరిస్ట్ ప్యాకేజీ అందిస్తోంది. విజయవాడ నుంచి భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు యాత్ర ఆగస్టు 17న ప్రారంభం కానుంది. 12 రోజుల్లో ఔరంగాబాద్, ద్వారకా, నాసిక్, పూణే, సోమనాథ్, ఉజ్జయిని వంటి ప్రముఖ ఆలయాలను దర్శించుకోవచ్చు.
విజయవాడ నుంచి 7 జ్యోతిర్లింగ క్షేత్రాల దర్శన యాత్ర, ఐఆర్సీటీసీ టూర్ ప్యాకేజీ వివరాలివే
IRCTC Sapta Jyotirlinga Yatra : ఉజ్జయిని (మహాకాళేశ్వర్ & ఓంకారేశ్వర్), ద్వారకా (నాగేశ్వర్), సోమనాథ్ (సోమనాథ్) సందర్శనను కవర్ చేస్తూ 2AC, 3AC, SL తరగతుల్లో భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలులో "సప్త జ్యోతిర్లింగ దర్శన యాత్ర" టూర్ ప్యాకేజీని ఐఆర్సీటీసీ అందిస్తోంది. ఈ ట్రైన్ ఆగస్టు 17 విజయవాడ నుంచి బయలుదేరనుంది. తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల మీదుగా ఈ రైలు ప్రయాణించి... పూణే (భీమశంకర్), నాసిక్ (త్రయంబకేశ్వర్), ఔరంగాబాద్ (గ్రీష్ణేశ్వర్) ఆలయాలను కవర్ చేస్తుంది. మొత్తం 12 రోజుల పర్యటనలో ఏడు ముఖ్యమైన తీర్థయాత్రలను పూర్తి చేయవచ్చు.
పర్యటన ముఖ్యాంశాలు :
- ఉజ్జయిని (మహాకాళేశ్వర్ & ఓంకారేశ్వర్), ద్వారకా (నాగేశ్వర్), సోమనాథ్ (సోమనాథ్), పూణే (భీక్మశంకర్), నాసిక్(త్రయంబకేశ్వర్), ఔరంగాబాద్ (గ్రీష్ణేశ్వర్).
- సంఖ్య సీట్లు : 716 (SL: 460, 3AC: 206, 2AC: 50)
- బోర్డింగ్ / డీ-బోర్డింగ్ స్టేషన్లు : విజయవాడ, మధిర, ఖమ్మం, డోర్నకల్ జంక్షన్, మహబూబాబాద్, వరంగల్, కాజీపేట్, జనగాం, భువనగిరి, సికింద్రాబాద్, కామారెడ్డి, నిజామాబాద్ , ధర్మాబాద్, ముద్ఖేడ్, నాందేడ్, పూర్ణ.
టూర్ ధర
క్లాస్- డబుల్/ట్రిపుల్ షేర్ - పిల్లలు(5-11 సంవత్సరాలు)
- ఎకానమీ- రూ.20590 - రూ.19255
- స్టాండర్ట్ - రూ.33015 - రూ.31440
- కంఫర్ట్ - రూ.43355 - రూ.41465/-
గమ్యం మరియు కవర్ చేయబడిన స్థలాలు:
- 1వ రోజు - 17.08.2024 - విజయవాడ, మధిర, ఖమ్మం, డోర్నకల్ జంక్షన్ లలో ప్రయాణికుల బోర్డింగ్
- 2వ రోజు - 18.08.2024 - మహబూబాబాద్, వరంగల్, కాజీపేట, జనగాం, భువనగిరి, సికింద్రాబాద్, కామారెడ్డి, నిజామాబాద్, ధర్మాబాద్, ముద్ఖేడ్, నాందేడ్, పూర్ణ స్టేషన్లలో - ప్రయాణికుల బోర్డింగ్
- 3వ రోజు - 19.08.2024 - ట్రైన్ ఉజ్జయిని చేరుకుంటుంది. ఉజ్జయిని రైల్వే స్టేషన్ నుంచి హోటల్ లు తీసుకెళ్తారు. అనంతరం మహాకాళేశ్వర జ్యోతిర్లింగ ఆలయాన్ని సందర్శిస్తారు. రాత్రికి ఉజ్జయినిలో బస చేస్తారు.
