MP Galla Jayadev : వ్యాపార కారణాలు, ప్రభుత్వాల వేధింపులతోనే రాజకీయాలకు బ్రేక్- లోక్ సభలో ఎంపీ గల్లా జయదేవ్ చివరి స్పీచ్-delhi news in telugu tdp mp galla jayadev farewell speech in lok sabha says will not contesting in upcoming elections ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Mp Galla Jayadev : వ్యాపార కారణాలు, ప్రభుత్వాల వేధింపులతోనే రాజకీయాలకు బ్రేక్- లోక్ సభలో ఎంపీ గల్లా జయదేవ్ చివరి స్పీచ్

MP Galla Jayadev : వ్యాపార కారణాలు, ప్రభుత్వాల వేధింపులతోనే రాజకీయాలకు బ్రేక్- లోక్ సభలో ఎంపీ గల్లా జయదేవ్ చివరి స్పీచ్

Bandaru Satyaprasad HT Telugu
Feb 05, 2024 05:51 PM IST

MP Galla Jayadev Farewell Speech : టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ లోక్ సభలో తన చివరి ప్రసంగం చేశారు. రాజకీయాలకు విరామం ఇచ్చినప్పటికీ దేశానికి సేవ చేయాలని సంకల్పం స్థిరంగా ఉందన్నారు.

లోక్ సభలో ఎంపీ గల్లా జయదేవ్ చివరి స్పీచ్
లోక్ సభలో ఎంపీ గల్లా జయదేవ్ చివరి స్పీచ్

MP Galla Jayadev Farewell Speech : వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయడంలేదని ప్రకటించిన టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ (Galla Jayadev)లోక్ సభలో తన చివరి ప్రసంగం చేశారు. వ్యాపార కారణాలు, కేంద్రం, ఏపీ ప్రభుత్వాలు సృష్టించిన ఇబ్బందులతో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయడంలేదని తెలిపారు. ప్రజా జీవితంలో ఉండడంతో పాటు వ్యాపారవేత్తగా కొనసాగడం అంత సులభం కాదన్నారు. రెండు పడవల్లో ప్రయాణించడం మంచిది కాదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. నా రాజకీయ జీవితానికి విరామం ఇవ్వాలని నిర్ణయించుకున్నానని లోక్ సభలో గల్లా జయదేవ్ అన్నారు. రాజకీయాలకు(Politics) బ్రేక్ ఇచ్చినప్పటికీ దేశానికి సేవ చేయాలనే తన నిబద్ధత, సంకల్పం స్థిరంగా ఉందని, పెట్టుబడులు పెట్టడం, ఆవిష్కరణలు చేయడం, ఉపాధి అవకాశాలను సృష్టించడం, దేశానికి ఆదాయం, సంపదను సృష్టించడం ద్వారా దేశ అభివృద్ధికి దోహదపడతానని ఆయన పేర్కొన్నారు. తన కంపెనీలు సుమారు 17,000 మందికి ఉపాధి కల్పించాయి. వారి కుటుంబ సభ్యుల కోసం అనేక సంక్షేమ చర్యలు చేపడుతున్నాయని గల్లా చెప్పారు. వ్యాపార వేత్తలు ఎంతో మంది చట్టసభలకు ఎన్నికవుతున్నారన్నారు. వ్యాపారవేత్తలపై రాజకీయ వేధింపులు సరికాదన్నారు.

yearly horoscope entry point

గుంటూరు నుంచి రెండుసార్లు ఎంపీ

గల్లా జయదేవ్ ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు నుంచి రెండుసార్లు ఎంపీగా గెలిచారు. 2018లో మోదీ(Modi) ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానంపై రెండుసార్లు ఆవేశపూరిత ప్రసంగాల చేసిన తర్వాత గల్లా పేరు మారుమోగింది. ఈ ప్రసంగాల్లో గల్లా కేంద్రంపై తీవ్ర విమర్శలు చేశాడు. అయితే, ఇవాళ తన చివరి ప్రసంగంలో గల్లా ఎన్డీఏ ప్రభుత్వం సాధించిన విజయాలను, ముఖ్యంగా రామమందిర స్థాపనపై మాట్లాడుతూ.. హిందువుల 500 ఏళ్ల కలను సాకారం చేశారని పేర్కొన్నారు. కొన్ని రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు రాబోతున్నాయని, ఈ ఎన్నికలు శాంతియుత వాతావరణంలో జరగాలని కోరారు. ఏపీలో దొంగ ఓట్ల(Fake Votes) వ్యవహారంపై ఎన్నికల సంఘం ఉన్నతాధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలన్నారు.

“మేము ఎన్‌డీఎలో భాగం కానప్పటికీ, గత పదేళ్లుగా ప్రధాని మోదీ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని ప్రశంసించకుండా ఉండలేను. మోదీ భారత్ ను కొత్త శిఖరాలకు తీసుకువెళ్లారు. మనం దాని అంచున ఉన్నాం. ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ భారత్ అవతరించింది"- ఎంపీ గల్లా జయదేవ్

ప్రత్యేక హోదాపై మరోసారి గళం

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విభజనపై టీడీపీ అసంతృప్తిని గల్లా మరోసారి నొక్కిచెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా(Special Status) ఇవ్వాలని లేదా అన్ని సౌకర్యాలు, ఆర్థిక, ఇతరత్రా అంశాలను విస్తరించాలని ప్రధానిని కోరుతున్నానన్నారు. 10 సంవత్సరాల కాలానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరారు. అమరావతిని ఏకైక రాజధాని(Amaravati Capital)గా ఏర్పాటు చేయడం, మిర్చి, పసుపు పంటలకు గిట్టుబాటు ధరలను పెంచడం, గుంటూరు జిల్లాలో కొత్త విద్యాసంస్థల స్థాపన వంటివి గుంటూరు ప్రతినిధిగా తాను సాధించిన విజయాలని గల్లా జయదేవ్ పేర్కొన్నారు. తనకు ఈ అవకాశం కల్పించిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, స్పీకర్, లోక్‌సభ సచివాలయం, పార్లమెంట్‌లోని విలేకరులు, తన నియోజకవర్గ ప్రజలకు గల్లా కృతజ్ఞతలు తెలిపారు.

Whats_app_banner

సంబంధిత కథనం