APPSC Results : ఏపీ అసిస్టెంట్‌ మోటారు వెహికల్స్‌ ఇన్‌స్పెక్టర్‌ ఉద్యోగ ఫలితాలు విడుదల - ఇలా చెక్ చేసుకోండి-appsc announced assistant motor vehicle inspector results check with this link ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Appsc Results : ఏపీ అసిస్టెంట్‌ మోటారు వెహికల్స్‌ ఇన్‌స్పెక్టర్‌ ఉద్యోగ ఫలితాలు విడుదల - ఇలా చెక్ చేసుకోండి

APPSC Results : ఏపీ అసిస్టెంట్‌ మోటారు వెహికల్స్‌ ఇన్‌స్పెక్టర్‌ ఉద్యోగ ఫలితాలు విడుదల - ఇలా చెక్ చేసుకోండి

Maheshwaram Mahendra Chary HT Telugu
Mar 21, 2024 02:04 PM IST

APPSC AMVI Results 2024 Updates: అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ ఉద్యోగాల ఫలితాలను ప్రకటించింది ఏపీపీఎస్సీ. ఈ మేరకు తుది ఫలితాలను వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచింది.

ఏపీపీఎస్సీ ఫలితాలు
ఏపీపీఎస్సీ ఫలితాలు

APPSC AMVI Results 2024 : అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి కీలక అప్డేట్ ఇచ్చింది ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్(APPSC). ఇందుకు సంబంధించిన తుది ఫలితాలను ప్రకటించింది. ఈ మేరకు మార్చి 20వ తేదీన రిజల్ట్స్ ను వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచింది. https://portal-psc.ap.gov.in/Default.aspx వెబ్ సైట్ లోకి వెళ్లి ఎంపికైన వారి జాబితాను చెక్ చేసుకోవచ్చని ఓ ప్రకటనలో పేర్కొంది. 2002లో విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ లో భాగంగా… మొత్తం 17 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. 2023లో రాత పరీక్షలను పూర్తి చేసిన ఏపీపీఎస్సీ…. తాజాగా ఫలితాలను ప్రకటించింది. 

ఇలా చెక్ చేసుకోండి…

  • పరీక్ష రాసిన అభ్యర్థులు ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ https://portal-psc.ap.gov.in/Default.aspx వెబ్ సైట్ లోకి వెళ్లండి.
  • హోంపేజీలో కనిపించే Selection Notification to the post Assistant Motor Vehicle Inspector in A.P. అనే లింక్ పై క్లిక్ చేయండి.
  • మీకు జాబితా ఓపెన్ అవుతుంది. ఇందులో మీ రూల్ నెంబర్స్ ఉంటాయి.
  • జోన్ల వారీగా ఫలితాలను అందుబాటులో ఉంచారు.

గ్రూప్ 1 కేసు… డివిజన్ బెంచ్ కీలక ఉత్తర్వులు…

AP High Court on Group1: ఏపీపీఎస్సీ గ్రూప్‌ 1 పరీక్షల్ని రద్దు చేేస్తూ హైకోర్టు బెంచ్‌ ఇచ్చిన తీర్పుపై డివిజన్‌ బెంచ్ Division Banch స్టే విధించింది. హైకోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం, ఏపీపీఎస్సీ హైకోర్టును ఆశ్రయించడంతో ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. 2018లో ఏపీపీఎస్సీ గ్రూప్‌ 1 పోస్టుల భర్తీ కోసం ఇచ్చిన నోటిఫికేషన్‌ మెయిన్స్ పరీక్షల మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయని కొందరు హైకోర్టును ఆశ్రయించారు. మెయిన్స్‌పేపర్లను మూడు సార్లు దిద్దారని, నోటిఫికేషన్‌లో లేని విధంగా డిజిటల్ మూల్యంకనం చేశారని, కోర్టు ఆదేశాలతో మరో రెండు సార్లు మాన్యువల్ పద్ధతిలో మూల్యాంకనం చేశారని, ఈ క్రమంలో అక్రమాలు జరిగాయని ఆరోపించారు. ఈ క్రమంలో మంగళగిరిలో రెండు సార్లు మూల్యాంకనం చేసినట్టు ఆధారాలను సమర్పించడంతో మార్చి13న సింగల్‌ బెంచ్‌ 2018 గ్రూప్‌1 నియామకాలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. పరీక్షల్లో నిర్వహణలో కమిషన్ విఫలం అయ్యిందని అభిప్రాయపడింది. లోపాల కారణంగా 2018 నోటిఫికేషన్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ వ్యవహారంపై ఏపీపీఎస్సీ హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ను ఆశ్రయించింది. దీంతో విచారణ జరిపిన హైకోర్టు డివిజన్ బెంచ్‌ తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు 2018 నియామకాల్లో ఉద్యోగాల్లో చేరిన వారు విధుల్లో కొనసాగవచ్చని స్పష్టత ఇచ్చింది. కేసు విచారణ వచ్చే వారానికి వాయిదా వేసింది

 

Whats_app_banner