- 4వ రోజు - 20.08.2024 - బ్రేక్ ఫాస్ట్ తర్వాత హోటల్ నుంచి చెక్ అవుట్ చేసి రోడ్డు మార్గంలో ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగ ఆలయానికి వెళ్తారు. అనంతరం ద్వారకాకు వెళ్లేందుకు.. తిరిగి ఉజ్జయిని రైల్వే స్టేషన్‌కు చేరుకుంటారు యాత్రికులు.
- 5వ రోజు - 21.08.2024 - ద్వారకా స్టేషన్ కు చేరుకుంటారు. స్టేషన్ నుంచి హోటల్ తీసుకెళ్తారు. రాత్రికి ద్వారకాలోనే బస చేస్తారు.
- 6వ రోజు - 22.08.2024 - అల్పాహారం తర్వాత ద్వారకాధీష్ ఆలయాన్ని సందర్శించుకుంటారు. అనంతరం హోటల్ నుంచి చెక్ అవుట్ చేసి, ద్వారకా నాగేశ్వర్ జ్యోతిర్లింగ దేవాలయ దర్శనానికి బయలుదేరతారు. దర్శనం అనంతరం సోమనాథ్‌కు వెళ్లేందుకు ఓఖా రైల్వే స్టేషన్‌కు యాత్రికులను తీసుకువస్తారు.
- 7వ రోజు - 23.08.2024 - సోమనాథ్ రైల్వే స్టేషన్ చేరుకున్నాక...హోటల్ కు తీసుకెళ్తారు. హోటల్ లో ఫ్రెష్ అయ్యి... సోమనాథ్ జ్యోతిర్లింగ ఆలయ దర్శనానికి వెళ్తారు. ఆ తర్వాత నాసిక్‌కి వెళ్లడానికి రైలు ప్రయాణం కోసం సోమనాథ్ రైల్వే స్టేషన్‌కు టూరిస్ట్ లను డ్రాప్ చేస్తారు.
- 8వ రోజు - 24.08.2024 - నాసిక్ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నాక..టూరిస్టులను నాసిక్‌లో రాత్రి బస చేయడానికి హోటల్ కు తీసుకెళ్తారు.
- 9వ రోజు- 25.08.2024 - బ్రేక్ ఫాస్ట్ తర్వాత హోటల్ నుంచి చెక్అవుట్ చేసి నాసిక్ త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగ ఆలయాన్ని దర్శించుకుంటారు. తర్వాత పూణేకు వెళ్లడానికి నాసిక్ రోడ్ రైల్వే స్టేషన్‌కు చేరుకుంటారు.
- 10వ రోజు-26.08.2024 - ఖర్ది రైల్వే స్టేషన్‌కు చేరుకున్నాక... హోటల్ కు తీసుకెళ్తారు. అనంతరం భీమశంకర్ జ్యోతిర్లింగ ఆలయాన్ని సందర్శించడానికి వెళ్తారు. తర్వాత ఔరంగాబాద్‌కు వెళ్లేందుకు పూణే రైల్వే స్టేషన్‌లో యాత్రికులను డ్రాప్ చేస్తారు.
- 11వ రోజు- 27.08.2024 - -ఔరంగాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకుంటారు. ఆ తర్వాత హోటల్ లో చెక్ ఇన్ చేస్తారు. అనంతరం గ్రిష్ణేశ్వర్ జ్యోతిర్లింగ ఆలయ సందర్శనకు వెళ్తారు. దర్శనం తరువాత సికింద్రాబాద్‌కు తిరుగు ప్రయాణం కోసం రైలు ఎక్కేందుకు ఔరంగాబాద్ రైల్వే స్టేషన్‌లో యాత్రికులను డ్రాప్ చేస్తారు.
- 12వ రోజు- 28.08.2024 - ప్రయాణికుల డీబోర్డింగ్
తెలుగు రాష్ట్రాల నుంచి సప్త జ్యోతిర్లింగ దర్శనం టూర్ ప్యాకేజీ బుక్కింగ్, పూర్తి వివాలను ఈ కింద లింక్ లో తెలుసుకోవచ్చు.
సంబంధిత కథనం