AP Govt : విద్యుత్తు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. జీతాలు పెంపు
AP Electricity Outsourcing Employees:విద్యుత్తు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది ఏపీ ప్రభుత్వం. జీతాలు పెంచటమే కాకుండా… బీమా సదుపాయం కల్పిస్తూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు.
AP Electricity Outsourcing Employees Salary: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యుత్తు శాఖలోని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగులకు జీతాలు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. విద్యుత్ శాఖలోని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వం 37 శాతం వేతనాలు పెంచింది. ఈ మేరకు విద్యుత్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ నిర్ణయంతో విద్యుత్ శాఖలోని దాదాపు 27,000 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. దీంతోపాటు ఉద్యోగులకు గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యాలు కల్పించాలని కాంట్రాక్ట్ ఏజెన్సీలను ప్రభుత్వం ఆదేశించింది. ముఖ్యమంత్రి జగన్మోన్ రెడ్డి తీసుకున్న నిర్ణయంతో విద్యుత్ శాఖలోని పొరుగు సేవల ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయంతో విద్యుత్ శాఖలోని దాదాపు 27,000 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది.
రూ.21 వేలకు పెరగనున్న ఉద్యోగుల ఆదాయం..
ఇటీవల పెరిగిన జీతాల వల్ల ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల ఆదాయం రూ.21వేలకు పైగా చేరింది. అదనంగా, ఉద్యోగులకు గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యాలు కల్పించాలని కాంట్రాక్ట్ ఏజెన్సీలను ప్రభుత్వం ఆదేశించింది. మెరుగైన వేతనం, బీమా కవరేజీని అందజేస్తుండటంపై ఆయా ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.