CID Remand Report: స్కిల్ స్కామ్‍లో A 37గా చంద్రబాబు, లోకేశ్ పేరు ప్రస్తావన, రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు-ap cid produces cm chandrababu naidu before acb court filed remand report ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Cid Remand Report: స్కిల్ స్కామ్‍లో A 37గా చంద్రబాబు, లోకేశ్ పేరు ప్రస్తావన, రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు

CID Remand Report: స్కిల్ స్కామ్‍లో A 37గా చంద్రబాబు, లోకేశ్ పేరు ప్రస్తావన, రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు

HT Telugu Desk HT Telugu
Sep 10, 2023 11:15 AM IST

Chandrababu Remand Report:స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబును ప్రధాన కుట్రదారుగా పేర్కొంది ఏపీ సీఐడీ. ఈ మేరకు ఏసీబీ కోర్టులో రిమాండ్ రిపోర్టును సమర్పించింది. మొత్తం 28 పేజీలతో కూడిన నివేదికను కోర్టుకు అందజేసింది.

ఏసీబీ కోర్టులో చంద్రబాబు
ఏసీబీ కోర్టులో చంద్రబాబు

Chandrababu Remand Report: చంద్రబాబు అరెస్ట్ వ్యవహరంలో ఏపీ సీఐడీ రిమాండ్ రిపోర్టను సమర్పించింది. ఆదివారం ఉదయమే చంద్రబాబును విజయవాడలోని ఏసీబీ కోర్టుకు తరలించింది ఏపీ సీఐడీ. న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టింది. ఇక చంద్రబాబు తరపున సిద్దార్ధ్‌ లూథ్రా వాదనలు వినిపిస్తున్నారు. ప్రభుత్వం తరపున

yearly horoscope entry point

28 పేజీల రిమాండ్ రిపోర్టు…

చంద్రబాబు సీఐడీ రిమాండ్‌ రిపోర్టులో కీలక విషయాలను పేర్కొంది సీఐడీ. స్కిల్‌ స్కామ్‌లో చంద్రబాబుకు పూర్తి అవగాహన ఉందని పేర్కొంది. ఆయన ప్రధాన కుట్రదారుడని తెలిపింది. ఇల్లందుల రమేశ్‌ ద్వారా డిజైన్‌టెక్ సీమెన్స్‌ ప్రతినిధులు చంద్రబాబును కలిశారని తెలిపింది. రిమాండ్‌ రిపోర్టులో నారా లోకేశ్‌ పేరును కూడా ప్రస్తావించింది ఏపీ సీఐడీ. చంద్రబాబు సన్నిహితుడు కిలారి రాజేశ్‌ ద్వారా లోకేశ్‌కు డబ్బులు అందినట్లు ఇందులో వివరించింది.

మొత్తం 28 పేజీలతో కూడిన రిమాండ్ రిపోర్టులో ఏ37గా చంద్రబాబును పేర్కొంది సీఐడీ. సీమెన్స్ కంపెనీకి ప్రభుత్వ వాటాగా రూ.371 కోట్లు చెల్లించారని, అందులోని 270 కోట్లను షెల్ కంపెనీలకు మళ్లించారని వెల్లడించింది. ఇల్లందు రమేశ్ ద్వారా డిజైన్ టెక్, సీమెన్స్ ప్రతినిధులను చంద్రబాబు కలిశారని, క్యాబినెట్ తీర్మానాన్ని పక్కబెట్టి గంటా సుబ్బారావు, లక్ష్మీనారాయణ వంటి అధికారులతో కుట్రపన్నారని ఆరోపించింది.

స్కిల్‌ స్కామ్‌లో ప్రభుత్వానికి రూ.300 కోట్లు నష్టం జరిగిందని సీఐడీ తెలిపింది. ప్రభుత్వ నిధుల్లో భారీ మొత్తం షెల్‌ కంపెనీలకు తరలించారని… చంద్రబాబు డైరెక్షన్‌లోనే ప్రభుత్వం నిధులు షెల్‌ కంపెనీలకు మళ్లించారని తెలిపింది.

డిజైన్ టెక్ సంస్థ… కొన్ని సంస్థలకు నిధులు బదిలీ చేసిన సమయంలో జీఎస్టీ ఎగవేసిందని రిమాండ్ రిపోర్టులో సీఐడీ పేర్కొంది.

