AP Dasara Holidays 2024 : విద్యార్థులకు గుడ్‌న్యూస్ - దసరా సెలవులపై కీలక నిర్ణయం, ఈసారి ఏకంగా 12 రోజులు సెలవులు!-dussehra holidays in ap from october 3 to 13th 2024 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Dasara Holidays 2024 : విద్యార్థులకు గుడ్‌న్యూస్ - దసరా సెలవులపై కీలక నిర్ణయం, ఈసారి ఏకంగా 12 రోజులు సెలవులు!

AP Dasara Holidays 2024 : విద్యార్థులకు గుడ్‌న్యూస్ - దసరా సెలవులపై కీలక నిర్ణయం, ఈసారి ఏకంగా 12 రోజులు సెలవులు!

Maheshwaram Mahendra Chary HT Telugu
Sep 27, 2024 11:39 PM IST

ఏపీలో దసరా సెలవులు అక్టోబర్ 3 నుంచే ప్రారంభం కానున్నాయి. ఉపాధ్యాయులు, పలు సంఘాల విజ్ఞప్తితో ఒక రోజు ముందుగానే సెలవులు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ కీలక ప్రకటన చేశారు. అక్టోబర్ 3 నుంచి 13వ తేదీ వరకు సెలవులు ఉంటాయని చెప్పారు.

ఏపీలో దసరా సెలవులపై కీలక నిర్ణయం
ఏపీలో దసరా సెలవులపై కీలక నిర్ణయం

ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. అకడమిక్ క్యాలెండర్ పేర్కొన్న షెడ్యూల్ లో పేర్కొన్న తేదీ కంటే ముందే దసరా సెలవులను ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ కీలక ప్రకటన చేశారు. అక్టోబర్ 3వ తేదీ నుంచే దసరా సెలవులు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. అక్టోబర్ 13వ తేదీతో సెలవులు ముగియనున్నాయి. అక్టోబర్ 14వ తేదీన తిరిగి విద్యా సంస్థలు పునఃప్రారంభం కానున్నాయి.

పాఠశాల విద్య బలోపేతానికి చేపట్టాల్సిన చర్యలపై అధికారులతో ఉండవల్లి నివాసంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ శుక్రవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించాను. ప్రభుత్వ స్కూళ్లలో అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. ప్రభుత్వ స్కూళ్ల బలోపేతం, మెరుగైన ఫలితాల కోసం నవంబర్ 14న రాష్ట్రవ్యాప్తంగా మెగా పేరెంట్ –టీచర్స్ సమావేశాలు నిర్వహించి ఫీడ్ బ్యాక్ తీసుకోవాలని నిర్ణయించారు.

ఇందులో ముఖ్యమంత్రి నుంచి వార్డు మెంబర్ వరకు అందరం భాగస్వాములవుతారని లోకేశ్ తెలిపారు. రాష్ట్రంలో గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు గ్రంథాలయాల బలోపేతంపై చర్చించామని వెల్లడించారు. త్వరలో అమరావతిలో అత్యాధునిక సదుపాయాలతో వరల్డ్ క్లాస్ సెంట్రల్ లైబ్రరీ ఏర్పాటు చెయ్యాలని నిర్ణయించామని పేర్కొన్నారు.

పాఠశాల విద్య రోడ్ మ్యాప్, 117 జీవో, ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులు, టెట్, మెగా డీఎస్సీ నిర్వహణపై సమావేశంలో చర్చించినట్లు లోకేశ్ వివరించారు. ఉపాధ్యాయులు, సంఘాల కోరిక మేరకు దసరా సెలవులు అక్టోబర్ 3 నుండే ఇవ్వాలని తీర్మానించామని ప్రకటించారు. 

12 రోజులపాటు సెలవులు…!

విద్యాశాఖ ప్రకటించిన అకడమిక్ క్యాలెండర్ ప్రకారం అక్టోబర్ 4వ తేదీ నుంచి సెలవులు ప్రారంభం కావాల్సి ఉది. అక్టోబర్ 13వ తేదీతో ముగుస్తాయి. ఇక అక్టోబర్ 2వ తేదీన గాంధీ జయంతి ఉంది. ఈ రోజు కూడా సెలవు ఉంటుంది. కానీ దసరా సెలవులను 4 నుంచి కాకుండా 3వ తేదీ నుంచే ఇవ్వాలని నిర్ణయించటంతో విద్యార్థులకు వరుసగా సెలవులు రానున్నాయి. తాజా నిర్ణయంతో అక్టోబర్ 2 నుంచే విద్యా సంస్థలకు సెలవులు మొదలవుతాయి. అక్టోబర్ 13వ తేదీ వరకు అంటే… మొత్తం 12 రోజులు సెలవులు వస్తాయి. తిరిగి అక్టోబర్ 14వ తేదీన అంటే సోమవారం స్కూళ్లు, కాలేజీలు పునఃప్రారంభమవుతాయి. 

ఇక వచ్చే అక్టోబ‌ర్ నెల‌లోనే దీపావళి పండగ కూడా రాబోతుంది. అక్టోబర్ 31వ తేదీన దీపావళి ఉండటంతో ఆ రోజు రాష్ట్రంలోని అన్ని స్కూల్స్‌, కాలేజీల‌కు సెల‌వు ఉండనుంది. ఇక మైనారిటీ విద్యా సంస్థలకు క్రిస్మస్ సెలవులు డిసెంబరు 22 నుంచి 29 వరకు ఇవ్వనున్నారు. సంకాంత్రి సెలవులు చూస్తే… 2025 జనవరి 10 నుంచి 19 వరకు ఉంటాయి. మైనారిటీ విద్యా సంస్థలకు మాత్రం జనవరి 11 నుంచి 15 వరకు సెలవులు ఇవ్వనున్నారు.