Veligonda Tunnels: నేడు వెలిగొండ జంట సొరంగాలను ప్రారంభించనున్న సిఎం జగన్.. ఫలించిన దశాబ్దాల నిరీక్షణ..-ap cm jagan will inaugurate veligonda twin tunnels today ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Veligonda Tunnels: నేడు వెలిగొండ జంట సొరంగాలను ప్రారంభించనున్న సిఎం జగన్.. ఫలించిన దశాబ్దాల నిరీక్షణ..

Veligonda Tunnels: నేడు వెలిగొండ జంట సొరంగాలను ప్రారంభించనున్న సిఎం జగన్.. ఫలించిన దశాబ్దాల నిరీక్షణ..

Sarath chandra.B HT Telugu
Mar 06, 2024 06:33 AM IST

Veligonda Tunnels: ప్రకాశం జిల్లా ప్రజల చిరకాల స్వప్నం నేడు నెరవేరబోతోంది. దశాబ్దాల నిరీక్షణ ఫలించే సమయం ఆసన్నమైంది. పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు జంట సొరంగాలను సిఎం జగన్ నేడు జాతికి అంకితం చేయనున్నారు.

నేడు వెలిగొండ జంట సొరంగాలను జాతికి అంకితం చేయనున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి
నేడు వెలిగొండ జంట సొరంగాలను జాతికి అంకితం చేయనున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి

Veligonda Tunnels: ఆంధ్రప్రదేశ్ సాగునీటి ప్రాజెక్టుల చరిత్రలో మరో క్లిష్టమైన ప్రాజెక్టు నిర్మాణం పూర్తైంది. వైఎస్ రాజశేఖర్‌ రెడ్డి హయంలో ప్రకాశం జిల్లాను సశ్యశ్యామలం చేసే లక్ష్యంతో ప్రారంభించినPulasubbayya veligonda

 పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టులో కీలకమైన సొరంగాలTunnels Construction నిర్మాణం పూర్తి కావడంతో వాటిని జాతికి అంకితం చేయనున్నారు. 2004లో వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా శంకుస్థాపన చేసిన వెలిగొండ ప్రాజెక్టును ఇరవై ఏళ్ల తర్వాత ముఖ్యమంత్రి హోదాలో సిఎం జగన్ Cm Jagan ప్రారంభించనున్నారు.

ఇందుకోసం సీఎం వైఎస్‌ జగన్‌ బుధవారం ప్రకాశం Prakasam District జిల్లాలో పర్యటించనున్నారు. ఇందుకోసం బుధవారం ఉదయం 9.30 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి దోర్నాల మండలం ఎగువ చెర్లోపల్లికి సీఎం జగన్‌ చేరుకుంటారు. సాంకేతికంగా ఎన్నో అవరోధాలను అధిగమించి ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేశారు. టన్నెల్ బోరింగ్ యంత్రాల సాయంతో కొండల్ని తొలిచి కృష్ణా జలాలను దుర్బిక్ష ప్రాంతాలకు తరలిస్తున్నారు.

వెలిగొండ ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తున్న నేపథ్యంలో అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొని పైలాన్‌ను ఆవిష్కరిస్తారు. అనంతరం వ్యూ పాయింట్‌ నుంచి వెలిగొండ ప్రాజెక్ట్‌ను, రెండో టన్నెల్‌ను పరిశీలిస్తారు. ఆ తర్వాత పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు రెండో టన్నెల్‌ను సీఎం జగన్‌ జాతికి అంకితం చేస్తారు.

దశాబ్దాల నిరీక్షణ…

ఒకవైపు వరద జలాలను ఒడిసి పట్టి, ఫ్లోరైడ్ ప్రభావిత, మెట్ట ప్రాంతాలకు త్రాగు, సాగునీరు అందించి సస్యశ్యామలం చేసే సంకల్పంతో వెలిగొండ ప్రాజెక్టు మొదటి టన్నెల్ ను నవంబర్ 2021లో ప్రారంభించారు. రెండో టన్నెల్ ను జనవరి 2024లో పూర్తి చేశారు. బుధవారం జంట సొరంగాలను సిఎం ప్రారంభించనున్నారు.

ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, వైఎస్సార్ జిల్లాల్లోని ఫ్లోరైడ్ ప్రభావిత, మెట్ట ప్రాంతాలైన 30 మండలాల్లో 15.25 లక్షల జనాభాకు త్రాగునీరు, 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు రెండు సొరంగాలతో నీటిని తరలించే ప్రాజెక్టును రాజశేఖర్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రారంభించారు. ఆ తర్వాత ఆ పథకం రకరకాల కారణాలతో ఆలస్యమైంది. ఎట్టకేలకు నిర్మాణం పూర్త చేసుకున్న ప్రాజెక్టును నేడు ప్రకాశం జిల్లా దోర్నాల మండలం ఎగువ చెర్లోపల్లి వద్ద ప్రారంభించనున్నారు.

పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు - విశిష్టతలు..

పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టును రూ. 10,010.54 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టారు. శ్రీశైలం రిజర్వాయర్ కు ఎగువన 841 మీటర్ల నీటిమట్టం (సిల్ లెవెల్) నుండి కొల్లం వాగు ద్వారా కృష్ణా జలాల తరలిస్తారు.

ప్రాజెక్టు నిర్మాణంతో 4,47,300 ఎకరాలకు సాగునీటితో పాటు 15.25 లక్షల మందికి తాగునీరుఅందుతుంది. ప్రకాశం, వైఎస్సార్, నెల్లూరు జిల్లాల్లోని 30 మండలాలకు నీటిని అందిస్తారు.

మొదటి దశ కెనాల్ డిస్ట్రిబ్యూటరీ ద్వారా ప్రకాశం జిల్లా పరిధిలో 1,19,000 ఎకరాలకు సాగు నీరు అందిస్తారు. 4 లక్షల మందికి త్రాగు నీటిని అందిస్తారు.

రెండవ దశ కెనాల్ డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థలతో ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్ జిల్లాల్లో 3,28,300 ఎకరాలకు సాగు నీరు, 11.25 లక్షల మందికి త్రాగు నీరు అందుతుంది. నల్లమల సాగర్ రిజర్వాయర్ సామర్థ్యం - 53.85 టీఎంసీలతో నిర్మించారు.

వెలిగొండ ప్రాజెక్టు పూర్తి కావడంతో పలు అనుబంధ పథకాలకు లబ్ది చేకూరనుంది. రూ. 33.82 కోట్లతో వెలగలపాయ ఎత్తిపోతల పథకం ద్వారా అర్ధవీడు మండలంలోని 9 గ్రామాల్లో 4,500 ఎకరాలకు సాగునీరు అందిస్తారు.

పాపినేనిపల్లి వద్ద రూ.17.34 కోట్లతో నిర్మించనున్న ఎత్తిపోతల పథకం ద్వారా అర్ధవీడు మండలంలోని 7 గ్రామాల్లో 8,500 ఎకరాలకు సాగునీరు అందిస్తారు.

రాళ్లపాడు రిజర్వాయర్ క్రింద 16,000 ఎకరాల ఆయకట్టును స్థిరీకరించేందుకు వెలిగొండ ప్రాజెక్టు నీటిని అందిస్తదారు. తూర్పు ప్రధాన కాలువ ద్వారా 1.6 టీఎంసీల సాగు నీటిని తరలిస్తారు.

పశ్చిమ ప్రకాశంలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 1,657 గ్రామాలకు వాటర్ గ్రిడ్ పథకం ద్వారా నల్లమల సాగర్ రిజర్వాయర్ నుండి 2.25 టీఎంసీల తాగు నీటిని అందిస్తారు.

ప్రకాశం జిల్లా దొనకొండ వద్ద 24,358 ఎకరాల విస్తీర్ణంలో ఏపీఐఐసి నిర్మించనున్న మెగా ఇండస్ట్రియల్ హబ్ కు నల్లమల సాగర్ రిజర్వాయర్ నుండి 2.58 టీఎంసీల నీటి సరఫరా చేస్తారు.

ప్రకాశం జిల్లా పామూరు, పెదచెర్లోపల్లి మండలాల పరిధిలో 14 వేల ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్న నేషనల్ ఇన్వెస్ట్ మెంట్ అంద్ మాన్యుఫ్యాక్టరింగ్ జోన్ (NIMZ) కు వెలిగొండ ప్రాజెక్టు తూర్పు ప్రధాన కాలువ ద్వారా 1.27 టీఎంసీల నీటి సరఫరా చేస్తారు.

వెలిగొండ జంట టన్నెల్స్ పూర్తయిన నేపథ్యంలో ఆర్ అండ్ ఆర్ ను కూడా త్వరలో పూర్తి చేసి ఇక వచ్చే సీజన్ లో నల్లమల సాగర్ లో నీళ్లు నింపుతారు.

 

Whats_app_banner