Eluru Accident : పందెం కోడికి ఈత నేర్పేందుకు కాల్వలో దిగి ముగ్గురు గల్లంతు-eluru three in family drowned in polavaram canal trains cockfight cock ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Eluru Accident : పందెం కోడికి ఈత నేర్పేందుకు కాల్వలో దిగి ముగ్గురు గల్లంతు

Eluru Accident : పందెం కోడికి ఈత నేర్పేందుకు కాల్వలో దిగి ముగ్గురు గల్లంతు

Bandaru Satyaprasad HT Telugu
Oct 09, 2024 03:10 PM IST

Eluru Accident : ఏలూరు జిల్లాలో విషాదం నెలకొంది. పోలవరం కుడికాల్వలో పందెం కోడికి ఈత నేర్పేందుకు వెళ్లిన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు గల్లంతయ్యారు. తండ్రి, ఓ కుమారుడి మృతదేహాలు లభ్యం అయ్యాయి. మరో కుమారుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

పందెం కోడికి ఈత నేర్పేందుకు కాల్వలో దిగి ముగ్గురు గల్లంతు
పందెం కోడికి ఈత నేర్పేందుకు కాల్వలో దిగి ముగ్గురు గల్లంతు

ఏలూరు జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. పెదవేగి మండలం కవ్వగుంట సమీపంలోని పోలవరం కుడికాల్వలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు గల్లంతయ్యారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని గల్లంతైన వారి కోసం గాలింపు చేపట్టారు.

కవ్వగుంట గ్రామానికి చెందిన వెంకటేశ్వరరావు(50) తన ఇద్దరు కుమారులు మణికంఠ(16), సాయి కుమార్ (13)తో కలిసి పోలవరం కుడికాల్వ వద్దకు వెళ్లారు. పందెం కోడిని ఈత కొట్టిస్తుండగా ముగ్గురు కాల్వలో గల్లంతయ్యారు. తండ్రి, ఓ కుమారుడి మృతదేహం లభ్యం కాగా, మరో కుమారుడి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తు్న్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తు్న్నారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందడంతో గ్రామంలో విషాదం అలుముకుంది.

తుంగభద్ర నదిలో భక్తుడు గల్లంతు

కర్నూలు జిల్లా మంత్రాలయం రాఘవేంద్రస్వామిని దర్శించుకునేందుకు వచ్చిన ఓ భక్తుడు తుంగభద్ర నదిలో స్నానానికి దిగి గల్లంతయ్యాడు. కర్ణాటక చిక్‌బల్లాపుర్‌ జిల్లా ద్వారగానహల్లి గ్రామానికి చెందిన సుబ్బరాయప్ప(34) తన ఊరివాళ్లతో కలిసి రాఘవేంద్రస్వామిని దర్శించుకునేందుకు మంగళవారం మంత్రాలయానికి వచ్చారు. నిన్న మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో సుబ్బరాయప్ప తుంగభద్ర నదిలో స్నానం చేసేందుకు దిగి నీటిలో గల్లంతయ్యాడు. అతని వెంట వచ్చిన వ్యక్తులు పెద్దగా అరుపులు, కేకలు వేశారు. అయితే నదీతీరంలో ఉన్న గజ ఈతగాళ్లు వచ్చేసరికి సుబ్బరాయప్ప కనిపించకుండాపోయారు.

మంగళవారం సాయంత్రం 6.30 గంటల వరకు పోలీసులు, గజ ఈతగాళ్లు నదిలో గాలింపు చర్యలు చేపట్టినా అతడి ఆచూకీ దొరకలేదు. చీకటి పడటంతో గాలింపు నిలిపివేసి బుధవారం ఉదయం మళ్లీ తిరిగి గాలింపు చర్యలు చేపట్టారు. మృతుడి భార్య ఏడేళ్ల క్రితమే మృతి చెందినట్లు తెలుస్తోంది. ఆయన ఒక కూతురు ఉంది. ప్రమాద విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేశామని పోలీసులు తెలిపారు.

 

Whats_app_banner

సంబంధిత కథనం