Chandrababu: దైవ దర్శనాలతో చంద్రబాబు బిజీ, నేడు సెక్రటేరియెట్‌‌లో బాధ్యతల స్వీకరణ, ఎన్నికల హామీలపై సంతకాలు-chandrababu is busy with temple visits taking charge at the secretariat today signing election promises ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Chandrababu: దైవ దర్శనాలతో చంద్రబాబు బిజీ, నేడు సెక్రటేరియెట్‌‌లో బాధ్యతల స్వీకరణ, ఎన్నికల హామీలపై సంతకాలు

Chandrababu: దైవ దర్శనాలతో చంద్రబాబు బిజీ, నేడు సెక్రటేరియెట్‌‌లో బాధ్యతల స్వీకరణ, ఎన్నికల హామీలపై సంతకాలు

Sarath chandra.B HT Telugu
Jun 13, 2024 08:10 AM IST

Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ‌్యమంత్రిగా ప్రమాణ స్వీకారంచ చేసిన చంద్రబాబు నాయుడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి స్వామి వారి దర్శనం చేసుకున్నారు. సాయంత్రం సెక్రటేరియట్‌లో బాధ్యతలు స్వీకరించి ఎన్నికల హామీలపై తొలి సంతకాలు చేస్తారు.

తిరుమలలో చంద్రబాబుకు స్వాగతం పలుకుతున్న టీటీడీ ఇన్చార్జి ఈవో
తిరుమలలో చంద్రబాబుకు స్వాగతం పలుకుతున్న టీటీడీ ఇన్చార్జి ఈవో

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత స్వామి వారి దర్శనం కోసం బుధవారం రాత్రి తిరుమల చేరుకున్నారు. గురువారం స్వామి దర్శనం తర్వాత తిరుపతి నుంచి బయలుదేరి 11.30 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు.

విమానాశ్రయం నుంచి విజయవాడ దుర్గ గుడికి వెళతారు. దర్శనం అనంతరం ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో అమ్మవారిని దర్శించుకుని ఉండవల్లిలోని నివాసానికి వెళతారు. సాయంత్రం 4.41 గంటలకు సచివాలయంలో ఛాంబర్ లో బాధ్యతలు స్వీకరిస్తారు. ఈ సందర్భంగా 5 ఫైళ్లపై సంతకాలు చేస్తారు.

తిరుమలలో ప్రోటోకాల్ ఉల్లంఘన…

ముఖ్యమంత్రిగా తిరుమలకు వచ్చిన చంద్రబాబుకు టీటీడీ అధికారులు ప్రోటోకాల్ పాటించలేదు. గాయత్రి నిలయం వద్ద చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు అధికారులు రాలేదు. సీఎం వాహనం వద్దకు రాని టీటీడీ ఇన్‌చార్జి ఈవో వీరబ్రహ్మం, విశ్రాంతి భవనం లోపలకు వెళ్లాక పుష్పగుచ్ఛం ఇచ్చేందుకు ప్రయత్నించారు. టీటీడీ ఈవో ఇచ్చిన పుష్పగుచ్ఛాన్ని సీఎం చంద్రబాబు తిరస్కరించారు.

సిఎంగా ఐదేళ్ల తర్వాత…

ఐదేళ్ల తర్వాత ముఖ్యమంత్రిగా చంద్రబాబు మరోసారి వెలగపూడి సచివాలయంలో అడుగుపెడుతున్నారు. సచివాయం మొదటి బ్లాక్‌లోని ఛాంబర్‌లో సీఎంగా బాధ్యతలు స్వీకరించనున్నారు. సాయంత్రం 4.41 గంటలకు సెక్రటేరియట్‌లో సీఎంగా బాధ్యతలు స్వీకరిస్తారు.

బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన కీలక హామీల అమలుపై సంతకాలు చేయనున్నారు. మెగా డీఎస్సీపై తొలి సంతకం చేయనున్నారు. ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దుపై రెండో సంతకం పెట్టనున్నారు. సంక్షేమ పెన్షన్లను రూ.4 వేలకు పెంచుతూ మూడో సంతకం చేయనున్నారు. వీటితో పాటు స్కిల్ సెన్సెస్, అన్నా క్యాంటీన్ల ఏర్పాటుపై సంతకాలు చేయనున్నారు.

సిఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే విధానపరమైన నిర్ణయాలకు శ్రీకారం చుట్టనున్నారు. ఏపీ సచివాలయంలోని మొదటి బ్లాకులో ముఖ్యమంత్రి కార్యాలయం ఉంటుంది.సచివాలయం మొదటి అంతస్తులో సిఎం ఛాంబర్‌ను ఇప్పటికే సిద్ధం చేశారు.

ముఖ‌యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే మెగా డీఎస్సీ సహా మొత్తం ఐదు అంశాలపై తొలి సంతకాలు చేయనున్నారు. ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ కోసం మెగా డీఎస్సీ కోసం తొలి సంతకం చేస్తానని ఎన్నికల ప్రచార సమయంలో ప్రకటించారు. ఆ హామీని నేడు నిలబెట్టుకోనున్నారు. వివాదాస్పద లాండ్‌ టైటిలింగ్‌ చట్టం ఉప సంహరణపై మరో సంతకం చేయనున్నారు. ల్యాండ్ టైట్లింగ్ చట్టం రద్దు హామీ జనసేన హామీగా ఉంది. పెన్షన్ల పెంపు, స్కిల్ సెన్సస్ నిర్వహణ,అన్నా క్యాంటీన్ల ఏర్పాటుపై చంద్రబాబు సంతకాలు చేస్తారు.

మాకు పరదాలు అవసరం లేదన్న లోకేష్…

ము‌ఖ్యమంత్రితో పాటు శ్రీవారి దర్శనం కోసం తిరుమల వచ్చిన నారా లోకేష్‌ జగన్‌పై సెటైర్లు వేశారు. పోలీసులు అలవాటులో భాగంగా తమకు కూడా పరదాలు కడుతున్నారని, వాటిని కట్టొద్దని ఎన్నిసార్లు చెప్పినా వినడం లేదన్నారు. తమకు పరదాలు అవసరం లేదని, ప్రజల్లో ఉంటామన్నారు.

Whats_app_banner