Chandrababu Brother : చంద్రబాబు ఇంట్లో తీవ్ర విషాదం.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రామ్మూర్తినాయుడు మృతి-chandrababu naidu brother ramamurthy naidu dies while undergoing treatment in hospital ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Chandrababu Brother : చంద్రబాబు ఇంట్లో తీవ్ర విషాదం.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రామ్మూర్తినాయుడు మృతి

Chandrababu Brother : చంద్రబాబు ఇంట్లో తీవ్ర విషాదం.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రామ్మూర్తినాయుడు మృతి

Basani Shiva Kumar HT Telugu
Nov 16, 2024 12:54 PM IST

Chandrababu Brother : ఏపీ చంద్రబాబు ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన సోదరుడు రామ్మూర్తి నాయుడు హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. దీంతో అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకొని చంద్రబాబు హైదరాబాద్ రానున్నారు. ఇప్పటికే లోకేష్ హైదరాబాద్ చేరుకున్నారు.

సోదరుడితో చంద్రబాబు (పాత చిత్రం)
సోదరుడితో చంద్రబాబు (పాత చిత్రం) (x)

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. చంద్రబాబు సోదరుడు రామ్మూర్తి నాయుడు హైదరాబాద్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతిచెందారు. చంద్రబాబు ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఇవాళ సాయంత్రం మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొనాల్సి ఉంది. మహారాష్ట్ర పర్యటనను కూడా రద్దు చేసుకొని చంద్రబాబు హైదరాబాద్ వస్తున్నారు.

శనివారం ఉదయం రామ్మూర్తినాయుడి ఆరోగ్యం విషమంగా ఉందని లోకేష్‌కు సమాచారం వచ్చింది. దీంతో అసెంబ్లీ నుంచి హుటాహుటిన హైదరాబాద్ బయల్దేరారు నారా లోకేష్‌. ఏఐజీ ఆసుపత్రిలో నారా రామ్మూర్తి నాయుడు కుటుంబ సభ్యులను నందమూరి రామకృష్ణ, దగ్గుబాటి పురందేశ్వరి పరామర్శించారు.

చంద్రబాబు తమ్ముడు, హీరో నారా రోహిత్ తండ్రే నారా రామ్మూర్తినాయుడు. గత కొంత కాలంగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో చేరారు. ఆయనకు వెంటిలేటర్‌పై చికిత్స అందించారు. శనివారం రామ్మూర్తినాయుడు తుదిశ్వాస విడిచారు. దీంతో కుటుంబ సభ్యులు అందరూ ఆసుపత్రికి చేరుకుంటున్నారు.

రామ్మూర్తినాయుడు కుమారుడే హీరో నారా రోహిత్‌. ఆయనకు ఇటీవలే ప్రతినిధి 2 హీరోయిన్‌ శిరీషతో ఎంగేజ్‌మెంట్ జరిగింది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు, ఇరు కుటుంబాల పెద్దలతోపాటు, అత్యంత సన్నిహితులు హాజరయ్యారు. త్వరలో వీరి పెళ్లి జరగాల్సి ఉంది. అయితే.. రామ్మూర్తి నాయుడు మృతితో రోహిత్ వివాహం వాయిదాపడే అవకాశం ఉంది.

Whats_app_banner