Police Selection lists: ఏపీ పోలీస్ సెలక్షన్స్‌ సివిల్, ఏపీఎస్పీ ఎస్సై జాబితాలు రెడీ, ఇలా చూసుకోండి…-ap police selections civil apsp si selection lists released by apslprb ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Police Selection Lists: ఏపీ పోలీస్ సెలక్షన్స్‌ సివిల్, ఏపీఎస్పీ ఎస్సై జాబితాలు రెడీ, ఇలా చూసుకోండి…

Police Selection lists: ఏపీ పోలీస్ సెలక్షన్స్‌ సివిల్, ఏపీఎస్పీ ఎస్సై జాబితాలు రెడీ, ఇలా చూసుకోండి…

Bolleddu Sarath Chandra HT Telugu
Oct 02, 2024 09:50 AM IST

Police Selection lists: ఆంధ్రప్రదే‌శ్‌ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు చేపట్టిన ఎస్సై సెలక్షన్స్ జాబితా విడుదలైంది. సివిల్‌, ఏపీఎస్సీ విభాగాల్లో 411 ఎస్సై పోస్టులకు ఎంపికైన వారి జాబితాను రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక బోర్డు విడుదల చేసింది.హైకోర్టు ఉత్తర్వులకు లోబడి నియామకాలు ఉంటాయని ప్రకటించింది.

ఏపీ ఎస్సై సెలక్షన్‌ లిస్ట్‌ విడుదల చేసిన పోలీస్ రిక్రూట్‌మెంట్‌ బోర్డు
ఏపీ ఎస్సై సెలక్షన్‌ లిస్ట్‌ విడుదల చేసిన పోలీస్ రిక్రూట్‌మెంట్‌ బోర్డు

Police Selection lists: ఏపీ పోలీస్‌ స్టైపెండరీ క్యాడెట్‌ సెలక్షన్లలో భాగంగా చేపట్టిన సివిల్‌, ఏపీఎస్పీ విభాగాల్లో ఎస్సై‌ జాబితాలు విడుదలయ్యాయి. 2022 నవంబర్ 28న 6100 పోస్టుల భర్తీకి ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్‌ ఇచ్చింది. వీటిలో 3580 కానిస్టేబుల్‌ పోస్టులు 2520 ఏపీఎస్సీ ఏపీఎస్పీ కానిస్టేబుల్ పోస్టులు ఉన్నాయి. మరో 411 ఎస్సై పోస్టుల భర్తీకి కూడా నోటిఫికేషన్ ఇచ్చారు.

వీటిలో 315 సివిల్‌ ఎస్సై‌ పోస్టులు,మరో 96 ఏపీఎస్పీ రిజర్వ్‌ ఎస్సై పోస్టులు ఉన్నాయి. తాజాగా సివిల్‌ ఎస్సైలు, ఏపీఎస్పీ ఎస్సైల నియామకాల్లో ఎంపికైన వారి జాబితాను పోలీస్ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ప్రకటించింది. రేంజీల వారీగా ఎంపికైన వారి జాబితాను వెల్లడించింది.

ఏపీ పోలీస్ రిక్రూట్‌మెంట్‌ బోర్డు సివిల్‌ ఎస్సై ఎంపిక జాబితా కోసం లింక్‌ క్లిక్ చేయండి…

https://slprb.ap.gov.in/PDFS/Selection_Web_SD11.pdf

ఏపీ పోలీస్ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ఏపీఎస్పీ ఎస్సైల ఎంపిక జాబితా కోసం లింక్‌ క్లిక్ చేయండి…

https://slprb.ap.gov.in/PDFS/Selection_Web_SD13.pdf

రేంజీల వారీగా జాబితాలు రెడీ

ఎస్సై జాబితాల్లో రేంజీల వారీగా సెలక్షన్‌ లిస్ట్‌ను ప్రకటించారు. విశాఖపట్నం రేంజ్ పరిధిలో 50మంది, ఏలూరు రేంజ్‌లో 105,గుంటూరు రేంజ్‌లో 55, కర్నూలు రేంజ్‌లో 103మందిని ఎంపిక చేశారు. తాజాగా ఎంపికలు హైకోర్టు తుది ఉత్తర్వులకు లోబటి ఉంటాయని, సర్టిఫికెట్ల పరిశీలన, మెడికల్ పరీక్షలకు లోబడి నియామక ప్రక్రియ ఉంటుందని స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ఛైర్మన్ అతుల్‌ సింగ్ తెలిపారు.

డిసెంబర్‌లోగా నియామకాలు పూర్తి…

ఆంధ్రప్రదేశ్ లో అర్ధాంతరంగా ఆగిపోయిన కానిస్టేబుల్ నియామక ప్రక్రియను సత్వరమే చేపట్టేందుకు కూటమి ప్రభుత్వం దృష్టి సారించిందని హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. 6,100 కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీకి సంబంధించిన శారీరక సామర్థ్య (పీఎంటీ,పీఈటీ) పరీక్షలను ఐదు నెలల్లోగా పూర్తి చేస్తామని ఆమె స్పష్టం చేశారు.

గత 2022 కాలంలో నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షకు 4,59,182 మంది హాజరుకాగా అందులో 95,209 మంది తదుపరి దశకు ఎంపికయ్యారన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు సహా పలు కారణాల వల్ల వాయిదా పడడంతో పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో కానిస్టేబుల్ (సివిల్)- 3580; కానిస్టేబుల్ (APSP) -2520 పోస్టుల ప్రక్రియ వాయిదా పడిందన్నారు.

ప్రిలిమినరీ వ్రాత పరీక్షకు మొత్తం 3,622 మంది హోంగార్డులు హాజరవగా అందులో 382 మంది హోంగార్డులు మాత్రమే అర్హత సాధించారన్నారు. ప్రిలిమినరీ రాత పరీక్షలో అర్హత సాధించని 100 మంది హోంగార్డులు 14 రిట్ పిటిషన్లను హైకోర్టులో వేశారు. "హోంగార్డులను ప్రత్యేక కేటగిరీగా పరిగణించడం ద్వారా హోంగార్డుల కోటాలో ప్రత్యేక మెరిట్ జాబితాను ప్రకటించాలని వారు కోర్టును కోరారు. ఆ వంద మంది హోంగార్డులను తదుపరి దశకు అనుమతించాలని న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిందని హోం మంత్రి వివరించారు.

అప్పటి నుంచి రిక్రూట్మెంట్ ప్రక్రియను గత ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోకుండా నిలిపివేసిన విషయాన్ని హోంమంత్రి గుర్తు చేశారు. ఈ విషయం ప్రస్తుత కూటమి ప్రభుత్వం దృష్టికి వచ్చాకా, దీనిపై న్యాయ సలహా తీసుకొని.. ఆ సలహా మేరకు ఈ రిక్రూట్మెంట్ ప్రక్రియలో రెండవ దశ (PMT/PET)ను వెంటనే కొనసాగించాలని నిర్ణయం తీసుకుందన్నారు.

దీనికి సంబంధించి రెండవ దశ అప్లికేషన్ ఫారం నింపడానికి, భర్తీ ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలను స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (slprb.ap.gov.in) వెబ్సైట్‌లో పొందుపరుస్తామని హోం శాఖా మంత్రి అనిత పేర్కొన్నారు. రెండవ ధశలో ఉత్తీర్ణులైన వారికి మూడవ దశ ప్రధాన పరీక్ష (Final Written Exam) జరుగుతుందని హోం శాఖా మంత్రి తెలిపారు.