AP TET Exams: వారికి ఫీజు రిఫండ్‌…. ప్రశాంతంగా టెట్ పరీక్ష… తొలి రోజు 87శాతం హాజరు-fee refund for bed students peaceful tet exam 87 attendance on the first day ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Tet Exams: వారికి ఫీజు రిఫండ్‌…. ప్రశాంతంగా టెట్ పరీక్ష… తొలి రోజు 87శాతం హాజరు

AP TET Exams: వారికి ఫీజు రిఫండ్‌…. ప్రశాంతంగా టెట్ పరీక్ష… తొలి రోజు 87శాతం హాజరు

Sarath chandra.B HT Telugu
Feb 28, 2024 07:14 AM IST

AP TET Exams: కోర్టు ఉత్తర్వులతో టెట్ పరీక్ష రాయలేకపోయిన బిఇడి అభ్యర్థులకు పరీక్ష ఫీజులు వాపసు Fee Refund చేస్తామని ఏపీ విద్యాశాఖ ప్రకటించింది. అర్హులైన వారికి బఫర్ హాల్ టిక్కెట్ల జారీ చేయనున్నారు.

ఏపీ టెట్ పరీక్షలు
ఏపీ టెట్ పరీక్షలు (Pixabay )

AP TET Exams: టెట్‌ పరీక్షల్లో భాగంగా సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న బిఇడి అభ్యర్థులకు ఫీజు వాపసు చేస్తామని ఏపీ పాఠశాల విద్యా శాఖ ప్రకటించింది. ఏపీతో పాటు నాలుగు రాష్ట్రాల్లో నిర్వహించిన టెట్‌ పరీక్షలు తొలిరోజు ప్రశాంతంగా ముగిశాయి. పరీక్షా కేంద్రాలను పరిశీలించిన పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్, పాఠశాల విద్యాశాఖ కమీషనర్ Commissioner ఎస్.సురేష్ కుమార్ తనిఖీ చేశారు.

తొలిరోజు టెట్ పరీక్షకు ఉదయం 86.37 శాతం మంది, మధ్యాహ్నం 87.54 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు.

ఏపీ ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ నిర్వహిస్తున్న Teacher Eligibility Test ఉపాధ్యాయ అర్హత పరీక్ష - 2024 మంగళవారం నుంచి ప్రారంభమయ్యాయి. అన్ని పరీక్షా కేంద్రాల్లో ప్రశాంత వాతావరణంలో పరీక్షలు జరిగినట్టు కమిషనర్‌ తెలిపారు.

మొదటిరోజు పేపర్ 1 (ఎ) పరీక్షకు ఉదయం సెషన్ లో 17,136 మందికి 14,801 (86.37 శాతం) మంది, మధ్యాహ్నం సెషన్ లో 17,253 మందికి 15,104 (87.54 శాతం) మంది హాజరయ్యారు.

పరీక్షా కేంద్రంలో అభ్యర్థులకు బయో మెట్రిక్ హాజరు తప్పనిసరి చేయడంతో తొలి రోజు రాష్ట్రవ్యాప్తంగా 40 మంది అభ్యర్థులకు మాత్రమే ముఖ ఆధారిత హాజరు (ఫెషియల్ అటెండెన్స్) తీసుకోవడంలో సాంకేతిక సమస్యలు ఎదురైనట్లు గుర్తించారు. ఏ అభ్యర్ధికి నష్టం కలగకుండా వెంటనే సాంకేతిక సమస్యలను పరిష్కరించి ఆ అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యేలా చర్యలు చేపట్టినట్టు వివరించారు.

వివరాలు తప్పయితే సవరించుకోవచ్చు…

టెట్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల పేరు, వివరాలు హాల్ టికెట్ లో పూర్తిగా తప్పుగా ఉన్నట్లయితే వారికి పరీక్ష రాయడానికి అనుమతి ఇవ్వడం లేదు. అభ్యర్థికి సంబంధించి ఒరిజినల్ సర్టిఫికెట్లను జిల్లా విద్యాధికారి క్షుణ్ణంగా పరిశీలించి సదరు అభ్యర్థన సరైనదని భావిస్తే, పూర్తి సవరణల వివరాలను రాష్ట్ర స్థాయిలోని కమాండ్ కంట్రోల్ రూం వారికి తెలియచేయాల్సి ఉంటుంది. అలాంటి అభ్యర్థులకు తర్వాతి సెషన్లో పరీక్ష రాసేలా బఫర్ హాల్ టికెట్ ఇవ్వనున్నట్లు కమీషనర్ ఎస్.సురేష్ కుమార్ తెలిపారు.

ఆ అభ్యర్థుల ఫీజు తిరిగిచ్చేస్తాం

కోర్టు ఉత్తర్వులతో బీఈడీ అభ్యర్థులకు పేపర్ 1ఏ రాయడానికి అనుమతి లేకపోవడంతో, కోర్టు ఉత్తర్వులు రాకముందే ఎస్జీటీ పరీక్షల కోసం అభ్యర్థులు చెల్లించిన ఫీజులను అభ్యర్థి ఖాతాలకు జమ చేస్తామని విద్యాశాఖ అధికారులు ప్రకటించారు.

డీఈడీ, బీఈడీ రెండు అర్హతలు కలిగిన అభ్యర్థులకు పేపర్ 1 (ఎ) రాయడానికి వీలుగా బఫర్ హాల్ టికెట్లు అందజేయనున్నారు. అభ్యర్థులకు పరీక్షల్లోఏవైనా సమస్యలు ఎదురైతే పరీక్షా తేదీకి ఒకట్రెండు రోజులు ముందుగా జిల్లా విద్యాధికారిని సంప్రదించాలని కోరారు.

తొలి రోజు విజయవాడలోని ఏపీ టెట్ పరీక్షా కేంద్రాలైన గవర్నర్ పేటలోని ఎస్.వి.టి ఇన్ఫోటెక్ పరీక్షా కేంద్రాన్ని పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ శ్రీ విజయదుర్గా ఐటీ సొల్యూషన్స్( రామవరప్పాడు), ఐఆన్ డిజిటల్ జోన్ (కానూరు) పరీక్షా కేంద్రాలను పాఠశాల విద్యాశాఖ కమీషనర్ ఎస్.సురేష్ కుమార్ , సందర్శించారు. అభ్యర్థుల పరీక్షల రాసే తీరును, పరీక్షా కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన సౌకర్యాలను పరిశీలించారు.

Whats_app_banner