wife swapping parties: భార్యలను మార్చుకునే పార్టీకి రావాలంటున్న బిజినెస్‌మ్యాన్
wife swapping parties: భార్యలను మార్చుకునే పార్టీలకు రావాలని ఒత్తిడి చేసిన ఓ వ్యాపార వేత్తపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇదొక విచిత్రమైన కేసు. భార్య మార్పిడి పార్టీ (wife swapping parties) లకు రావాలంటూ ఒత్తిడి చేస్తున్నాడని భార్య ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు ఓ బిజినెస్‌మ్యాన్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
ఢిల్లీలో వైఫ్ స్వాపింగ్ పార్టీలకు హాజరు కావాలని తన భర్త తనను బలవంతం చేస్తున్నాడని, అతడి సొంత సోదరుడితో కూడా సెక్స్ చేయాలని బలవంతం చేసే వాడని సదరు వ్యాపార వేత్త భార్య ఆరోపించింది.
కాగా ఈ ఫిర్యాదును పరిశీలించాలని కోర్టు ఉత్తర ప్రదేశ్ పోలీసులను ఆదేశించింది. దీంతో పోలీసులు ఆమె భర్త, భర్త సోదరుడిపై కేసు నమోదు చేశారు.
ముజఫర్ నగర్‌లోని అదనపు చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టుకు బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఈ జంట గురుగ్రామ్‌లో నివసిస్తున్నారు. నిరాకరిస్తే తనను బెదిరిస్తాడని, ఆ వింత పార్టీల్లో ఇతర పురుషులతో సెక్స్ చేయాలని బలవంతం చేస్తాడని ఆరోపించింది.
పోలీసులు అందించిన వివరాల ప్రకారం.. ఈ జంటకు 2021 జూన్‌లో పెళ్లయింది. ఆమె భర్తతో కలిసి గురుగ్రామ్ వెళ్లింది.
‘వైఫ్ స్వాపింగ్ పార్టీలకు వెళ్లడానికి నిరాకరిస్తే నా భర్త నన్ను తీవ్రంగా కొట్టేవాడు. లైంగికంగా వేధించేవాడు. ఏప్రిల్ 24న గురుగ్రామ్‌లోని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు ఇచ్చేందుకు ప్రయత్నం చేశాను. కానీ మార్గమధ్యలో నా భర్త, రౌడీలు నన్ను అడ్డుకున్నారు. ఈవిషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించారు..’ అని ఫిర్యాదులో వాపోయింది.
న్యూ- మండి పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్ఓ సుశీల్ కుమార్ సైనీ మీడియాతో మాట్లాడుతూ బాధితురాలి భర్త, అతడి సోదరుడిపై ఐపీసీ సెక్షన్లు 376, 307 323, 504, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు తెలిపారు.