ఈ కేసులో మరింత విచారణకు చంద్రబాబును 15 రోజుల పాటు కస్టడీకి తీసుకోవాల్సి ఉందని అభిప్రాయపడింది.

ఈ కేసులో ఏ1గా గంటా సుబ్బారావును పేర్కొన్నారు సీఐడీ అధికారులు. నిధుల మ‌ళ్ళింపుపై అప్ప‌టి ఫైనాన్స్ సెక్ర‌ట‌రీ అబ్జెక్ష‌న్ చెప్పినా చంద్ర‌బాబు ప‌ట్టించుకోలేద‌ని, కేబినెట్ మంత్రుల‌కు కూడా స‌మాచారం ఇవ్వ‌కుండా నిధులు మ‌ళ్ళించార‌ని రిమాండ్ రిపోర్ట్‌లో వివరించింది.

చంద్రబాబు సన్నిహితుడు కిలారు రాజేష్ ద్వారా నారా లోకేష్ కు డబ్బులు అందినట్టు రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు.

కేవలం కంపెనీల ప్రతినిధులు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజంటేషన్ ల ఆధారంగానే ప్రాజెక్టుకు ఆమోదం చెప్పారని సీఐడీ ప్రస్తావించింది.

ఎలాంటి పర్‌ఫామెన్స్ గ్యారంటీ, బ్యాంకు గ్యారంటీలు లేకుండానే ప్రభుత్వం రూ.371 కోట్లను డిజైన్‌టెక్ కు ఇచ్చేసింది అప్పటి ప్రభుత్వం. అప్పటి ఆర్థిక శాఖ కార్యదర్శి కె.సునీత వ్యక్తం చేసిన అభ్యంతరాలను కూడా పట్టించుకోలేదని రిమాండ్ రిపోర్టులో వివరించింది.

ఈ కేసులో మనోజ్ వాసుదేవ్‌కు సెప్టెంబర్ 5న నోటీసులు ఇచ్చామని సీఐడీ వెల్లడించింది. అయితే తమ నోటీసులకు జవాబు ఇవ్వకుండా విదేశాలకు పారిపోయారని ప్రస్తావించింది.

దొండపాటి వెంకట హరీష్ అనే IRSఅధికారి నోటీసులు జారీ అయ్యాయని తెలిపింది. ప్రస్తుతం పెండ్యాల శ్రీనివాస్ పరారీలో ఉన్నట్లు రిమాండ్ రిపోర్టులో రాసుకొచ్చింది. ప్రభుత్వ ఉద్యోగి గా ఉంటూ ప్రభుత్వ అనుమతి లేకుండా ఈ నెల 6 న అమెరికాకు పెండ్యాల శ్రీనివాస్ వెళ్లారని చెప్పింది.

2021లో నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లో చంద్రబాబు పేరు లేదు. అయితే సీఐడీ దాఖలు చేసిన రిమాండ్ రిపోర్టులో చంద్రబాబు పేరు కూడా చేర్చింది. సీఐడీ డీఎస్పీ ధనుంజయుడు పేరు మీద ఈ రిపోర్టును సమర్పించింది.

మరోవైపు ఈ కేసుకు సంబంధించి వాదనలు కొనసాగుతున్నాయి. న్యాయస్థానంలో చంద్రబాబు స్టేట్ మెంట్ రికార్డు పూర్తి అయింది. తన వాదనకు అవకాశం ఇవ్వాలని చంద్రబాబు కోరటంతో.... స్వయంగా వాదనలు వినిపించారు చంద్రబాబు. తన అరెస్ట్ అక్రమమని చెప్పారు. స్కిల్ స్కామ్ తో తనకు ఎలాంటి సంబంధం లేదని... రాజకీయ కక్షతోనే అరెస్ట్ చేశారని తెలిపారు.

ఇక ఇటీవలే చంద్రబాబుకు అందిన ఇన్ కమ్ ట్యాక్స్ నోటీసుల అంశాన్ని కూడా రిమాండ్ రిపోర్టులో ప్రస్తావించారు అధికారులు. ఇరువైపు వాదనల విన్న తర్వాత… కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

Whats_app_banner