AP Employees Transfers : ఏపీలో ఉద్యోగుల బదిలీల గడువు పొడిగింపు - మరో 15 రోజులు ఛాన్స్-another 15 days extension for transfer of employees in andhrapradesh ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Employees Transfers : ఏపీలో ఉద్యోగుల బదిలీల గడువు పొడిగింపు - మరో 15 రోజులు ఛాన్స్

AP Employees Transfers : ఏపీలో ఉద్యోగుల బదిలీల గడువు పొడిగింపు - మరో 15 రోజులు ఛాన్స్

Maheshwaram Mahendra Chary HT Telugu
Aug 30, 2024 02:39 PM IST

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల బదిలీల ప్రక్రియ కోసం మరో 15 రోజుల గడువు పొడిగించింది. సెప్టెంబర్ 16వ తేదీ నుంచి బదిలీలపై నిషేధం అమల్లోకి వస్తుందని తాజాగా ఉత్తర్వులను జారీ చేసింది.

ఏపీలో ఉద్యోగుల బదిలీలు
ఏపీలో ఉద్యోగుల బదిలీలు

ఉద్యోగుల బదిలీలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ప్రక్రియకు మరో 15 రోజుల గడువును పొడిగించింది. వచ్చే నెల 15వ తేదీ వరకు బదిలీలపై నిషేధం ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 16వ తేదీ నుంచి బదిలీలపై నిషేధం అమల్లోకి వస్తుందని స్పష్టం చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.

15 రోజుల గడువు పెంపు…

ప్రభుత్వ నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం… ఈ బదిలీల గడువు ఆగస్టు 31తో ముగియాల్సి ఉంది. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి మళ్లీ నిషేధం అమల్లోకి వస్తుందని సర్కార్ ప్రకటించింది. అయితే పలు శాఖల్లో బదిలీలపై ప్రక్రియ అనుకున్నంత వేగంగా ముందుకు సాగటం లేదు. వీటిలో కీలకమైన రిజిస్ట్రేషన్ శాఖ కూడా ఉంది. మరో కీలకమైన శాఖలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. దాదాపు చాలా శాఖల్లో బదిలీల ప్రక్రియ రేపటితో పూర్తి కానుంది. తాజా పరిస్థితుల నేపథ్యంలో… ఈ గడువును 15 రోజులపాటు పెంచుతూ సర్కార్ ఉత్తర్వులను జారీ చేసింది.

మరోవైపు రాష్ట్రంలోని గ్రామ,వార్డు సచివాలయాల ఉద్యోగుల బదిలీలు తాత్కాలికంగా వాయిదా పడ్డాయి. షెడ్యూల్ ప్రకారం గురువారం కౌన్సెలింగ్ నిర్వహించి బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలి. వీటిలో కొన్ని కేటగిరీల్లో ఉద్యోగులను బదిలీ చేసినా సెప్టెంబరులో పింఛన్ల పంపిణీ దృష్ట్యా తదుపరి ఆదేశాలు వెలువడే వరకు వారిని రిలీవ్ చేయొద్దని కలెక్టర్లకు రాష్ట్ర సచివాలయాల శాఖ ఉత్తర్వులు ఇచ్చింది. తదుపరి ఆదేశాలు ఇచ్చాకే వీరి బదిలీల పక్రియను చేపట్టాలని కలెక్టర్లకు‌ సూచించింది.

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా సెప్టెంబర్ నెలకు సంబంధించిన పింఛను పంపిణీ మార్గదర్శకాలు విడుదల అయ్యాయి.‌ పింఛన్ల పంపిణీ పూర్తయ్యే వరకు బదిలీ అయిన సిబ్బందిని రిలీవ్ చేయద్దు అని ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. అయితే సెప్టెంబర్ 1న ఆదివారం కావడంతో ఈనెల 31, సెప్టెంబర్ 2న పింఛన్ల పంపిణీ చేయాలని ప్రభుత్వం తాజాగా ఆదేశాలు జారీ చేసింది. తదుపరి కౌన్సెలింగ్ తేదీలను ఇంకా ప్రకటించలేదు.

ప్రస్తుతం జరుగుతున్న బదిలీలలో భాగంగా… కొందరికి మినహాయించారు. ప్రజలకు అందాల్సిన సేవల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారు. విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ (గ్రేడ్-II), విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్, విలేజ్ సెరికల్చర్ అసిస్టెంట్, పశుసంవర్ధక సహాయకుడు, విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్, ఎఎన్ఎం గ్రేడ్-III/వార్డు ఆరోగ్య కార్యదర్శి పోస్టుల్లో ఉన్న సిబ్బందిని బదిలీల నుంచి మినహాయించారు.

టాపిక్