Attack on Mother: పెన్షన్ డబ్బుల కోసం తల్లిపై పెద్ద కొడుకు దాడి, మనస్తాపంతో చిన్న కొడుకు ఆత్మహత్య
Attack on Mother: పెన్షన్ డబ్బుల కోసం తల్లిపై పెద్ద కొడుకు కత్తితో దాడి చేయడంతో మనస్తాపానికి గురైన చిన్న కొడుకు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
Attack on Mother: అనంతపురం జిల్లాలో పెన్షన్ డబ్బులు కోసం సొంత తల్లిపైనే కొడుకు కత్తితో దాడి చేశాడు. ఆమె గొంతు, వీపుపై దాడి చేసి ఆమె వద్దను న్న పెన్షన్ డబ్బులు లాక్కొని పారిపోయాడు. సొంత అన్నే తల్లిపై దాడి చేయడం పట్ల తీవ్రమస్తాపనకు గురైన తమ్ముడు ఆత్మహత్యకు పాల్పడ్డారు.
ఈ ఘటన అనంతపురం జిల్లా శెట్టూరు మండలం ముచ్చర్లపల్లి గ్రామంలో బుధవారం అర్థరాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన లక్ష్మీదేవి భర్త ఆంజనేయులు రెండేళ్ల క్రితమే మృతి చెందారు. వీరికి శివరాజ్, రాజయ్య ఇద్దరు కుమారులు ఉన్నారు.
భర్త చనిపోవడంతో వీరు తల్లితో కలిసి ఉంటున్నారు. అయితే ఇద్దరు అన్నదమ్ములు మద్యానికి బానిస అయ్యారు. దీంతో వీరిద్దర మధ్య నిత్యం గొడవులు జరిగేవి. డబ్బులు కోసం తల్లిని వేధించేవారు.
జూలై నెలలో ప్రభుత్వం తల్లికి పెన్షన్ ఏడు వేలు ఇచ్చింది. ప్రభుత్వం మూడు వేల నుంచి నాలుగు వేలకు పెన్షన్ పెంచింది. దీంతో నాలుగు వేలు పెన్షన్, గత మూడు నెలల బకాయిలు నెలకు రూ.వెయ్యి చొప్పున మూడు వేలు కలిపి మొత్తం ఏడు వేలు పెన్షన్ ఇచ్చింది. దీంతో ఈ పెన్షన్ డబ్బులను చూసిన పెద్ద కుమారుడు శివరాజ్, తల్లి దగ్గర నుంచి ఎలాగైనా పెన్షన్ డబ్బులు తీసుకోవాలనుకున్నాడు. తల్లిని పెన్షన్ డబ్బులు ఇవ్వాలని శివరాజ్ అడిగాడు. ఆమె ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో ఆమెపై దాడికి నిర్ణయించుకున్నాడు.
బుధవారం అర్థరాత్రి శివరాజ్ ఫుల్‌గా తాగి ఇంటికి వచ్చాడు. తల్లి దగ్గర నుంచి పెన్షన్ డబ్బులు లాక్కోవడానికి ప్రయత్నించాడు. అయితే తల్లి అందుకు నిరాకరించింది. దాంతో తల్లి, కొడుకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో మద్యం మత్తులో తల్లిపై దాడికి యత్నించాడు. తన వద్ద నున్న కత్తిని తీసుకొని తల్లిపై దాడి చేశాడు. కత్తితో తల్లి గొంతు, వీపు, మెడపైన దాడి చేశారు. ఆమె వద్దను పెన్షన్ డబ్బులు రూ.2 లాక్కొని పారిపోయాడు.
తల్లి రక్తంతో పడి ఉండటాన్ని కూడా గమనించకుండా అక్కడ నుంచి శివరాజ్ వెళ్లిపోయాడు. అయితే ఇంటికి ఇరుగు పొరుగు ఉన్న వారు వచ్చి తీవ్రంగా గాయపడిన బాధితురాలు లక్ష్మీదేవిని కళ్యాణదుర్గంలోని హాస్పటిల్‌కి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం అనంతపురం హాస్పటిల్‌కి తరలించారు. లక్ష్మీదేవి ఫిర్యాదుతో ఎస్ఐ రామ్‌భూపాల్ కేసు నమోదు చేసి, విచారణ జరుపుతున్నారు.
ఇదిలా ఉండగా కన్న తల్లి లక్ష్మీదేవిపై సొంత అన్న దాడి చేయడంతో మనస్తాపానికి గురైన రెండో కుమారుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బుధవారం అర్థరాత్రి తల్లిపై అన్న దాడి చేయగా, గురువారం ఉదయం తమ్ముడు ఆత్మహత్య చేసుకున్నాడు. పొలంలోకి వెళ్లి చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
రాజయ్యకు కుందుర్పి మండలం కలిగులిమి గ్రామానికి చెందిన శిల్పతో 11 ఏళ్ల కింద వివాహం అయింది. ఆయనకు ఇద్దరు కుమారులతో కలిగులిమిలో నివాసం ఉంటున్నాడు.రాజయ్య భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసుల నమోదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
(జగదీశ్వరరావు జరజాపు)