AP School Holidays : ఏపీలో భారీ వర్షాలు - ఈ జిల్లాల్లోని స్కూళ్లకు సెలవు-due to heavy rains holi day has been declared for schools in many districts of ap ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap School Holidays : ఏపీలో భారీ వర్షాలు - ఈ జిల్లాల్లోని స్కూళ్లకు సెలవు

AP School Holidays : ఏపీలో భారీ వర్షాలు - ఈ జిల్లాల్లోని స్కూళ్లకు సెలవు

Maheshwaram Mahendra Chary HT Telugu
Jul 20, 2024 07:47 AM IST

Heavy Rains in AP : భారీ వర్షాల నేపథ్యంలో ఏపీలోని పలు జిల్లాల్లో పాఠశాలలకు ఇవాళ సెలవు ప్రకటించారు. ఈ మేరకు ఆదేశాలు జారీ అయ్యాయి.

ఏపీలో భారీ వర్షాలు - పలు జిల్లాల్లో స్కూళ్లకు సెలవు
ఏపీలో భారీ వర్షాలు - పలు జిల్లాల్లో స్కూళ్లకు సెలవు

Heavy Rains in AP :  ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో పలు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.ఈ నేపథ్యంలో పలు జిల్లాల కలెక్టర్ల కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇవాళ పాఠశాలలకు సెలవు ప్రకటించారు. 

భారీ వర్షాల నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లాతో పాటు  విశాఖపట్నం, తూర్పుగోదావరి, విజయనగరం, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, కాకినాడ, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లోని స్కూళ్లకు  కలెక్టర్లు ఇవాళ(జులై 20) సెలవు ప్రకటించారు. శుక్రవారం ఉత్తరాంధ్రలోని బడులకు సెలవు ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఇక  రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయని.. లోతట్టు ప్రాంతాల్లో వరద ప్రవహిస్తున్న వాగులు,కాలువలు దాటే ప్రయత్నం చేయరాదని అధికారులు హెచ్చరించారు.

వాయుగుండం ప్రభావంతో భారీ వర్షాలు…

ఒడిశా, ఉత్తరాంధ్ర మీదుగా కొనసాగుతున్న అల్పపీడనం.. వాయుగుండంగా మారినట్లు వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడనం వాయుగుండంగా బలపడిందన్న వాతావరణ శాఖ.. వాయవ్య దిశగా పయనించి శనివారం తెల్లవారుజామున పూరీ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేసింది. తీరం దాటిన తర్వాత వాయుగుండం క్రమంగా బలహీన పడుతుందని పేర్కొంది. 

ఈ నేపథ్యంలో ఇవాళ అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.

మరోవైపు వాయుగుండం తీరే దాటే క్రమంలో శనివారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం,నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడా మోస్తారు వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అక్కడక్కడా పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. 

కాకినాడ, కోనసీమ అంబేద్కర్ జిల్లా, ఉభయ గోదావరి జిల్లాలు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలలో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. వీటితో పాటు బాపట్ల, పల్నాడు, గుంటూరు, నెల్లూరు, అనంతపురం, శ్రీసత్యసాయి, కర్నూలు, వైఎస్ఆర్ జిల్లా, చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాలలో పిడుగులతో కూడిన వానలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. 

ఏపీలో భారీ వర్షాలు నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగా అత్యవసర చర్యల కోసం మూడు ఎస్టీఆర్‌ఎఫ్, 2 ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలను సిద్ధం చేసినట్లు రోణంకి కూర్మనాథ్ తెలిపారు.వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయొద్దని ప్రజలకు సూచించారు. అలాగే లోతట్టు ప్రాంతాల ప్రజలు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. 

భారీ వర్షాల నేపథ్యంలో విశాఖపట్నం, కళింగపట్నం, గంగవరం, కాకినాడ, భీమిలి పోర్టుల్లో మూడో నంబర్ ప్రమాద హెచ్చరికలు జారీచేశారు. అలాగే మచిలీపట్నం, నిజాంపట్నం పోర్టుల్లో ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. 

Whats_app_banner