AP Graduate Election Voter Registration : ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకోలేదా..? దగ్గరపడిన గడువు, ఇలా ప్రాసెస్ చేసుకోండి
AP Graduate MLC Voter Registration : ఉమ్మడి కృష్ణా, గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ నడుస్తోంది. ఓటు నమోదు కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలో ఇక్కడ చూడండి…
ఉమ్మడి కృష్ణా, గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. ఓవైపు పార్టీలు అభ్యర్థులను కూడా ప్రకటిస్తున్నాయి. ఇదిలా ఉంటే అర్హులైన గ్రాడ్యుయేట్లు ఓటర్లుగా పేరు నమోదు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. గతంలో ఉన్నప్పటికీ… కొత్తగా మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు.
కొత్తగా ఓటర్ నమోదుకు నవంబరు 6వ తేదీని తుది గడువుగా పేర్కొన్నారు. ఇప్పటికే దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవచ్చు. అవసరమైన పత్రాలను ఆయా మండలాల్లోని తహసీల్దారు, ఎంపీడీవో కార్యాలయాల్లో అందుబాటులో ఉంచారు.
కొత్తగా దరఖాస్తు చేసుకునే ఓటర్లు ఫారం-18 ద్వారా ఓటర్లుగా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. నవంబర్ 23న ఓటర్ల జాబితా డ్రాఫ్ట్ ను విడుదల చేస్తారు. డిసెంబర్ 9 వరకు అభ్యంతరాలను స్వీకరించనున్నారు. డిసెంబర్ 30న తుది జాబితాను వెల్లడించనున్నారు.
ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే ఏదైనా డిగ్రీ పూర్తి చేయాలి. ఎన్నికలు జరిగే జిల్లాల పరిధిలోని నివసించే గ్రాడ్యుయేట్లు తమ ఓటును నమోదు చేసుకోవచ్చు. గ్రాడ్యుయేషన్ ఎక్కడ పూర్తి చేసినా...ఆధార్‌లోని అడ్రస్ ఆధారంగా తమ ఓటును నమోదు చేసుకోవచ్చు. అధికారులు వెరిఫికేషన్ కోసం వచ్చినప్పుడు దరఖాస్తుదారుడు ఒరిజినల్ సర్టిఫికెట్‌లు చూపించాలి. ఓటు హక్కు నమోదు చేసుకునే అభ్యర్థులు గ్రాడ్యుయేషన్ ప్రొవిజనల్ సర్టిఫికెట్, ఆధార్, ఓటర్ ఐడీ, పాస్‌పోర్టు ఫొటోను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మరోవైపు తూర్పు -పశ్చిమగోదావరి జిల్లాల పట్టభద్రుల ఓటర్ల నమోదుకు కూడా దరఖాస్తులను స్వీకరిస్తున్నారు.
గ్రాడ్యూయేట్ ఓటు కోసం దరఖాస్తు చేసుకునేవారికి… తప్పనిసరిగా డిగ్రీ ప్రొవిజినల్ లేదా ఒరిజినల్ డిగ్రీ సర్టిఫికేట్ ఉండాలి. ఆధార్డ్, ఓటర్ ఐడీ, పాస్‌పోర్ట్ సైజు ఫోటో, సంబంధిత ధ్రువపత్రాలపో గెజిటెడ్ అధికారి సంతకం కూడా ఉండాలి. https://ceoandhra.nic.in/ceoap_new/ceo/index.html వెబ్ సైట్ లోకి వెళ్లి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.
ఎలా దరఖాస్తు చేసుకోవాలి…?
- గ్రాడ్యూయేట్ ఓటు కోసం నమోదు చేసుకోవాలనుకునే అభ్యర్థులు https://ceoandhra.nic.in/ceoap_new/ceo/index.html వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- హోం పేజీలో కనిపించే MLC -e Registraion ఆప్షన్ పై నొక్కాలి. ఇక్కడ కనిపింటే గ్రాడ్యూయేట్ - 18 ఆప్షన్ పై నొక్కాలి.
- మీ ప్రాథమిక వివరాలతో Sign-Up కావాలి. ఒక్కసారి రిజిస్ట్రేషన్ అయితే సరిపోతుంది.
- ఆ తర్వాత అప్లికేషన్ - 18పై క్లిక్ చేయాలి. మీరు ఏ గ్రాడ్యూయేట్ నియోజకవర్గం కిందికి వస్తారో అక్కడ క్లిక్ చేయాలి.
- మీ పూర్తి వివరాలను ఎంట్రీ చేయాలి. విద్యార్హత పత్రాలను అప్ లోడ్ చేయాలి.
- ఫొటో, సంతకం కూడా అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది.
- చివరగా సబ్మిట్ పై నొక్కితే అప్లికేషన్ పూర్తి అవుతుంది. మీ రిజిస్ట్రేషన్ నెంబర్ జనరేట్ అవుతుంది.
- ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ తో మీ అప్లికేషన్ ట్రాక్ చెక్ చేసుకోవచ్చు.