AP Anganwadi Jobs 2024 : ఏపీలో అంగన్వాడీ ఉద్యోగాలు - అర్హతలు, ఖాళీల పూర్తి వివరాలివే
AP Anganwadi Recruitment 2024: అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేసింది విశాఖపట్నం జిల్లాలోని ఐసీడీఎస్ కార్యాలయం. ఇందులో భాగంగా అంగన్‌వాడీ వర్కర్, అంగన్‌వాడీ హెల్పర్ ఖాళీలను భర్తీ చేయనుంది. ఆ వివరాలను ఇక్కడ చూడండి…..
AP Anganwadi Recruitment 2024 Updates: విశాఖపట్నం జిల్లా ఐసీడీఎస్ ప్రాజెక్టుల్లోని అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదలైంది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా…. మొత్తం 39 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇందులో 2 అంగన్వాడీ వర్కర్ పోస్టులు ఉండగా… 37 పోస్టులు అంగన్వాడీ హెల్పర్ ఉద్యోగాలు ఉన్నాయి. అర్హులైన వారు ఫిబ్రవరి 15వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆఫ్ లైన్ లో ఈ దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.
ముఖ్య వివరాలు:
రిక్రూట్ మెంట్ ప్రకటన - ICDS, విశాఖపట్నం జిల్లా.
ఉద్యోగాలు - అంగన్వాడీ పోస్టులు
మొత్తం ఖాళీలు -39 (అంగన్‌వాడీ వర్కర్ - 2 , అంగన్‌వాడీ హెల్పర్- 37 ఉద్యోగాలు)
ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధి పేరు - విశాఖపట్నం, భీమునిపట్నం, పెందుర్తి.
అర్హతలు - పదో తరగతి ఉత్తీర్ణత అయి ఉండాలి.
వయోపరిమితి - 21 నుంచి 35 ఏళ్ల లోపు ఉండాలి.
జీతం - అంగన్‌వాడీ వర్కర్‌కు రూ.11500 ఇస్తారు. అంగన్వాడీ హెల్పర్‌కు రూ.7000 చెల్లిస్తారు.
దరఖాస్తు చేసుకునే అభ్యర్థి స్థానిక ప్రాంత పరిధికి చెందిన మహిళలై ఉండాలి.
దరఖాస్తు విధానం - ఆఫ్ లైన్
పంపాల్సి చిరునామా - విశాఖపట్నం జిల్లాలోని ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయంలో అందజేయాలి.
దరఖాస్తులకు చివరి తేదీ - 15-02-2024.(సాయంత్రం 5 గంటల లోపు అందజేయాల్సి ఉంటుంది)
గడువు ముగిసిన తర్వాత దరఖాస్తులను స్వీకరించరు.
మొత్తం 100 మార్కులకు గాను పారామీటర్స్ తీసుకుంటారు. ఇందులో పది ఉత్తీర్ణతకు 50 మార్కులు, ఇంటర్వూలకు 20 మార్కులు ఉంటాయి.
అధికారిక వెబ్ సైట్ - https://visakhapatnam.ap.gov.in/
పూర్తిస్థాయి నోటిఫికేషన్ తో పాటు ఖాళీల వివరాలను కింద ఇచ్చిన పీడీఎఫ్ లో చూడొచ్చు. అధికారిక వెబ్ సైట్ లో కూడా వివరాలను పొందుపరిచారు.
ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్
AP DSC Notification 2024: ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 6100 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ నెల 12 నుంచి దరఖాస్తు ప్రక్రియ మొదలుకానుంది. ఏప్రిల్ 7న ఫలితాలు ప్రకటిస్తారు. మొత్తం 6100 పోస్టుల్లో 2280 ఎస్జీటీ(SGT) , 1264 టీజీటీ(TGT), 215 పీజీటీ(PGT), 42 ప్రిన్సిపల్ పోస్టులు ఉన్నాయి.
ముఖ్యమైన తేదీలు
డీఎస్సీ అప్లికేషన్లు ప్రారంభం- ఫిబ్రవరి 12
ఫీజులు చెల్లింపునకు చివరి తేదీ - ఫిబ్రవరి 21
అప్లికేషన్లు సబ్మిట్ కు చివరి తేదీ - ఫిబ్రవరి 22
హాల్ టికెట్స్ డౌన్ లోడ్- మార్చి 5 నుంచి
పరీక్షలు నిర్వహణ- మార్చి 15 నుంచి 30 వరకు
పరీక్ష ఫలితాలు - ఏప్రిల్ 7న
2018 డీఎస్సీ ప్రాసెస్ లోనే పరీక్షలు నిర్వహిస్తారు. మార్చి 15 నుంచి మార్చి 30 వరకు పరీక్షలు నిర్వహిస్తారు. రెండు సెషన్స్ లో పరీక్షలు నిర్వహించనున్నారు. 150 నిమిషాల్లో 150 ప్రశ్నలు ఉంటాయి. 150 ప్రశ్నలు మూడు భాగాలుగా ఉంటాయి. జనరల్ నాలెడ్జ్, టీచింగ్ మెథడాలజీ, సబ్జెక్ట్ నాలెడ్జ్ పై పరీక్షలు అడుగుతారు. ఏప్రిల్ 7న ఫలితాలు విడుదల చేస్తారు.
సంబంధిత కథనం