YSRCP | 2024 ఎన్నికలపై సీఎం జగన్ ఫోకస్.. వారికి టికెట్స్ క్యాన్సిల్!
రాబోయే ఎన్నికలపై ముఖ్యమంత్రి జగన్ ఫోకస్ చేసినట్టుగా కనిపిస్తుంది. ఇప్పటికే.. పార్టీ నేతలకు సంకేతాలిస్తున్నారు. తాజాగా జరిగిన మీటింగ్ లోనూ పలు కీలక అంశాలపై చర్చించారు.
2024 ఎన్నికల్లో ఎలగైనా మళ్లీ వైసీపీని అధికారంలోకి తీసుకురావాలని జగన్ అనకుంటున్నారు. ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ చేయడం మెుదలుపెట్టారు. ఇక పార్టీ నేతలు సైతం ఎన్నికలనే టార్గెట్ చేసేలా దిశానిర్దేశం చేసినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో జనాల్లోకి ఎలా వెళ్లాలి? ప్రభుత్వ పథకాల అమలును జనాల్లోకి తీసుకెళ్లేలా ఫోకస్ చేస్తున్నారు.
తాజాగా పార్టీ నేతలతో సీఎం జగన్ సమావేశమయ్యారు. ఇందులో 2024 ఎన్నికలే లక్ష్యంగా దిశ నిర్దేశం చేసినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఎమ్మెల్యేల పనితీరుపై.. నివేదికలు తెప్పించుకుంటున్నారు జగన్. కొంతమంది ప్రజా ప్రతినిధులపై అసంతృప్తిగా ఉన్నారు. ఇలా అయితే వచ్చే ఎన్నికల్లో కష్టమనే సంకేతాలను చెప్పకనే చెబుతున్నారు. పని తీరు మార్చుకుని ప్రజల్లోకి వెళ్తేనే ఫలితం ఉంటుందని పార్టీ అధిష్ఠానం నుంచి హెచ్చరికలు జారీ అవుతున్నాయి. అలానే ఉంటే.. మరో మార్గం చూసుకోవాల్సి వస్తుందని.. కాస్త నెమ్మదిగా చెప్పినట్టుగా తెలుస్తోంది.
వైసీపీ అధికారంలోకి వచ్చాక.. ఎన్నో పథకాలు అమలు చేస్తున్నామని.. వాటిని జనాల్లోకి తీసుకెళ్లే అంశంపై దృష్టి పెట్టాలని సీఎం సూచించినట్టుగా తెలుస్తోంది. ఇంటింటికీ వైసీపీ నినాదంతో ముందుకు వెళ్లేలా.. ప్రణాళికలు జరుగుతున్నాయి. పథకాల ద్వారా ప్రతీ ఇంటికీ ఎంత మేర ప్రయోజనం కలుగుతుందో తెలుసుకొనేలా ప్రణాళికలు చేయాలని చెబుతున్నారు.
మే 2 నుంచి 'ఇంటింటికీ వైసీపీ' కార్యక్రమం నిర్వహించాలని సీఎం జగన్ చెప్పారు. నేతలంతా సమన్వయంతో కలిసి కట్టుగా ముందుకు వెళ్లాలని సూచించారు. పార్టీ ఆదేశాలు ధిక్కరిస్తే.. వచ్చే ఎన్నికల్లో టికెట్స్ క్యాన్సిల్ అని జగన్ హెచ్చరించారు. మంత్రివర్గ విస్తరణలో చోటు ఆశించి భంగపడిన వారితో ప్రత్యేకంగా మాట్లాడారు. మళ్లీ వచ్చేది తమ ప్రభుత్వమేనని చెప్పారు. బహిరంగ విమర్శలు చేసి.. పార్టీ.. ప్రతిష్టను దెబ్బతీయోద్దని హెచ్చరించారు. త్వరలోనే జిల్లాల్లో పర్యటిస్తానని చెప్పారు.
త్వరలో జరగబోయే పార్టీ ప్లీనరీ సమావేశాలపైనా.. సీఎం జగన్ చర్చించారు. ప్లీనరిలో సందర్భంగా సీట్ల కేటాయింపు, తదితర అంశాలపై మాట్లాడే అవకాశం ఉంది. ఇప్పటికే ఏఏ నియోజకవర్గంలో పార్టీ బలం, ప్రజాప్రతినిధి పని తీరుపై .. వైసీపీ అధ్యక్షుడు.. నివేదికలు తెప్పించుకున్నారు. స్థానిక పరిస్థితులను ఆధారంగా తర్వాత ఇన్ ఛార్జులపై దృష్టి పెట్టే ఛాన్స్ ఉంది. క్షేత్రస్థాయిలో కమిటీలను ఏర్పాటు చేసే అంశంపైనా.. అధిష్టానం ఆలోచిస్తుంది.
రాబోయే ఎన్నికల్లో.. నేతల మధ్య విబేధాలు పక్కన పెట్టాలని సీఎం చెప్పినట్టుగా తెలుస్తోంది. ఉంటే అసలు సహించేది లేదని వార్నింగ్ ఇచ్చారని చెబుతున్నారు. విబేధాలు అలాగే కొనసాగితే పార్టీకి నష్టం తప్పదని.. పార్టీకి నష్టం జరిగితే.. కఠిన చర్యలు తప్పవని హెచ్చరించినట్టు సమాచారం.
సంబంధిత కథనం