APSSDC Programmes : ఐఎస్‌బీ ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు-apssdc invites applications from students for skilling courses under isb ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Apssdc Programmes : ఐఎస్‌బీ ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు

APSSDC Programmes : ఐఎస్‌బీ ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు

HT Telugu Desk HT Telugu
Aug 31, 2022 08:39 PM IST

Andhra Pradesh State Skill Development Corporation : ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ) ప్రత్యేక శిక్షణ ఇవ్వనుంది. ఈ మేరకు ఆసక్తి గల విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలి.

<p>ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్</p>
ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్

ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఐఎస్బీ స్కిల్ ప్రోగ్రాం నిరవహిస్తోంది. దీనికింద విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు విస్తృత ఉపాధి నైపుణ్యాలను అందించే ప్రక్రియలో భాగంగా ISB ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజినీరింగ్, మేనేజ్‌మెంట్ కళాశాలలు, ఫార్మసీ కళాశాలలతోపాటు వివిధ అటానమస్ కళాశాలల్లో చదువుతున్న వారు, ఆసక్తి గల పూర్వ విద్యార్థులు శిక్షణకు దరఖాస్తు చేసుకోవాలని స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఒక ప్రకటనలో తెలిపింది.

బిజినెస్ లిటరసీ స్కిల్స్, బిహేవియరల్ స్కిల్స్, డిజిటల్ లిటరసీ స్కిల్స్, ఎంటర్‌ప్రెన్యూరియల్ లిటరసీ స్కిల్స్‌లో ఒక్కో కోర్సుకు 40 గంటల శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపింది. ఈ కోర్సులను ISB, దాని అనుబంధ అధ్యాపకులు ఆన్‌లైన్‌లో బోధిస్తారు. విద్యార్థులకు తక్కువ ఖర్చుతో నాణ్యమైన శిక్షణ అందించాలనే ఉద్దేశంతో స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, ఐఎస్‌బీ కలిసి పనిచేస్తున్నాయి.

ఆయా కోర్సులకు సంబంధించిన ఫీజులు, ఇతర వివరాలను skillshub.isb.edu ద్వారా తెలుసుకోవచ్చునని నైపుణ్యాభివృద్ధి-శిక్షణ విభాగం ప్రిన్సిపల్ సెక్రటరీ సరబ్ గౌర్ తెలిపారు. నిపుణుల సహకారంతో కార్పొరేషన్ రూపొందించిన నైపుణ్య శిక్షణా వేదికను యువత సద్వినియోగం చేసుకోవాలని కార్పొరేషన్ ఎండీ సత్యనారాయణ కోరారు.

Whats_app_banner

సంబంధిత కథనం